»   » సందడిగా సాగిన ‘ఎబిసిడి 2’ ట్రైలర్ లాంచ్ (ఫోటోస్)

సందడిగా సాగిన ‘ఎబిసిడి 2’ ట్రైలర్ లాంచ్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మూవీ ‘ఎబిసిడి-2' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఈ రోజు గ్రాండ్ గా సాగింది. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవాతో పాటు అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా, రెమో డిసౌజా, ఇతర నటీనటులు డాన్స్ చేసి సందడి చేసారు.

2013లో వచ్చిన డాన్స్ బేస్డ్ మూవీ ‘ఎబిసిడి-ఎనీ బడీ కెన్ డాన్స్' చిత్రానికి ఇది సీక్వెల్. అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ సినిమాకు వెళ్లాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రెమో డిసౌజా కూడా ప్రముఖ డాన్సరే. ప్రభుదేవా ఈ చిత్రంలో డాన్స్ మాస్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఓ పాటలో తెలుగు స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో తన డాన్సింగ్ టాలెంట్ ప్రదర్శించి ఆకట్టుకుంటాడు. 3డిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ...‘రెమో సర్, ప్రభు సర్ నా డాన్స్ గురువులు. సినిమా షూటింగ్ సందర్భంగా వీరి వద్ద నుండి నేను, వరుణ్ డాన్స్ లో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాం. వారితో కలిసి పని చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్' అని చెప్పుకొచ్చింది.

వరుణ్-శ్రద్ధా కపూర్


ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ చిత్ర హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్.

వరుణ్ ధావన్


వరుణ్ ధావన్ మాట్లాడుతూ..‘3డి మూవీలంటే నాకు చాలా ఇష్టం. ఇండియాలో 3డి సినిమాలు రావాలని కోరుకునే వాడిని. ఇపుడు 3డి సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉంది' అన్నారు.

ప్రభుదేవా


ప్రభుదేవా మాట్లాడుతూ...‘చిన్నతనంలో చదువులో నేను కాలా వీక్. నాకు వేరే దారి కనబడలేదు. మా ఫాదర్ కొరియోగ్రాఫర్ కావడంతో నేను కూడా డాన్స్ వైపే అడుగులు వేసాను' అని చెప్పారు.

వరుణ్ ధావన్ థెరపిస్టు శ్రద్ధా


వరుణ్ ధావన్ మాట్లాడుతూ..‘ఎబిసిడి 2 మూవీ నాకు పెద్ద రిలీఫ్. సినిమా షూటింగ్ సమయంలో నా బాడీ మాత్రమే ఇక్కడ ఉండేది. మైండ్ అంతా బద్లాపూర్ సినిమా మీద ఉండేది. కుదురుకోవడానికి సమయం పట్టింది. శ్రద్ధా కపూర్ నాకు థెరపిస్టులా హెల్ప్ చేసింది' అన్నాడు.

శ్రద్ధా-వరుణ్ డాన్స్


‘ఎబిసిడి-2' ట్రైలర్ లాంచ్ సందర్భంగా డాన్స్ చేస్తున్న వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ తదితరులు.

అదిరిపోయే పెర్ఫార్మెన్స్


‘ఎబిసిడి-2' సినిమాలో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. సినిమా మొత్తం డాన్స్ బేస్డ్ కథాంశంతో సాగుతుంది.

గ్రూఫ్ ఫోటో


‘ఎబిసిడి-2' సినిమాలో నటిస్తున్నఇతర నటీనటుల గ్రూఫ్ ఫోటో.

 

 

English summary
ABCD 2 trailer got released today by the makers, Remo D'Souza and the cast of the film, Varun Dhawan, Shraddha Kapoor and Prabhu Deva.
Please Wait while comments are loading...