twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది రాజమౌళి ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్, చిరులతో కూడా.. : అమీర్ ఖాన్

    రాజమౌళి మహాభారతం తీస్తే అందులో శ్రీకృష్ణుడు పాత్రను పోషిస్తాను అంటున్నారు అమీర్ ఖాన్.

    By Srikanya
    |

    హైదరాబాద్ :భవిష్యత్ లో అమీర్ ఖాన్ సినిమాకు దర్శకత్వం చేయాలనుందని తన మనసులో కోరికను రాజమౌళి ఇంతకుముందోసారి వెల్లడించారు.నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడను. బట్, రాజ్ కుమార్ హిరాణి & అమీర్ ఖాన్ సినిమాలు చూడడం మాత్రం మిస్ చేయను. భవిష్యత్ లోఅమీర్ ఖాన్ తో ఒక సినిమాకు కలసి పని చేయాలని నా కోరిక.

    అతను నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సమయం దగ్గరపడినట్లుంది. అమీర్ ఖాన్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళితో మీరో సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. అదెప్పుడు? అంటే పాజిటివ్ గా సమాధానమిచ్చారు.

    ఆమీర్‌ నటించిన 'దంగల్‌' విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగులోనూ అనువాదమైంది. 'దంగల్‌' ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ వచ్చాడు ఆమీర్‌ ఖాన్‌. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయాలు వెల్లడించారు.

     ఆయనో గొప్ప దర్శకుడు

    ఆయనో గొప్ప దర్శకుడు


    అమీర్ ఖాన్ మాట్లాడుతూ...రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయనతో పనిచేయాలని నాకూ ఆశగా ఉంది అన్నారు. అలాగే...రాజమౌళి మహాభారతం తీస్తానని చెబుతుంటారు. మహాభారతం తీస్తే మీరు ఏ పాత్రని ఎంచుకొంటారు? అనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

     శ్రీకృష్ణుడైతే బాగుంటుంది

    శ్రీకృష్ణుడైతే బాగుంటుంది


    ‘మహాభారత్‌' అంటే నాకు చాలా ఇష్టం. అందులోని ప్రతి పాత్రా ఇష్టమే. ముఖ్యంగా కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడు. ఓ యుద్ధ వీరుడు. అలాంటి పాత్రలో నన్ను నేను వూహించుకోవడం కష్టం. కాబట్టి శ్రీకృష్ణుడి పాత్రైతే బాగుంటుంది. ఆ పాత్రకు నేను నప్పుతానా లేదా అనేది రాజమౌళి ఆలోచించుకోవాలి అన్నారు అమీర్ ఖాన్.

     తెలుగు నేర్చుకుంటా

    తెలుగు నేర్చుకుంటా


    ఓ తెలుగు కథ మీకెవరైనా వినిపిస్తే చేయడానికి, ఈ భాష నేర్చుకోవడానికి సిద్ధమేనా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ...కొత్త భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ‘పీకే' కోసం భోజ్‌పురి నేర్చుకొన్నా. ‘దంగల్‌' కోసం హర్యాణీ భాషపై పట్టుసాధించా. ఒకవేళ తెలుగు సినిమాలో నటించాల్సివస్తే తప్పకుండా తెలుగు నేర్చుకొంటా. పూర్తిగా కాకపోయినా నా సంభాషణల వరకూ తెలుసుకొనే ప్రయత్నం చేస్తా అన్నారు.

     తెలుగు ట్రైలర్ చూసా

    తెలుగు ట్రైలర్ చూసా


    ‘దంగల్‌' తెలుగు వెర్షన్‌ చూశారా? మీ పాత్ర తెలుగులో డైలాగులు చెబుతుంటే ఎలా అనిపిస్తోంది? అని ప్రశ్నిస్తే...‘దంగల్‌' నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తెలుగు వెర్షన్‌ని పూర్తిగా చూడలేకపోయా. కానీ తెలుగు ట్రైలర్‌ చూశా. నా పాత్ర తెలుగులో మాట్లాడుతుంటే.. కొత్తగా అనిపించింది అని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.

     నాకే ఛాయిస్ ఉంటే..

    నాకే ఛాయిస్ ఉంటే..


    తెలుగులో నటించాల్సివస్తే మీ సహనటులుగా ఎవరిని ఎంపిక చేసుకొంటారు? అని ప్రశ్నించగా...సహ నటుల్ని ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా దర్శకుడిదే. నిజంగానే నాకు ఛాయిస్‌ ఉంటే చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను ఎంచుకొంటా. తమిళంలో రజనీకాంత్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభిమానిని నేను. వీళ్లందరితో పనిచేయాలని ఉంది అని చెప్పారు.

