twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆదిత్య 369: బాలయ్య కోసం చిరు యాడ్స్ (25 ఏళ్ల జ్ఞాపకాలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప సినిమాల లిస్టు తయారు చేస్తే అందులో తప్పకుండా ఉండే సినిమా బాలయ్య హీరోగా, సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆదిత్య 369' సినిమాకు చోటు దక్కుతుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    టైమ్ మెషీన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో ఓ సెన్సేషన్, ట్రెండ్ సెట్టర్. అప్పటివరకూ కుటుంబ కథా చిత్రాలు, పౌరానిక చిత్రాలు మాత్రమే తెలిసిన తెలుగు ప్రేక్షకులకు సైన్స్ ఫిక్షన్ సినిమాతో మంచి వినోదాన్ని అందించారు. 1991 లో విడుదలైన ఈ సినిమా 'ఆదిత్య 369' సినిమా విడుదలయ్యి నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు...

    అప్పట్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో ఇదీ ఒకటి. 110 రోజుల్లో దాదాపుగా కోటి యాభై రెండు లక్షల రూపాయలను బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంటే ఆ ఖర్చు ఇపుడు కనీసం అరవై కోట్ల బడ్జెట్ తో సమానం. భారీ విజయం సాధించిన ఈసినిమా అప్పట్లో రూ. 9 కోట్ల వరకు వసూలు చేసింది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు తొమ్మిది రెట్ల లాభం.

    ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం టైం మిషీన్ కాన్సెప్టుతో పాటు శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని ఎంతో అద్భుతంగా చూపడమే. దీంతో పాటు టైం మిషన్ అనుకోకుండా భవిష్యత్ కాలానికి వెల్లడం, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూపడం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

    దూరదర్శన్‌లో చిరంజీవి యాడ్స్...
    అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి, పిల్లలను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్మాత దూరదర్శన్ లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేసారు. చిరంజీవితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించి ఆయన్ను రిక్వెస్ట్ చేసారట. నిర్మాత అడగ్గానే వెంటనే ఒప్పుకున్న చిరంజీవి 'ఆదిత్య 369' సినిమా యాడ్స్ లో నటించారు. ఈ యాడ్స్ దూరదర్శన్ లో ప్రసారం అయి ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి తోడ్పడ్డాయి. దీంతో సినిమా మరింత భారీ హిట్ అయింది.

    స్లైడ్ షోలో సినిమాకు సంబందించిన అప్పటి ఫోటోలు, మరిన్ని ఆసక్తికర విషయాలు..

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ బాలయ్యతో సినిమా చేయాలని డేట్స్ బుక్ చేసుకున్నారు. అయితే అప్పటికి ఆయన వద్ద కథలేదు. ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సింగీతం శ్రీనివాసరావు ఈ కథ వినిపంచారు.

    బాలయ్య అయితేనే...

    బాలయ్య అయితేనే...


    బాలూకీ కథ నచ్చడంతో ఆయన దగ్గరి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్‌ కు చెప్పి బాలయ్య అయితేనే ఈ సినిమాకు బాగా సూటవుతారనే ఆలోచనకు వచ్చారు. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.

    సూపర్ సెలక్షన్

    సూపర్ సెలక్షన్


    ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా సూపర్. జంధ్యాల మాటలురాయగా, ఇళయరాజా సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్ ను ఎంపిక చేసారు...పలు కారణాలతో ఆయన తప్పుకోగా వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌లాల్‌లకు ఆ బాథ్యత నిర్వహించారు.

    నటీనటులు

    నటీనటులు


    తొలుత హీరోయిన్ గా విజయశాంతిని అనుకున్నారు... కానీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేపోవడంతో పీసీ శ్రీరాంకు పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. శాస్త్రవేత్త పాత్రలో హిందీ నటుడు టీనూ ఆనంద్‌ జీవించారు. అలాగే అమ్రిష్‌పురి, గొల్లపూడి మారుతీరావు, బాబూమోహన్‌, తనికెళ్ల భరణి, సుత్తివేలు, చంద్రమోహన్‌, చలపతిరావు, సిల్క్‌స్మిత, శుభలేఖ సుధాకర్‌, బ్రహ్మానందం, బాల నటులుగా తరుణ్‌, రాశి అదరగొట్టారు.

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    ఆదిత్య 369

    ఆదిత్య 369


    ఆదిత్య 369 మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్

    English summary
    Today (July 18th), 25 years ago (in 1991), Balakrishna's sci-fi film "Aditya 369" made by Singeetham Srinivasa Rao has released in theatres. To promote the film more, producer Sivalenka Krishnaprasad wanted to make ads that attract children and when he requested Chiranjeevi to act in them, the mega hero agreed to it without any second thoughts. The ads were telecasted on Doordarshan and producer says they are huge hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X