twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగడు...ఆస్కార్: రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఏసాడు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలో ఉండే రామ్ గోపాల్ వర్మ ఈ సారి మహేష్ బాబు ‘ఆగడు' సినిమాపై పడ్డాడు. ‘ఆగడు' 75 కోట్ల సినిమా అయితే ‘మగధీర' 750 కోట్ల సినిమా అవుతుందని సెటైర్లు వేసిన వర్మ....మరోసారి తన ట్విట్టర్లో ‘ఆగడు' సినిమా ప్రస్తావన తెచ్చారు.

    ‘ఆగడు చిత్రంలోని డైలాగ్ అండ్ డైలాగ్ మ్యాడ్యులేషన్స్ స్పెషల్ అవార్డు కోసం ఆస్కార్‌కు పంపాలి. వారు నిజంగా ప్రపంచ సినిమాలో నిలబడతారు' అంటూ వర్మ సెటైర్లు వేసారు. అదే విధంగా ఆగడు సినిమాలో ప్రకాష్ రాజ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రోల్ మిస్సయ్యాడు. ఐ ఫీల్ సారీ అంటూ వర్మ వ్యాఖ్యానించారు. డైరెక్షన్ విభాగంలో ఓ గొడవ కారణంగా ‘ఆగడు' సినిమా నుండి ప్రకాష్ రాజ్ ను తప్పించి సోనూసూద్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    ఇంతటితో వర్మ ‘ఆగడు'పై తన ట్విట్టర్ బాణాలు ఆపాడనుకుటే పొరపాటే....మరో పొడవాటి బాణం వేసాడు. శ్రీను వైట్ల, మహేష్ బాబుల సబ్జెక్టివ్ డెరివేషన్ చూస్తే లియోనార్డో కాప్రియో మరియు మార్టిన్ స్కోర్సెస్ గుర్తొస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వర్మ. సాధారణంగా ఇతర సినిమాల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని వర్మ ఈ సారి మహేష్ బాబు-శ్రీను వైట్ల సినిమాను టార్గెట్ చేయడం వెనక కారణం ఏమిటో?

    English summary
    "The dialogue and dialogue modulations of "Aagadu" should be sent to Oscars on a special award...They will truly stand out in world cinema. The subjective derivation of Srinu vaitla and Mahesh babu reminds me of a spiritualistic intercourse of leonordo caprio nd Martin scorcese" Ram Gopal Varma said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X