twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి షూటింగ్‌లో పడిపోయాడు.. 104 జ్వరంతో..

    మెగాస్టార్ చిరంజీవికి సినిమాలపై ఉన్న అంకితభావాన్ని సీనియర్ నటుడు చిరంజీవి వెల్లడించారు.

    By Rajababu
    |

    సినీ పరిశ్రమలో నటుడు రాజా రవీంద్ర 30 ఏండ్ల అనుభవం. ఆయన ఎన్నో మంచి పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవికి సినిమాలపై ఉన్న అంకితభావాన్ని చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమలో డెడికేషన్ ఉన్న నటుల్లో చిరంజీవి ప్రత్యేకమైన వారని, ఆయన అంకితభావాన్ని రుజువు చేయడానికి వందల సంఘటనలు సాక్షంగా ఉన్నాయని తెలిపారు.

     ఇప్పటి హీరోల్లో చిరంజీవికి ఉన్న డెడికేషన్ లేదు

    ఇప్పటి హీరోల్లో చిరంజీవికి ఉన్న డెడికేషన్ లేదు

    సినిమాపై చిరంజీవికి ఉన్న డెడికేషన్ ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ లేదు. ఇవ్వాల్టికి సాంగ్ షూటింగ్ అంటే రిహార్సల్ చేస్తారు. చిరంజీవికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. పొద్దున లేవగానే ఆయనకు సీన్ పేపర్‌తో జీవితం మొదలవుతుంది. ఇన్నేండ్ల కెరీర్‌లో నాకే ఎగ్జయిట్‌మెంట్ లేదు. ఈయనకు ఎందుకు అని ఆశ్చర్య పోతుంటాను.

     మేకప్ వేసుకొంటే చిరంజీవి పవర్‌ఫుల్

    మేకప్ వేసుకొంటే చిరంజీవి పవర్‌ఫుల్


    ఒకసారి ఆయన మేకప్ వేసుకొంటే చిరంజీవిలో పవర్‌ను ఎవరు తట్టుకోలేరు. ఆయన దగ్గరలో కూడా కూర్చొనేవాడిని కాదు. ఓ సీన్ చేయాలన్నా.. ఇంప్రూవైజ్ చేయాలన్న ఆ క్వాలిటీ ఏ హీరోలో కూడా కనిపించలేదు.

    అందుకే ఆయన మెగాస్టార్

    అందుకే ఆయన మెగాస్టార్


    3. పదేండ్ల తర్వాత కూడా ఆయనే మెగాస్టార్
    పదేండ్ల తర్వాత మళ్లీ సినిమాలోకి ప్రవేశించినా ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. అది అందరికీ సాధ్యంకాదు. అందుకే ఆయన రికార్డులను కొల్లగొట్టారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.

     చిరంజీవికి తీవ్రమైన వెన్నముక నొప్పి..

    చిరంజీవికి తీవ్రమైన వెన్నముక నొప్పి..

    కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలిరా అనే పాటలో తీవ్రమైన వెన్నముక నొప్పితో బాధపడ్డారు. షూటింగ్‌లోనే పడిపోయారు. కార్ వ్యాన్‌లో బాధపడుతున్న చిరంజీవిని చూడటానికి వెళ్లాను. ఆ సందర్భంగా తన బాధను డ్యాన్స్ మాస్టర్‌కు చెప్పవద్దని అన్నారు. ఆ నొప్పితోనే పాటను పూర్తి చేశారు. అదే రోజు అర్ధరాత్రి చిరంజీవిని చికిత్స కోసం అమెరికా షిఫ్ట్ చేశారు.

    104 డిగ్రీల జ్వరం.. అయినా డ్యాన్స్

    104 డిగ్రీల జ్వరం.. అయినా డ్యాన్స్

    జగదేకవీరుడు అతిలోక సుందరిలో అమ్మనీ తీయని దెబ్బ పాటను 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. శ్రీదేవి డేట్స్ ప్రాబ్లం ఉండటంతో మూడు రోజులు జ్వరంతోనే షూటింగ్ చేశారు. ఆఖరిరోజు స్పృహ కోల్పోయి కిందపడిపోతే హాస్పిటల్‌లో చేర్చారు. రెండు రోజుల తర్వాత మళ్లి స్పృహలోకి వచ్చారు. అది చిరంజీవి డెడికేషన్. మెగాస్టార్ కావడం మామూలు విషయం కాదు. ఉన్న హోదాను నిలబెట్టుకోవడానికి కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. అది ఒక్క చిరంజీవిలోనే కనిపించింది.
     మే నెల ఎండలో చెప్పులు లేకుండా..

    మే నెల ఎండలో చెప్పులు లేకుండా..

    మరోసారి మంజునాథ చిత్రంలో శివుడిపాటను మే నెలలో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. విపరీతమైన ఎండలో చిరంజీవి శరీరంలో దాదాపు బట్టలు లేకుండా నటించారు. ఎండలో చెప్పులు లేకుండా సైడ్ డాన్సర్లు కూడా డ్యాన్స్ చేశారు. ఎండలో చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయడమనేది ఆయన అంకితభావానికి నిదర్శనం.

    English summary
    Actor Raja Ravindra has 30 years Experience in film Industry. He shares lot of experiences and relation with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X