twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభినేత్రి ఆడియో వేడుక: ప్రభుదేవా, తమన్నా డాన్స్ షో అదిరింది (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో తమిళ డైరెక్టర్ ఎఎల్. విజయ్ దర్శకత్వంలో తెకెక్కుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హిందీ) 'అభినేత్రి'. ఈ సినిమాను మూడు భాషల్లో వేర్వేరు టైటిల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'అభినేత్రి' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... తమిళంలో 'డెవిల్' పేరుతో, హిందీలో 'టూ ఇన్ వన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ 'అభినేత్రి'కి ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమిళ వర్షన్ ను ప్రభుదేవా, హిందీ వర్షన్ ను సోనూసూద్ లు నిర్మిస్తున్నారు.

    తెలుగు వెర్షన్ 'అభినేత్రి' చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ స్టేజీపై డాన్స్ చేసి అభికులను ఎంటర్టెన్ చేసారు.

    కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

    సాజిద్‌-వాజిద్‌, విశాల్‌ సంగీతం అందించిన ఆడియో రిలీజ్ వేడుకలో ప్రభుదేవా, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనూసూద్‌, కొరటాల శివ, క్రిష్‌, ఎ.ఎల్‌.విజయ్‌, నందినీ రెడ్డి, కోనవెంకట్‌, రాజ్‌ తరుణ్‌, రామజోగయ్యశాస్త్రి, శివ తుర్లపాటి, అరుణ్‌ వడ్డేపల్లి, నాని, శ్రీవాస్‌, పివిపి, సాజిద్‌-వాజిద్‌, ఎం.వి.వి.సత్యనారాయణ, డి.వి.వి.దానయ్య, అభిషేక్‌ పిక్చర్స్‌ అభిషేక్‌, బి.వి.ఎస్‌.రవి తదితరులు పాల్గొన్నారు.

    గ్రాండ్ గా వేడుక

    గ్రాండ్ గా వేడుక

    ఈ వేడుకలో బిగ్‌సీడీని కొరటాల శివ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విడుదల చేశారు. ఆడియో సీడీలను సోనూసూద్‌ విడుదల చేసి తొలి సీడీని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అందజేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ విడుదల చేశారు.

    ప్రభుదేవా వల్లే

    ప్రభుదేవా వల్లే

    కోనవెంకట్‌ మాట్లాడుతూ - ''ప్రభుదేవా, సోనూసూద్‌, తమన్నా, నిర్మాతలు సహా అందరికీ థాంక్స్‌. ఈ సినిమా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ కావడానికి ప్రభుదేవాగారే కారణం. విజయ్‌గారు సినిమా బాగా రావాలని ఎంతో తపనపడ్డారు. గీతాంజలి సక్సెస్‌ తర్వాత మాకు లేడీ పేర్లు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు అభినేత్రి సినిమా చేశాం. ఎం.వి.వి.సత్యనారాయణగారు నిజాయితికీ మారుపేరు. ఆయన సహా ఇందులో భాగమైన అందరికీ థాంక్స్‌ అన్నారు.

    తమన్నా నట విశ్వరూపం

    తమన్నా నట విశ్వరూపం

    తమన్నా నటవిశ్వరూపం చూపించింది. తమన్నా ఈ క్యారెక్టర్‌ చేసుకుండకపోతే మరేవరూ ఆ టైటిల్‌రోల్‌ను చేయలేరు. తమన్నాయే ఈ సినిమాకు హీరో. తన డేడికేషన్‌తో తమన్నా ఈ స్థాయికి చేరుకుంది అని కోన వెంకట్ అన్నారు.

    రిలీజ్ డేట్ ప్రకటించారు

    రిలీజ్ డేట్ ప్రకటించారు

    మా బ్యానర్‌లో వచ్చిన గీతాంజలి సినిమాను ఎలా ఆదరించారో ఈ సినిమాను అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది సినిమా కాదు, మా బలం. మా జర్నీ ఇక్కడ నుండే స్టార్ట్‌ అవుతుంది. అక్టోబర్‌ 7న మీరు విజయంతో మాకు బలాన్నిస్తారని బావిస్తున్నాను అని కోన వెంకట్ తెలిపారు.

