twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    90 ల్లో జరిగే లవ్ స్టోరీ (‘ఆంధ్రాపోరి’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెద్ద బ్యానర్, మరాఠిలో సూపర్ హిట్ చిత్రానికి రీమేక్... ఈ రెండూ ప్రేక్షకుడుని థియోటర్ దాకా లాక్కొచ్చిందుకు ఆసక్తి కలిగించే అంశాలే. అలాంటి అంశాలతో ...మరింత ఆసక్తిని రేపే టైటిల్ తో ఆంధ్రాపోరి సిద్దమైంది. ఈ సినిమాలో మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్...పూరి కుమారుడు ఆకాష్ ఎంట్రీ. తెలంగాణ అబ్బాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆంధ్రా అమ్మాయి కోసం ఏం చేశాడన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కథ విషయానికి వస్తే...యాదమ్మ (ఈశ్వరీ రావు) ఓ విడో. ఆమె తన కొడుకు నర్సింగ్ (ఆకాష్ పూరి) కొత్తగూడెం ధెర్మల్ పవర్ స్టేషన్ లో పెట్టాలనకుంటుంది. అయితే నర్శింగ్..పది కూడా దాటడు. నర్శింగ్...చిరంజీవికు వీరాభిమాని. ఇల్లు వదిలేసి ఓ థియోటర్ లో పనిచేస్తూంటాడు. అక్కడే ఉండగా...ప్రశాంతి(ఉల్కా గుప్త)కు ఆకర్షితుడౌతాడు. ఆమె గోపాలరావు(డా.శ్రీకాంత్)కుమార్తె. ఆయన కొత్తగూడెం ధర్మల్ ప్రాజెక్టులో అసెస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూంటాడు. వీరిద్దరి మద్యా కొంత కాలానికి ప్రేమ చిగురిస్తుంది. అప్పుడు వీరి జీవితాల్లో ఏం మార్పు వచ్చింది. అప్పుడు ఏం చేసారు...అనేదే ఈ కథ.

    Aaksash puri's Andhra Pori preview

    దర్శకుడు మాట్లాడుతూ... ‘ఋషి' తర్వాత ఏదైనా మంచి రొమాంటిక్ కామెడీ చేద్దామనుకున్నా. ఆ సమయంలోనే మరాఠీలో ఘన విజయం సాధించిన టైమ్‌పాస్ విడుదలైంది. ఆ సినిమా చూసినతర్వాత ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ సినిమాను రీమేక్ చేయవచ్చా? లేదా? అన్నది కొంత పరిశీలించుకున్నాక రీమేక్‌కి సిద్ధమైపోయాం.

    కథ గురించి మాట్లాడుతూ...‘ఆంధ్రాపోరి' ఒక ఇన్నోసెంట్ టీనేజ్ లవ్‌స్టోరి. ప్రతి ఒక్కరూ అందమైన తొలిప్రేమ దశను దాటుకొని వచ్చినవారే! 1990 నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఓ టీనేజ్ జంటలో ఉండే అమాయకత్వాన్ని, తొలిప్రేమలోని అల్లరిని చూడొచ్చు. ఈతరం వారు తమను తాము తెరపై చూసుకోవడంతో పాటు, ప్రేమ అనే దానికి అర్థాన్ని తెల్సుకుంటారు. ఇక ఈ దశను దాటేసి వచ్చిన వారికైతే తమ తొలిప్రేమను తట్టిలేపి అందంగా చూపే సినిమాగా ‘ఆంధ్రాపోరి' నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు.

    ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘''మంచి టీనేజ్ లవ్ స్టోరి. మంచి రోల్ చేశాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. అలాగే నాన్నగారి సపోర్ట్ మరిచిపోలేం. ఆయనకి థాంక్స్. జోశ్యభట్ల మంచి మ్యూజిక్ అందించారు. దేత్తడి.. సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మ్యూజిక్ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

    బ్యాన‌ర్‌ : ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్
    నటీనటులు : ఆకాష్ పూరి, ఉల్కా గుప్త, పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం
    ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ,
    పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె,
    పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు,
    సంగీతం: డా.జోశ్యభట్ల .,
    ఆర్ట్: రాజీవ్ నాయర్,
    ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్,
    సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి,
    డాన్స్: చంద్రకిరణ్,
    పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల
    నిర్మాత: రమేష్ ప్రసాద్,
    దర్శకుడు: రాజ్ మాదిరాజ్.
    విడుదల తేదీ: 05, జూన్, 2015.

    English summary
    Puri Jagannath's son Akash Puri's debut film Andhra Pori is releasing today in a grand manner. The film is a remake film of Marathi hit 'Time Pass'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X