twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పని కత్తిరింపులు...షరతులతో రిలీజ్

    By Srikanya
    |

    బెంగళూరు : వివాదాస్పద చిత్రాలకు సెన్సార్ ని దాటటం ఓ ప్రహసనమే. చాలా కాలంగా వివాదాలతో,కోర్టు మెట్లు ఎక్కిన 'అభినేత్రి' సినిమా అలాంటి సెన్సార్ అడ్డంకుల్ని విజయవంతంగా అధిగమించి విడుదలకు సిద్ధమైంది. ప్రాంతీయ సెన్సార్‌ మండలి ఈసినిమాకు యు/ఎ ప్రమాణ పత్రాన్ని జారీ చేసింది.

    సినిమాలో పదకొండు సంభాషల్ని మ్యూట్‌ చేయాలని, రెండు చోట్ల కత్తరింపులు, ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని ప్రకటించాలనే షరత్తుతో ప్రమాణ పత్రం మంజూరైంది. ఇతర లాంఛనాల్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారుతుండడం విశేషం. టైటిల్‌ పాత్రను కూడా ఆమే పోషించారు. అలనాటి నటి కల్పన విషాద జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆరంభంలో చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు అభ్యంతరం తెలిపారు. ఇందులోని సన్నివేశాలు కల్పన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో పోలిక ఉందని వాదించడంతో స్పష్టీకరణ ఇవ్వాల్సి వచ్చింది.

    Abhinetri censored With U/A certificate

    అనంతరం ఇది తాను రాసిన నవల ఆధారంగా తీస్తున్నారంటూ భాగ్య కృష్ణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. చివరకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో అడ్డంకులు తొలగినట్త్లెంది. రవిశంకర్‌, అతుల్‌ కులకర్ణి, మకరంద దేశ్‌పాండే ప్రధాన తారాగణం.

    దివంగత నటి కల్పన జీవిత చరిత్రనే అభినేత్రి చిత్రంగా తెరకెక్కించారంటూ భాగ్య కృష్ణమూర్తి, పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు కోర్టులో అర్జీ వేసుకున్నారు. తాను రచించిన అభినేత్రి నవలనే కాపీ కొట్టి ఈ చిత్రం నిర్మించారనేది భాగ్య కృష్ణమూర్తి ప్రధాన ఆరోపణ.

    ఇక గతంలో తాను నిర్మాతగా ఉంటూ నాయికగా నటిస్తున్న అభినేత్రి చిత్రానికి, దివంగత నటి కల్పన జీవితానికి ఎటువంటి సంబంధం లేదని నటి పూజాగాంధీ కోర్టులో వివరణ ఇచ్చారు. కల్పన జీవితాన్ని పూజా చిత్రంగా తీస్తున్నారని, ఈ చిత్రం విడుదల కాకుండా ఆదేశించాలంటూ కల్పన బంధువులు కొందరు ఒకటవ ఏసీఎంఎం కోర్టులో దావా వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏసీఎంఎం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పూజా కోర్టుకు హాజరయ్యారు. కల్పన జీవితాన్ని తాను చిత్రంగా తీయటం లేదని న్యాయమూర్తి ముందు ఆమె వివరణ ఇచ్చారు.

    వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తోంది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.

    ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్‌గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది.

    English summary
    Pooja Gandhi's first film as a producer, 'Abhinetri' being directed by debuante Satish Pradhan has been censored with U/a certificate. Censor members have given 11 dialogue mute and two shots cut and have told to put as imaginary story and not related to anyone. With the clearance from the censor committee in hand, Pooja Gandhi intends to release the film later this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X