    ప్రభుదేవా నా గురువుగా భావిస్తా

    ప్రభుదేవా నా గురువుగా భావిస్తా

    తమన్నా మాట్లాడుతూ - ''సినిమా కథను మొదటి పదిహేను నిమిషాలు మాత్రం విని చేయడానికి ఒప్పుకున్నాను. ప్రభుదేవాగారిపై అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. డ్యాన్స్‌లో ప్రభుదేవాగారిని నా గురువుగా భావించి ఇకపై డ్యాన్స్‌ చేస్తాను'' అని తమన్నా అన్నారు.

    ఎక్కడో తీసుకెల్లారు

    ఎక్కడో తీసుకెల్లారు

    ప్రభుగారు డైరెక్టర్‌ కావడంతో సీన్స్‌ను ఆయన ఇంప్రవైజ్‌ చేసి సీన్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రభుగారు తప్ప ఆ రోల్‌ను ఇంకేవరూ చేయలేరనే విధంగా యాక్ట్‌ చేశారు. ఇక సోనూసూద్‌గారిని ఈ సినిమాలో రొమాంటిక్‌గా చూపించారు. కోనవెంకట్‌గారితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. అభినేత్రి త్రిభాషా చిత్రం. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న కోనగారికి ఈ సినిమా మంచి లాభాలను తీసుకురావాలి అని తమన్నా అన్నారు.

    సోనూసూద్‌ నాకు బ్రదర్

    సోనూసూద్‌ నాకు బ్రదర్

    ప్రభుదేవా మాట్లాడుతూ - ''ఈ సినిమా స్టార్ట్‌ కావడానికి ప్రధాన కారణం గణేష్‌గారు. అందరూ కలిసి చేస్తున్న సినిమా. సాజిద్‌-వాజిద్‌గారికి, విశాల్‌గారికి దక్షిణాదిన ఈ సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాం. సోనూసూద్‌ నాకు బ్రదర్స్‌. తనతో జర్నీ కంటిన్యూ అవుతుంది. తమన్నా బెస్ట్‌ యాక్టర్‌, డ్యాన్సరే కాదు, మంచి వ్యక్తి. దర్శకుడు విజయ్‌కు చాలా ఓపిక ఉంది. ప్రతి సీన్‌ను ఎంతో ఓపికగా చేశారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

    మేమిచ్చే దసరా కానుక

    మేమిచ్చే దసరా కానుక

    ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ''ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌గారితో రూపొందిన ఈ సినిమాను నేను చేయడానికి కారణం కోనవెంకట్‌గారే కారణం. డెఫనెట్‌గా గీతాంజలి అంతా పెద్ద హిట్‌ అవుతుంది. దసరా సందర్భంగా మా తరపున మేమిచ్చే కానుకగా భావిస్తున్నాను'' అన్నారు.

    నేను ప్రొడ్యూస్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది

    నేను ప్రొడ్యూస్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది

    సోనూసూద్‌ మాట్లాడుతూ - ''విజయ్‌గారు కథ చెప్పగానే నాకు విజయ్‌గారి దర్శకత్వం అంటే ఏంటో తెలిసింది. ప్రభుదేవాగారు నాకు బ్రదర్‌లాంటి వ్యక్తి. తమన్నాతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఈ సినిమాను హిందీలో నేను ప్రొడ్యూస్‌ చేస్తుండటం ఆనందంగా ఉంది'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ

    దర్శకుడు మాట్లాడుతూ

    చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుండో తెలుగులో సినిమా చేయాలనుకున్నాను, ఈ సినిమాతో కుదిరింది. సాజిద్‌-వాజిద్‌గారు, విశాల్‌గారు చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే తమిళంలో గణేష్‌గారు వల్లే సినిమా ఈ స్టేజ్‌కు వచ్చింది. తర్వాత కోనవెంటక్‌గారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమన్నా పెర్‌ఫార్మెన్స్‌ నన్ను చాలా ఎగ్జయిట్‌ చేసింది. సోనూసూద్‌గారు ఈ సినిమాలో చాలా రొమాంటిక్‌గా కనపడతారు. నాపై చాలా నమ్మకంతో నన్ను నడిపించారు. ప్రభుదేవాగారు తమిళంలో నిర్మాతగానే కాకుండా ఆయన సినిమాను ముందుండి నడిపించారు. ప్రభుదేవాగారికి థాంక్స్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

