twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి వారసుడు నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం ‘ఆంధ్రాపోరి'. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శ‌కుడు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

    Aakash Puri's 'Andhra Pori' on May 15th

    ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... చిత్ర‌నిర్మాత ర‌మేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుండి వ‌స్తోన్న ప్రొడక్ష‌న్ 30 మూవీ ఆంధ్రాపోరి. ఇటీవల ఈ చిత్రం చిత్రీకరణని పూర్తి చేసుకుంది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయాలనుకుంటున్నాం. దర్శకుడు రాజ్ మాదిరాజు మా బ్యాన‌ర్‌లోనే గ‌తంలో రుషి సినిమాని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు త‌ను మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇందులో పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్‌, ఉల్కా గుప్తాలు మెయిన్ లీడ్స్ లో చక్కగా నటించారు. మరాఠిలో టైమ్ పాస్ పేరుతో మంచి స‌క్సెస్‌ను సాధించిన ఈ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌లో ఓ క‌మిట్ మెంట్‌తో రూపొందించాం. దర్శకుడు ఈ సినిమాని చెప్పిన సమయంలో, బడ్జెట్ లో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం 35రోజలు పాటు షూటింగ్ చేశాం. ఇదొక టీనేజ్ లవ్ స్టోరి. ప్రతి విషయంలో కొత్తదనం కనిపిస్తుంది. ఆకాష్ చక్కగా నటించాడు. మన పాత చిత్రాలు చాలా మరాఠీ చిత్రాలే ఆధారంగా రూపొందాయి. మేం నిర్మించిన వదినగారి గాజులు కూడా మరాఠి చిత్రం ఆధారంగానే తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి సంగీతం ఉంటుంది. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించే చిత్ర‌మ‌వుతుంది'' అన్నారు.

    Aakash Puri's 'Andhra Pori' on May 15th

    ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ‘‘ప్రసాద్ ప్రొడక్షన్స్ 55 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యానర్. ఎల్.వి.ప్రసాద్ గారు స్థాపించిన ఈ బ్యానర్ ను ఆయన తనయుడు రమేష్ ప్రసాద్ గారు ముందుకు తీసుకెళుతున్నారు. దాదాపు పాతికేళ్లుగా సినిమాలు తీయని ఆ బ్యానర్ లో 2011లో రుషి సినిమా తీశారు. తర్వాత చేస్తున్న సినిమా ఆంధ్రాపోరి. ఆంధ్రా పోరి చిత్రం బ్యూటిఫుల్ టీనేజ్ ల‌వ్‌స్టోరి. 1993లో జరిగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. ఈ సినిమా 35 రోజులు పాటు నిరవధికంగా షూటింగ్ ను జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారబిస్తాం. అలాగే జె బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెలలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తాం. ఏప్రిల్ 25న ఆడియో విడుదల చేసి మే 15న సినిమాని విడుదల చేస్తాం. ర‌మేష్ ప్ర‌సాద్‌గారు మ‌రోసారి నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విలువెంటో నాకు బాగా తెలుసు. అందుకు ఆయ‌న‌కి ద‌న్య‌వాదాలు. అలాగే నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి పూరి జగన్నాథ్ గారు స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ మా కథపై నమ్మకంతో ఆకాష్ ని మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆకాష్ వయసు 17 ఏళ్ల కుర్రాడు. బయట ఉన్న ఆకాష్ పూరి, పూరి అనే పవర్ ఫుల్ బ్యాగేజ్ తో మా దగ్గరికి వస్తున్నాడనగానే ఒక చిన్న భయం కూడా ఏర్పడింది. కానీ తను ఓబిడియెంట్ పర్సన్. తన పరిధులు బాగా తెలిసిన వ్యక్తి. తను కెమెరా ముందుకు వచ్చే సరికి అద్భుతంగా నటించాడు. ఉల్కాగుప్తా ఈ సినిమాలో చక్కగా నటించింది. ఈ సినిమాకి ముందు చాలా మంది హీరోయిన్స్ ను చూసినా ఉల్కాగుప్తాను చూడగానే ఈమె సరిపోతుందని భావించి ఆమెను కలిసి హీరోయిన్ గా ఎంపిక చేశాం. డా.జె 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అలాగే మూడు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ప్రతి సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ వనమాలి. ఈ సినిమాని తన సినిమాటోగ్రఫీతో మరో లెవల్ కి తీసుకెళ్లాడు. ఈ సినిమాకి సపోర్టగ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అన్నారు.

    Aakash Puri's 'Andhra Pori' on May 15th

    సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి మాట్లాడుతూ ‘'ఈ సినిమాని పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో చిత్రీకరించాం. కథకు ఈ లోకేషన్స్ అన్ని ప్లస్ అయ్యాయి. ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్వాలిటీ మైండేడ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు రమేష్ ప్రసాద్ గారికి, డైరక్టర్ రాజ్ మాదిరాజ్ కు థాంక్స్. ఆకాష్ సూపర్ స్టార్. ఏ సీన్ అయినా చెప్పగానే చేసేస్తున్నాడు. కచ్చితంగా తను పెద్ద స్టార్ అవుతాడు. హీరోయిన్ ఉల్కాగుప్తా బాగా నటించింది. ఈ సినిమా పూర్తి కావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అన్నారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘'ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. నాన్నగారు కథవిని సినిమా చేయమని చెప్పినప్పుడు ముందు వద్దనుకున్నాను. కానీ నువ్వు ఈ సినిమా చేయకపోతే ఆర్టిస్టువి కావని నాన్న అనడంతో ఒప్పుకున్నాను. టైమ్ పాస్ సినిమా చూసిన తర్వాత తెలంగాణా యాస కూడా నేర్చుకున్నాను. నిజామాబాద్ నర్సింగ్ గా ఇందులో కనపడతాను. సినిమాలోని 90 సీన్స్ లో 80 సీన్స్ ను మోసే బాధ్యత హీరోదేనని, హీరో అంటే ఒక బాధ్యత అని ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. ఫీల్ గుడ్ మాస్ ఎంటర్ టైనర్''అన్నారు. జోశ్యభట్ల మాట్లాడుతూ ‘'ఈ సినిమాలో 5 పాటలు, 3 బిట్ సాంగ్స్ ఉంటాయి. ప్రస్తుతం రీరికార్డింగ్ వర్క్ జరుగుతుంది. మంచి లవ్ స్టోరి అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమాకి పనిచేసే ప్రతి ఒకరికి మంచి లైఫ్ ఇచ్చే సినిమా'' అన్నారు.

    ఈ కార్యక్రమంలో చంద్రకిరణ్, రాజీవ్ నాయర్, శ్రీకాంత్ సహా చిత్రయూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు, సంగీతం: డా.జె., ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.

    English summary
    Puri Jagannadh's son Aakash Puri and Ulka Gupta are playing the lead pair in a movie titled 'Andhra Pori', which is the remake of Marathi super hit movie, 'Time Pass'. Ramesh Prasad is producing this film on Prasad Productions banner. The shooting of the film was completed and it is scheduled for a release on May 15th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X