» 

పెళ్లి, హనీమూన్‌ తర్వాత మళ్లీ అదే దారిపట్టిన తార

Posted by:
 

నటి మధుమిత గుర్తుందా? గత కొన్ని రోజుల క్రితం తెలుగు నటుడు శివబాలాజీని పెళ్లి చేసుకుందే..ఆవిడే, ఈవిడ. మధుమిత కొడైకుళ్ మళై చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. చక్కని కుటుంబ కథా చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా అమ్మడు మళ్లీ సినిమాల దారి పట్టడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆమెకు పెద్దగా అకాశాలు లేవు. ఇది కాస్త నిరాశ పరిచే అంశమే అయినా మళ్లీ నటిగా బిజీ అవుతున్నాననే నమ్మకంతో ఉంది. హీరోయిన్ పాత్రలే కావాలని తాను కోరుకోవడం లేదని, కథకు ప్రాముఖ్యత ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమని దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ....పెళ్లి, హనీమూన్ అంటూ కొంతకాలం గడిపేశానని, యోగి(తమిళం) చిత్రం తర్వాత మంచి పాత్రలు రాలేదని తెలిపారు. గ్లామరస్ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని స్పష్టం చేశారు. పెళ్లి అయింది కాబట్టి ఈ మాటలు చెప్పడంలేదని, మొదటి నుంచి గ్లామర్‌కు దూరంగానే ఉంటున్నానని మధుమిత స్పష్టం చేసింది. కొన్ని వచ్చినా పాత్రలు నచ్చకపోవడంతో నిరాకరించాన న్నారు. ఈ కారణంగా కొంచెం గ్యాప్ వచ్చిందని తెలిపింది. ఈ క్రమంలోనే పెళ్లి, హనీమూన్ అంటూ కాలం గడిపానని వెల్లడించింది. ప్రస్తుతం తమిళం, తెలుగులో ఒక్కొక్క సినిమా చేస్తున్నానని వెల్లడించారు. తెలుగులో మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను, దీక్షాసేథ్ హీరోయిన్లుగా నటిస్తున్నామని చెప్పుకొచ్చింది.

Read more about: madhumitha, shiva balaji, yogi, manchu manoj, మధుమిత, శివబాలాజీ, యోగి, మంచు మనోజ్
English summary
After marriage heroine Madhumitha interest to acting. Now she get chance in Manchu Manoj movie.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos