twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆగడు’ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆగడు' సినిమా థియేటర్లలోకి రానే వచ్చింది. ఘట్టమనేని రమేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.

    దూకుడు లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

    సినిమాపై పబ్లిక్ టాక్ ఫర్వాలేదనే విధంగా ఉంది. మహేష్ బాబు అభిమానులు సినిమా సూపర్, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, మహేష్ బాబు ఇరగదీసాడు, బ్రహ్మీకామెడీ అదరగొట్టాడు అంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఎబో యావరేజ్ అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సినిమా వినోదాత్మకంగా, బాగా నవ్వుకునే విధంగా ఉందనే కామన్ పాయింట్ వినిపిస్తోంది.

    సినిమా చూసిన పలువురు తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వ్యక్త పరుస్తున్నారు.

    Jai kumar @princejaikumar

    Jai kumar @princejaikumar


    ఆగడు ప్రీమియర్ షో చూసాను. ఫస్టాఫ్ ఫుల్ రేసీ, గుడ్ ఎంటర్టెన్మెంట్. సెకండాఫ్ రొటీన్ రివేంజ్ డ్రామా.

    SRTrendulkar @SRTrendulkar

    SRTrendulkar @SRTrendulkar


    శ్రీను వైట్ల మరోసారి స్పూప్స్ పై ఆధార పడ్డాడు. కొత్త రైటర్లు ఓకే. సాంగ్స్ పిక్చరైజేషన్ గుడ్. కంటెంట్ పరంగా దూకుడు 2 లెస్ సెంటిమెంట్.

    Nenoka KaNTRi @Asi_Tarak

    Nenoka KaNTRi @Asi_Tarak


    ఫస్టాఫ్ యావరేజ్. పోలీస్ పీపుల్ తో కామెడీ గబ్బర్ సింగ్ మాదిరి ఉంది. ఆగడు సెకండాఫ్ లో కామెడీ కన్నా బాద్ షా కామెడీ అని టాక్. ఫైట్స్ కామెడీగా ఉన్నాయి. డైలాగ్స్ సోది. పాసకోసం ప్రాకులాట.

    Sha @shatweeted

    Sha @shatweeted


    ఫస్టాఫ్ ఎంటర్టెనింగుగా ఉంది. బ్రహ్మానందం ఉన్న కొన్ని సీన్లు తప్పిస్తే సెకండాఫ్ బోరింగుగా ఉంది. రియల్లీ డిసప్పాయింటెడ్.

    Rajesh @rajeshrach

    Rajesh @rajeshrach


    ఫస్టాఫ్ ఫినిష్. ఆగడు సినిమాని శ్రీను వైట్ల తీసాడా? అని డౌట్ వచ్చింది. ఇప్పటి వరకు ఏమీ లేదు సినిమాలో...

    Reddy Vinod @vinodbabu1118

    Reddy Vinod @vinodbabu1118


    యావరేజ్ సీన్స్+మహేష్ బాబు=రఫ్ సీన్స్. మహేష్ మహేష్ మహేష్ షో ఆల్ ది వే. ఫస్టాప్ గుడ్. మహేష్ బాబు కామిక్ టైమింగుకు ఎవరూ మ్యాచ్ కారు.

    YATHI @ursyathi

    YATHI @ursyathi


    ఆగడు ఫస్టాఫ్: మహేష్ బాబు తన పాత్రకు న్యాయం చేసాడు. కామెడీ జస్ట్ ఓకే. డైలాగ్స్, ఫైట్స్ పార్ బిలో యాజ్ ఆఫ్ నౌ. జంక్షన్లో సాంగ్ సూపర్. శృతి డాన్స్ కి రెస్పాన్స్ అదిరింది.

    Hari Krishna Raju @harikraju

    Hari Krishna Raju @harikraju


    ఫస్టాఫ్‌లో కథ లేదు కానీ...అక్కడక్కడ నవ్వించి ఫ్యాన్స్ ని అలరించి...ఫస్టాఫ్ అయింది అనిపించారు. సెండాప్ కోసం వెయిటింగ్. సెకండాఫ్ తో పాటు స్టోరీ కూడా మొదలైంది. గుడ్ టేక్ ఆప్. ఆగడు సినిమాలో కామెడీ సీన్స్ కన్నా డాన్స్ చాలా ఎంటర్టెనింగుగా ఉన్నాయి.

    Satya PSPK @satyanag

    Satya PSPK @satyanag


    ఫస్టాప్ యావరేజ్. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఓకే. కామెడీ వేస్ట్. ఎవడూ నవ్వడం లేదు.

    Sharath Sai @SharathsaiH

    Sharath Sai @SharathsaiH


    ఫస్టాఫ్ ఫర్వ లేదు. ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నోడు డిసప్పాయింట్ అవ్వడం పక్కా. బాబు స్క్రీన్ ప్రసెన్స్ మాత్రం అందరినీ డామినేట్ చేసి దొబ్బింది. ఆగడు పంచ్ డైలాగ్స్ మీద విరక్తి వచ్చే లాగ ఉన్నాయి డైలాగ్స్ గ్యాప్ లేకుండా. కోన లేని ఎఫెక్ట్ వల్ల వైట్ల రేంజిలో కామెడీ పండలేదు.

    English summary
    Superstar Mahesh Babu's latest outing Aagadu has been creating positive buzz in the media, ever since Dookudu fame director Srinu Vaitla announced it. Its music and promos have soared up the viewers' curiosity sky high. Its makers' unique promotional strategies have added lot of hype to this project, which has released in a record number of screens across the globe today (September 19).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X