     సామాన్యుడులాగ వింటా

    సామాన్యుడులాగ వింటా

    ప్రతిసారి కొత్త కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇది మీకెలా సాధ్యమవుతోంది? అనే విషయమై వివరణ ఇస్తూ...నేను రచయితని కాదు. నా కోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలు రాస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు రుణపడి ఉన్నా. నా వరకూ ఓ కథని సామాన్య ప్రేక్షకుడిలానే వింటా. నాలోని సగటు ప్రేక్షకుణ్ని ఆ కథ సంతృప్తిపరిస్తే చాలు. వెంటనే ఒప్పుకొంటా అని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్.

     అంత శ్రేయస్కరం కాదు

    అంత శ్రేయస్కరం కాదు

    ‘దంగల్‌' కోసం బరువు పెరిగారు.. మళ్లీ తగ్గారు. దాని కోసం మీరు చేసిన కసరత్తులు ఎలాంటివి? అనే విషయం గురించి చెప్తూ..బరువు పెరగడానికి పెద్దగా కష్టపడలేదు. నాలుగైదు నెలల్లో 27 కిలోలు పెరిగా. మళ్లీ తగ్గడానికీ అంతే సమయం పట్టింది. వారానికి ఒక పౌండ్‌ చొప్పున తగ్గితే మంచిది. కానీ నేను మాత్రం వారానికి నాలుగు పౌండ్లు తగ్గేవాణ్ని. అలా మూడు వారాలు చేశా. నిజానికి అలా ఉన్నఫళంగా తగ్గడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఆ తర్వాత వేగం తగ్గించాను. లావుగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. కనీసం వంగి షూ లేస్‌ని కూడా కట్టుకోలేకపోయేవాణ్ని అని చెప్పింది

     రిస్క్ వద్దన్నారు

    రిస్క్ వద్దన్నారు

    పాత్ర కోసం ఇంత సాహసం చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లు కంగారుపడలేదా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ....మా అమ్మ, నా భార్య గట్టి వార్నింగ్‌ ఇచ్చారు (నవ్వుతూ). మరోసారి ఇంత రిస్క్‌ చేయొద్దన్నారు అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.

     ఆకారం మర్చిపోతున్నా

    ఆకారం మర్చిపోతున్నా


    నా భార్య అయితే ‘ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చేస్తున్నారు. మీ నిజమైన ఆకారం మర్చిపోతున్నా' అంటుంటుంది. నిజమే.. తనని తొలిసారి ‘దిల్‌ చాహతాహై' గెటప్‌లో కలిశా. అప్పటి నుంచీ.. ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చుకొంటూ వెళ్తున్నా.

     చాలనుకుంటాను

    చాలనుకుంటాను


    మీ సినిమా అంటే రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమేనా? అని ప్రశ్నిస్తే.. నేనెప్పుడూ రికార్డుల గురించో.. వసూళ్ల కోసమో సినిమా తీయను. ప్రేక్షకుల హృదయాన్ని తాకితే చాలనుకొంటా అంటూ సూటిగా సమాధానమిచ్చారు అమీర్ ఖాన్.

     వీలైనంత త్వరలో

    వీలైనంత త్వరలో


    పెద్ద నోట్ల రద్దుని స్వాగతిస్తున్నారా? మంచి ప్రయత్నమే. దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా చక్కదిద్దుతుందనుకొంటున్నా అని సమాధానమిచ్చారు అమీర్ ఖాన్.

    rnrnrnrnrnrn

    ఏ స్దాయిలో ఇక్కడ

    అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దంగల్'. రియల్ లైఫ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్‌ రెజ్లర్‌ మహవీర్‌సింగ్‌ పొగట్‌ జీవిత కథపై ఈ మూవీ తెరకెక్కగా, డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా....ఈ దశాబ్దాపు ఉత్తమ చిత్రం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ మూవీతో అమీర్ ఖాన్ మరోసార బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారంటూ ప్రచారం హోరెస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. తాజాగా తెలుగు ట్రైలర్, పోస్టర్ రిలీజ్ చేసారు.

    English summary
    Bollywood Actor Aamir Khan During Dangal Telugu Version Promotions He visited to Hyderabad and when during press meet Some asked whether he would like to be a part of Mahabharatha which might be made by the genius Rajamouli Aamir was quick to answer and said that he would love to play both Karna and Krishna but would end up playing Krishna as it is his most favourite.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X