»   »  బ్రహ్మనందం ఒప్పుకోలేదు.. కిడ్నాప్‌కు ప్రయత్నించారు.. రమ్యశ్రీ

బ్రహ్మనందం ఒప్పుకోలేదు.. కిడ్నాప్‌కు ప్రయత్నించారు.. రమ్యశ్రీ

ప్రముఖ హాస్య నటులు బ్రహ్మనందం, బాబు మోహన్ తమ పక్కన ఒప్పుకోకపోవడం వల్ల దాదాపు పాతిక సినిమాలు చేజారయని ప్రముఖ శృంగార నటి రమ్యశ్రీ తెలిపారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాస్య నటులు బ్రహ్మనందం, బాబు మోహన్ తమ పక్కన ఒప్పుకోకపోవడం వల్ల దాదాపు పాతిక సినిమాలు చేజారయని ప్రముఖ శృంగార నటి రమ్యశ్రీ తెలిపారు. వారు చెప్పారో లేదో కాని ఈ విషయాన్ని నిర్మాతలు తనతో చెప్పారని అన్నారు. నన్ను చూస్తారా ఆమెన చూస్తారా అని బ్రహ్మనందం అన్నట్టు అందుకే ఆయన ఒప్పుకోవడం లేదని నిర్మాతలు చెప్పారని యూట్యూబ్ చానెల్ యోయోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

 Actress Ramya sri shocking revealtion

ఫ్యామిలీ సర్కస్ షూటింగ్ ఒక సందర్భంగా 'దానికి ఎంత స్టైల్. ఒకడు అద్దం పట్టుకొనే వాడు.. ఒకడు కుర్చీ వేసేవాడు' అంటూ కోటా శ్రీనివాసరావు కూడా తనపై దుర్భాషలాడారని ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయనను డైరెక్ట్ గా అడిగానని చెప్పారు.

హీరో వినోద్ కుమార్ తో అమ్మనా కోడలా చిత్రంలో నటిస్తున్నప్పుడు తనను కొందరు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని తెలిపారు. వారు ఎవరో తెలియదని చెప్పారు. అయితే శివాజీ రాజా, బాబుమోహన్ తదితరులు తనను కాపాడారని ఆమె తెలిపారు.

English summary
Ramya sri reveals shocking incidents to media. Brahmanandam several other actors rejected me, she said
Please Wait while comments are loading...