twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ హీరోను ఇంట్లో నుండి గెంటేసిన కుటుంబ సభ్యులు

    By Bojja Kumar
    |

    చెన్నై: సీతా కోక చిలుక, వీర భద్రుడు, అన్వేషణ, పుణ్యశ్రీ, అభినందన, గోపాల్ రావుగారి అబ్బాయి, మగరాయుడు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ తమిళ హీరో కార్తీక్ ఇపుడు కష్టాల్లో పడ్డారు. ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో కుటుంబ సభ్యులు అతన్ని ఇంట్లోనుండి గెంటేసినట్లు సమాచారం.

    తమిళ నటుడు ముత్తురామన్ వారసుడైన కార్తీక్‌ చాలా కాలంగా తల్లి, తమ్ముడు, చెల్లితో కలిసి ఉంటున్నారు. వీరి కుటుంబానికి కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అయితే కార్తీక్‌కు తల్లికి మధ్య చాలాకాలంగా ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా కలిసి కార్తీక్‌ను బయటకు గెంటేసినట్లు సమాచారం.

    Actor Karthik thrown out of home

    తండ్రి ఆస్తి తనకు పంచాలని కార్తీక్‌ కోరగా కుటుంబ తల్తితో పాటు సభ్యులు నిరాకరించినట్లు సమాచారం. దాంతో కార్తీక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే కార్తీక్ డబ్బును వృధా చేస్తుండటం వల్లనే అతనికి ఆస్తులు ఇవ్వడానికి తాము నిరాకరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు సమాచారం.

    English summary
    Property disputes of Tamil senior actor Karthik gave him new headaches. He is thrown out of home by own family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X