twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్ బుక్ లో చూసి అమీర్‌ఖాన్‌ స్వయంగా వెళ్లాడు

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్‌ స్టార్ హీరో అమిర్‌ఖాన్‌ మంగళవారం ఓ ప్రత్యేక అభిమానిని కలుసుకున్నాడు.ఆ అభిమాని ...ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న 14ఏళ్ల నిహాల్‌. అతన్ని కలిసిన ఆమిర్‌ అతడితో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. నీహాల్ కు వీడియోగేమ్స్‌, డీవీడీలను ఆమీర్‌ ఇవ్వగా.. నిహాల్‌ తాను స్వయంగా గీసిన ఓ గణేష్ చిత్రపటాన్ని ఆమీర్‌కు బహుమతిగా అందించాడు.అందుకు సంభందించిన ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

    “Thank you Aamir uncle for making my dream come true. Your ‘Taare Zameen Par’ always inspired me to face adverse...

    Posted by Team Nihal on 21 December 2015

    అతన్ని కలిసిన విధానం...

    హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీలో ప్రొజేరియాతో బాధపడుతున్న నిహాల్‌పై వచ్చిన వార్తను ఆమీర్‌ ఖాన్ చూశారు. అందులో అతడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన తారే జమీన్‌ పర్‌ చిత్రం తనకు ఎంతో నచ్చిందని తెలిపాడు. వీలైతే ఒకసారి ఆమిర్‌ ఖాన్‌ని కలుసుకోవాలనుందని పేర్కొనటం జరిగింది.

    ఇది చూసి స్పందించిన ఆమిర్‌ఖాన్‌ నిహాల్‌ను కలుస్తానని... వివరాలు తెలియజేస్తే తానే స్వయంగా ఎక్కడికైనా వస్తానని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. వివరాలు తెలుసుకున్న ఆమీర్‌ నేడు నిహాల్‌ను కలిశాడు.

    Aamir Khan Meets Fan With Progeria

    గతంలో అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పా చిత్రంలో అమితాబ్‌ ప్రొజేరియాతో బాధపడుతున్న ఓ చిన్నారి పాత్రలో నటించారు. ఈ వ్యాధితో బాధపడేవారికి చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

    English summary
    Aamir Khan made a "dream come true" for Nihal Bitla, who is suffering from rare genetic disorder progeria, by meeting him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X