» 

తెలుగు హీరోయిన్ కు అశ్లీల SMS లు..వార్నింగ్

Posted by:

హైదరాబాద్ :శృతిహాసన్ ఉదంతం మరవక ముందో మరొకటి వెలుగులోకి వచ్చింది. తన సెల్‌ఫోన్ కు గత కొంతకాలంగా అశ్లీల SMS లు పంపుతున్న వ్యక్తిని తెలుగు హీరోయిన్ మధురిమ పట్టుకుంది. అతనెవరో కాదు ఆమె మాజీ మేనేజరే కావటంతో షాక్ అయ్యింది. తనపై దుష్ర్పచారం చేస్తున్న తనమాజీ మేనేజర్‌పై మధురిమ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి పనులు ఆగకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇంతకుముందు నటి శృతిహాసన్, రమ్య తదితర హీరోయిన్లకు ఇలా అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపి అల్లరి చేసిన ఆకతాయిలపై ఫిర్యాదు చేయగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజాగా నటి మధురిమపై ఆమె మాజీ మేనేజర్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా మందికి ఆ మేనేజర్ పరిచయమే.తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఎదుగుతున్న నటి మధురిమ. తన సెల్‌ఫోన్‌కు తరచూ అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయని, వాటికి కారణమెవరో తనకు తెలిసిందని మధురిమ పేర్కొన్నారు. తన మాజీ మనేజర్ అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపించడంతో పాటు తనను, పలువురు చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల నుంచి తొలగించారన్న దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన దర్శక నిర్మాతలు అతని మాటలు నమ్మలేదన్నారు. అతనిపై ఫిర్యాదు చేస్తారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి సహనంగానే ఉన్నానని చెప్పారు.

'ఆ..ఒక్కడు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మధురిమ ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సరదాగా కాసేపు' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన 'మహంకాళి', వెంకటేష్ హీరోగా వచ్చిన 'షాడో' చిత్రంలో శ్రీకాంత్ సరసన అవకాశం దక్కించుకున్నా ఆ సినిమా ఫట్ మనడంతో అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు.

ప్రస్తుతం అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్న భామల లిస్టులో మధురిమ కూడా చేరి పోయింది. ఆకట్టుకునే అందం, విచ్చలవిడిగా అందాలు ఆరబోసే తెగువ, నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ పాపం మధురిమకు కాలం కలిసి రాలేదనే చెప్పాలి. పరిశ్రమలో కొత్త భామల తాకిడి పెరిగి పోవడం కూడా...మధురిమ లాంటి వారికి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణమవుతోంది.

Read more about: tollywood, madhurima, ramya, sruthi hassan, shadow, టాలీవుడ్, మధురిమ, రమ్య, శృతి హాసన్
English summary
Shruti Haasan faced a jolt when a stalker tried to enter her home in Mumbai recently. After few days of the incident, police nabbed the culprit. Now, Tollywood actress Madhurima Banerjee is also facing the same kind of problem. But, Madhurima case is entirely different from other heroines as the stalker here is none other than her former manager.
Please Wait while comments are loading...