»   » హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక పుట్టినరోజు వేడుకను ఆదివారం చెన్నైలో తన స్నేహితులు మధ్య గ్రాండ్ గా జరుపుకుంది. స్నేహితులు, సన్నిహితులు, ఆత్మీయుల మధ్య కేక్ కట్ చేసి ఆనందంగా గడిపించింది. పలువురు సినీ ప్రముఖులు హన్సికకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

బాలనటిగా కెరీర్ ప్రారంభించి 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా 'దేశముదురు'తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన హన్సిక అందంచందంతో పాటు చక్కని అభినయంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో హన్సిక బిజీ హీరోయిన్ గా మారింది.

చిన్నతనంలోనే తండ్రి నిరాదరణకు గురైన హన్సికకు ఆ లోటు, బాధ బాగా తెలుసు. అందుకే అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకుంటూ వారికి నీడను, తోడును కల్పిస్తోంది. అందంతో పాటు మంచి మనసు కూడా ఉన్న హన్సిక మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, నటిగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

స్లైడ్ షోలో ఫోటోస్.

హన్సిక

పుట్టిన రోజు వేడుకలో హన్సిక ఎంతో ఆనందంగా, చలాకీగా కనిపించింది.

కేక్ కట్ చేస్తూ..

పుట్టినరోజు వేడుకలో కేక్ కట్ చేస్తున్న హీరోయిన్ హన్సిక.

స్నేహితులతో...

పుట్టినరోజు వేడుకలోతన స్నేహితులతో కలిసి హీరోయిన్ హన్సిక ఇలా...

సినిమాలు

ఈ యేడాది ఇప్పటికే 'ఆంబలా', 'రోమియో జూలియట్' చిత్రాలు విడుదలయ్యాయి. 'వాలు, ఉయ్ రే ఉయ్ రే, పులి, అరణ్మనయ్ -2, ఇదయమ్ మురళీ' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

సన్నిహితులు

హన్సిక పుట్టినరోజు సెలబ్రేషన్ గ్రాండ్ గా జరిగింది.

 

 

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos