twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మావా ఏక్ పెగ్ లావో అంటూ పాటపాడి దుమ్మురేపిన బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్‌కు పండుగే..

    నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా గాయ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. వంద చిత్రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న బాలయ్య త‌న‌లోని ఈ కొత్త కోణంతో అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను థ్రిల్

    By Rajababu
    |

    నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా గాయ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. వంద చిత్రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న బాలయ్య త‌న‌లోని ఈ కొత్త కోణంతో అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయనున్నారు.

    Singer Balakrishna

    గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని వీ ఆనంద‌ప్ర‌సాద్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీర్చిదిద్దుతున్నారు.

    పోర్చుగల్‌కు చిత్ర యూనిట్

    పోర్చుగల్‌కు చిత్ర యూనిట్

    ముహుర్త షాట్ అనంతరం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని ప‌లు లొకేష‌న్ల‌లో షూటింగ్‌ను జరుపుకొన్నది. తదుపరి షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ పోర్చుగ‌ల్‌కు ప్ర‌యాణ‌మైంది. తాజాగా బాలకృష్ణ పాడిన పాట గురించి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ‘మా హీరోగారు నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు ఈ చిత్రంలో `మావా ఏక్ పెగ్ లావో..' అనే పాట పాడ‌టం చాలా ఆనందంగా ఉంది. విన‌సొంపైన పాట‌ను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ స్వ‌ర‌ప‌రిచారు.

    మాస్ ప్రేక్షకులకు కిక్కు..

    మాస్ ప్రేక్షకులకు కిక్కు..

    మాస్ ప్రేక్షకులకు కిక్కే విధంగా రూపొందిన గీతాన్ని బాల‌కృష్ణ‌గారు ప్రొఫెషనల్‌గా, హుషారుగా పాడారు. ఆయ‌న పాడిన పాట వింటే ప్రొఫెష‌న‌ల్ సింగర్ పాడిన‌ట్టు అనిపించింది. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో అంత గొప్ప‌గా పాడటాన్ని చూసి మా యూనిట్ ఆశ్చ‌ర్య‌పోయాం. స్వ‌త‌హాగా బాల‌కృష్ణగారికి సంగీతం ప‌ట్ల మంచి అభిరుచి ఉంది. గాయ‌కుడిగానూ ఆయ‌న‌లో గొప్ప‌ ప్ర‌తిభ దాగి ఉంద‌న్న విష‌యం ఇప్పుడు రుజువైంది. ఆడియో విడుద‌లైన త‌ర్వాత పాట‌ను విన్న ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న స్వ‌రాన్ని విని ఆనందిస్తారు. అభినందిస్తారు అని పూరి అన్నారు.

    లెజెండరీ హీరో పాట పాడటం..

    లెజెండరీ హీరో పాట పాడటం..

    సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ నంద‌మూరి బాల‌కృష్ణ‌ లాంటి ఓ లెజెండ‌రీ హీరో నేను స్వ‌ర‌ప‌రిచిన పాట‌ను, ఆయ‌న తొలి పాట‌గా పాడ‌టం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న పాడుతున్నంత సేపు చాలా ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్‌లాగా అనిపించారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో పాడారు. బాలకృష్ణ‌సార్‌ ఫ్యాన్స్ కి, సంగీత ప్రియుల‌కు కూడా త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంది. ఛార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ అవుతుంద‌ని ఘంటాప‌థంగా చెప్ప‌గ‌ల‌ను అని వెల్లడించారు.

    బాలయ్య గొంతు ఓ ఆడిషన్..

    బాలయ్య గొంతు ఓ ఆడిషన్..

    నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘బాల‌య్య‌గారి 101వ చిత్రాన్ని మా సంస్థ‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందిస్తున్నాం. ఈ చిత్రానికి వేల్యూ అడిష‌న్ బాల‌య్య‌గారి స్వ‌రం. ఆయ‌న పాడ‌టానికి ఒప్పుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. ప్ర‌తి ఆడియో వేడుక‌లోనూ .. `శిశుర్వేత్తి ప‌శుర్వేత్తి.. `అంటూ పాట ప్రాధాన్యాన్ని త‌ప్ప‌కుండా ప్ర‌స్తావించే ఆయ‌న చాలా గొప్ప‌గా ఈ పాట‌ను ఆల‌పించారు. విన్న అభిమానుల‌కు ఈ వార్త పండుగ‌లాంటిదే. త‌ప్ప‌కుండా అంద‌రూ ఎంజాయ్ చేసేలాగా అనూప్ చ‌క్క‌టి బాణీ ఇచ్చారు. భాస్క‌ర‌భ‌ట్ల మంచి లిరిక్స్ ను అందించారు అని తెలిపారు.

    దసరా కానుకగా..

    దసరా కానుకగా..

    అన్నీ చ‌క్క‌గా అమ‌రిన ఈ పాట‌, బాల‌య్య‌గారి గొంతులో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మైందని చెప్ప‌డానికి ఆనందిస్తున్నాం. ఇప్ప‌టికే షూటింగ్ కొంత భాగం పూర్త‌యింది. గురువారం సాయంత్రం మా యూనిట్ అంతా పోర్చుగ‌ల్‌కు ప్ర‌యాణ‌మ‌వుతున్నది. అక్క‌డ 40 రోజుల పాటు కీల‌క స‌న్నివేశాల‌ను, పాట‌ల‌ను, యాక్ష‌న్ ఎపిసోడ్‌ల‌ను చిత్రీక‌రిస్తాం. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అని ఆనంద ప్రసాద్ చెప్పారు.

    English summary
    After Gautami Putra Shatakani, Actor Nandamoori Balakrishna doing movie with Director Puri Jagannadh. Balakrishna now becomes singer for writer Bhaskarabatla written song. Music Director Anoop Rubens, Producer V Ananda Bhaskar appreciated Balaiah's singing ability.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X