twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ ఎన్నికలు ఆపమంటూ కోర్టులో పిటిషన్

    By Srikanya
    |

    హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్ (మా)కు జరుగనున్న ఎన్నికలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సినీ నటులు మురళీమోహన్, ఆలీకి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇదిలా ఉంటే... మా అధ్యక్ష ఎన్నికల్లో తనతో పోటీచేసే స్టేచర్ ఎవరికీ లేదని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందర్నీ నవ్విస్తూ ఈ స్థాయికి వచ్చానని..సినీ పరిశ్రమలో తనకెవరూ పోటీరాలేరని అన్నారు. తాను పోటీవద్దనే గతంలో జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఈ పోటీలో నీ ప్యానెల్,నా ప్యానెల్ అంటూ ఏమీ లేవని స్పష్టం చేశారు.

    Actor Kalyan files petition in city civil court against MAA

    రాజకీయాలు చేయడానికి ఎవరో పనికి మాలిన వాళ్లుంటారని..సేవ చేయడానికి వచ్చిన వాళ్లమైన మనకు రాజకీయాలెందుకని ప్రశ్నించారు. పురుషాధిక్యం ఉంటే జయసుధ ఎలా ఎదిగారన్నారు. ఎన్నికలు నిర్వహించేవాళ్లంతా వారి మనుషులేనని.. నామినేషన్ల గడువును ఎవరి కోసం పొడిగించాలో చెప్పాలన్నారు.

    మరో ప్రక్క ....మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. ఏ నాయకుడైనా ఓ మహిళ పోటీ చేస్తుందంటే ఆమెను ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి తప్ప ఓడించండి అని ప్రచారం చేయడం తగదు అని అన్నారు జయసుధ. మా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న ఆమె మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పురుషాధిక్యతతో కూడిన చిత్ర పరిశ్రమలో 43 ఏళ్లుగా నటిగా నా స్థానాన్ని నిలబెట్టుకుంటూవచ్చాను.

    నన్ను అధ్యక్షురాలిగా నిలబడమని మురళీమోహన్ చెప్పినప్పుడు ఏకగ్రీవం అయితే అంగీకరిస్తానని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత ఓటమిపాలైతే బాగుండదని ఆయనతో చెప్పాను. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల పోటీ చేయకతప్పలేదు. నటిగా కాకుండా నేను చేసిన సేవా కార్యక్రమాల ఆధారంగానే గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందాను. రాజకీయాల్లో ఉండటం వల్ల ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వచ్చింది. నన్ను గెలుపించిన పక్షంలో రెండు సంవత్సరాల పాటు కష్టపడి పనిచేస్తాను. మాట నిలబెట్టుకుంటాను. మాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అని తెలిపారు.

    English summary
    Actor Kalyan has filed a petition in the City Civil Court complaining that some irregularities have taken place in the MAA elections process. Responding to his petition, the Court has served notices to the outgoing President of MAA Murali Mohan, Ali and some other members in Jayasudha panel. The court asks them all to attend the court on Friday with explanation to the allegations made by Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X