twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం జరిగింది?: బ్రహ్మాజీ కుమారుడిపై దాడి

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఔటర్ రింగ్ రోడ్డులోని టోల్ గేట్ వద్ద సినీ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌కుమార్‌పై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అనుచరుడు దాడి చేయడంతో సంజయ్ ముక్కుపై స్వల్ప గాయమైంది. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఆర్జీఐఎ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలీసులు, ఇరువర్గాల కథనం ప్రకారం..

    ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఆదివారం అవుటర్‌రింగ్‌ రోడ్డుపై గచ్చిబౌలి వైపు నుంచి శంషాబాద్‌కు వెళుతున్నారు. విశాఖపట్నం నుంచి వస్తున్న బ్రహ్మాజీని తీసుకువెళ్లేందుకు ఆయన కుమారుడు సంజయ్‌కుమార్‌ సైతం తన కారులో ఎయిర్‌పోర్టుకు అటుగానే వెళుతున్నారు.

    Actor Brahmaji’s Son Attacked By MLA Followers

    శంషాబాద్‌ సమీపంలోని కిషన్‌గూడ టోల్‌గేట్‌ వద్ద సంజయ్‌కుమార్‌ కారు రుసుము చెల్లించేందుకు ఆగింది. వెనుకనే ఉన్న ఎమ్మెల్యే వాహన డ్రైవర్‌ ముందున్న సంజయ్ కారును తీయాలని రెండు, మూడుసార్లు హారన్ కొట్టాడు. హారన్‌ కొట్టడంతో కారు దిగిన సంజయ్‌.. ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

    ఎమ్మెల్యే, ఆయన గన్‌మెన్‌లు వారించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న శంషాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే వర్గీయులు కొందరు అక్కడికి చేరుకొన్నారు. వారిలో ఒకరు సంజయ్‌ ముఖంపై కొట్టడంతో అతని ముక్కు లోంచి రక్తం వచ్చింది.

    శంషాబాద్‌ ఆర్‌జీఐఏ సీఐ సుధాకర్‌ అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేను వేరే వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఎమ్మెల్యే మద్దతుదారులు, నటుడు బ్రహ్మాజీ తన కుమారుడితో ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. సంజయ్ ఆర్జీఇఎ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు కూడా సంజయ్‌పై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలతో మాట్లాడిన సీఐ రాజీ కుదిర్చినట్లు సమాచారం.

    English summary
    Brahmaji’s son Sanjay Kumar was allegedly manhandled by the supporters of Rajendranagar Telugu Desam MLA T. Prakash Goud at Shamshabad on Sunday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X