twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో ‘పికె’ కలెక్షన్ల రికార్డు: బాహుబలి నిర్మాతల్లో ఆశలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇండియాలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రం చైనీస్ లాంగ్వేజ్ లోకి అనువాదమై గత శుక్రవారం చైనా వ్యాప్తంగా 4,600 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇక్కడ మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 178.34 కోట్లు వసూలు చేసింది. ఒక భారతీయ సినిమా చైనాలో ఈ రేంజిలో వసూళ్లు సాధించడం ఇదే ప్రథమం. గతంలో అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్' సినిమా కూడా చైనాలో మంచి విజయం సాధించింది.

    చైనాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యాన్ని గమనించిన ‘బాహుబలి' చిత్ర యూనిట్ సినిమాను చైనాలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా పికె కలెక్షన్లు వారి ‘బాహుబలి' మేకర్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపించింది. చైనాతో పాటు ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల్లోనూ ‘బాహుబలి' సినిమా విడుదల కాబోతోంది.

    Aamir Khan's PK is Breaking Records In China

    ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.

    English summary
    Aamir Khan's PK released in China last Friday and has shattered box office records again to become the best performing Indian film abroad of all time. Trade analyst Taran Adarsh tweeted
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X