»   » సరేనంది.. ఆ తర్వాత హ్యాండిచ్చింది..నిర్మాత లబోదిబో.. విద్యాబాలన్‌పై కోర్టు కేసు!

సరేనంది.. ఆ తర్వాత హ్యాండిచ్చింది..నిర్మాత లబోదిబో.. విద్యాబాలన్‌పై కోర్టు కేసు!

ప్రముఖ రచయిత్రి కమలాదాస్ జీవిత ఆధారంగా తెరకెక్కనున్న ఆమీ చిత్రం నుంచి వైదొలిగిన విద్యాబాలన్ లీగల్ సమస్యల్లో ఇరుక్కోనున్నది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి విద్యాబాలన్ చిక్కుల్లో పడింది. మలయాళ చిత్రంలో నటించాలన్న ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కమలాదాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఆమీ చిత్రంలో నటించేందుకు ముందు విద్యాబాలన్ ఒకే చెప్పింది. స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ప్రాజెక్ట్‌‌కు ఓకే చెప్పింది. కానీ క్రియేటివ్ విభేదాల కారణంగా చివరి నిమిషంలో ఈ సినిమాను చేయడం లేదని ఆమె వైదొలగింది.

చివరి నిమిషంలో విద్యాబాలన్ షాక్


‘కథను అనుసరించి చివరి నిమిషంలో స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. కొత్త స్క్రిప్ట్‌ ఆమెకు నచ్చలేదు. కానీ ఒప్పించేందుకు ప్రయత్నించాం. అయినా మా ప్రయత్నం సఫలం కాలేదు' అని చిత్ర డైరెక్టర్ కమల్ తెలిపారు.

ఆమెకు ఈ పాత్ర కష్టమైంది.. అందుకే..


‘చాలా ప్రభావంతమైన పాత్రలో ఒదిగిపోవడం విద్యాబాలన్‌కు పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ పాత్రను వదులుకున్నది. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించకలేకపోవడం మరో సమస్య. పాత్ర తీరుతెన్నుల గురించి జరిగే డిస్కషన్ కోసం అందుబాటులోకి రావడం లేదు' అని ఆయన అన్నారు.

విద్యాబాలన్ చాలా ఇబ్బంది పెట్టింది


విద్యాబాలన్ వల్ల నిర్మాతలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆమె ఈ చిత్రం నుంచి వైదొలగడం వల్ల సినిమా బిజినెస్ దెబ్బతిన్నది. ఇప్పటికే నిర్మాత ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆమె చేసిన నిర్వాకంతో మళ్లీ ప్రాజెక్ట్‌ను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తున్నది.

చట్టపరమైన చర్యలు తీసుకొంటాం

విద్యాబాలన్ చేసిన నిర్వాకంతో నిర్మాతలు మండిపడుతున్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. జరిగిందేదో జరిగిపోయింది. విద్యాబాలన్ స్థానంలో మరొకరి ఎంపిక చేశాం. ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యామని దర్శకుడు కమల్ తెలిపారు.

విద్యాబాలన్ స్థానంలో మను వారియర్


విద్యాబాలన్ ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోవడంతో ఆ అవకాశం మను వారియర్‌కు దక్కింది. రచయిత్రి కమలాదాస్ పాత్రను మను వారియర్ పోషిస్తున్నారని డైరెక్టర్ కమల్ తెలిపారు. ‘కమలాదాస్ పాత్రను పోషించడం చాలా గర్వంగా ఉంది. థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ఈ పాత్ర దక్కినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను' అని మను వారియర్ తెలిపింది.

రచయిత్రి కమలాదాస్ జీవితం ఇది


స్త్రీ లైంగిక స్వేచ్ఛపై బహిరంగంగా మద్దతు ఇచ్చిన వారిలో వివాదాస్పద రచయిత్రి కమలాదాస్ (1934-2009) ఒకరు. ఆమె తన రచనల్లో మహిళా స్వేచ్ఛ, హక్కులను ప్రస్తావించారు. ఆమె తన 42వ ఏట మై స్టోరీ (ఏంటే కథ) పేరుతో ఆత్మకథను రాసుకొన్నారు. తన జీవితపు చరమాంకంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

 

 

English summary
Vidya Balan was all set to work in her debut Malayalam film 'Aami', until she decided to opt out at the eleventh hour due to 'creative differences' with the film's director, Kamal. Malayalam director Kamal has finally chosen Manu Warrier to play the role of late Kamala Das.
Please Wait while comments are loading...