    తమన్నా డ్యాన్స్‌ చూసి స్టన్‌ అయిపోయాను

    తమన్నా డ్యాన్స్‌ చూసి స్టన్‌ అయిపోయాను

    రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ - ''నేను ఈ సినిమా టీజర్‌ చూసినప్పుడు తమన్నా డ్యాన్స్‌ చూసి స్టన్‌ అయిపోయాను. అలాగే ఇది ఏ జోనర్‌ సినిమానో అని ఓ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. సాంగ్స్‌ బావున్నాయి. విజయ్‌గారికి వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ప్రభుదేవాగారి డ్యాన్స్‌కు నేను అభిమానిని. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

    యూ ట్యూబ్‌లో తమన్నా డ్యాన్స్‌ బిట్‌ చూసా

    యూ ట్యూబ్‌లో తమన్నా డ్యాన్స్‌ బిట్‌ చూసా

    నాని మాట్లాడుతూ - ''యూ ట్యూబ్‌లో తమన్నా డ్యాన్స్‌ బిట్‌ చూసి నేను ఆమెలా చేయాలనే ఆలోచన వస్తుందేమోనని రెండోసారి కూడా చూడలేదు. కానీ ఈరోజు ఆ సాంగ్‌ను నేనే లాంచ్‌ చేశాను. తమన్నా డ్యాన్స్‌ అదరగొట్టేసింది. ప్రభుదేవాగారి డ్యాన్స్‌ అంటే నాకు చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను''అన్నారు.

    తెలుగు ప్రజల ఆదరణను మరచిపోలేను

    తెలుగు ప్రజల ఆదరణను మరచిపోలేను

    మ్యూజిక్ డైరెక్టర్ సాజిద్‌-వాజిద్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుండో తెలుగు సినిమాలకు పనిచేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పటికి కుదిరింది. తెలుగు ప్రజల ఆదరణను మరచిపోలేను. ప్రభుదేవాగారికి థాంక్స్‌. తెలుగులో అభినేత్రి తొలి సినిమా. పాటలు అందరికీ నచ్చుతాయి. విజయ్‌గారు అందించిన సహకారం మరచిపోలేను. తమన్నా డ్యాన్స్‌ చాలా బాగా చేసింది. అలాగే సోనూసూద్‌ సపోర్ట్‌కు థాంక్స్‌'' అన్నారు.

    చెబితే ఆయన్ను అవమానపరిచినట్లు

    చెబితే ఆయన్ను అవమానపరిచినట్లు

    రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ - ''ప్రభుదేవాగారికి నేను పెద్ద ప్యాన్‌ని. తెలుగు తెరకు డ్యాన్స్‌ను పరిచయం చేసిన వ్యక్తి. ఆయన డ్యాన్స్‌ బాగా చేశాడని చెబితే ఆయన్ను అవమానపరిచినట్లు అవుతుంది. మరోసారి ప్రభుదేవాగారికి తెరపై చూడటం ఆనందంగా ఉంది. తమన్నా డ్యాన్స్‌ను ఇరగొట్టేసింది. దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

    గ్రేట్‌ దర్శకుడు

    గ్రేట్‌ దర్శకుడు

    క్రిష్‌ మాట్లాడుతూ - ''ఎ ఫిలిం బై విజయ్‌ అని ఉంటే అదొక రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమా అని నేను భావిస్తాను. తను చేసిన శైవం అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే అవకాశం దక్కింది. నాన్న, మదరాసు పట్టణం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గ్రేట్‌ దర్శకుడు. ప్రభుదేవాగారు నటుడు, డ్యాన్సర్‌గా అందరికీ ఇన్‌స్పైర్‌. తమన్నా ఫేబులస్‌ హీరోయిన్‌. తను ఎక్సలెంట్‌గా డ్యాన్స్‌ చేసింది. సాజిద్‌-వాజిద్‌గారు మంచి మ్యూజిక్‌ అందించారు. సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

    English summary
    Prabhu Deva, Tamanna acted Abhinetri Movie Music Launch held at Hyderabad on Sunday (25th Sep) evening,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X