twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ హీరోయిన్ పట్ల అధికారి అసభ్యంగా..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తీన్ మార్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి కర్బంద‌కు ఇటీవల బెంగులూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా ఆఫీసర్ ఆమె పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించాడు. సదరు ఆఫీసర్‌పై పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె ఎయిర్ ఇండియాకు ఓపెన్ లెటర్ రాసింది.

    Air India Officer Misbehaves With Kriti Kharbanda

    కృతి కర్భంద లెటర్ లోని వివరాలు ఇలా ఉన్నాయి...
    ‘ఆగస్టు 16వ తేదీన బెంగుళూరు నుండి హైదరాబాద్‌కు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అదే వారంలో నేను సేమ్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం ఇది రెండో సారి. సమయానికే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాను. నా లగేజ్ వెయిట్ చెక్ చేసారు. 18.3 కేజీలు ఉంది. అక్కడ ఉన్న ఆఫీసర్ 15 కేజీల లిమిట్ కంటే 3 కేజీలు ఎక్కువగా ఉంది. అదనంగా డబ్బులు కట్టమని అడిగారు. రెండు రోజుల క్రితం సేమ్ ఫ్లైట్ వెళ్లినపుడు 20 కేజీల లిమిట్ అనుమతించారు. ఇదే విషయమై ఆయన్ను ప్రశ్నించారు. అయితే ఆ ఆఫీసర్ చాలా పొగరుగా సమాధానం ఇచ్చారు. కస్టమర్‌గా నాకు అడిగే హక్కు ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతడికి ఉంది. తాను అడిగిన ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండా పొగరుగా, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఇదే విషయం అక్కడి మేనేజర్ దృష్టికి కడా తీసుకెళ్లాను. కానీ వారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. నేనేదో నటి కాబట్టి ఈ ఫిర్యాదు చేయడం లేదు. ఒక సాధారణ మహిళగా ఈ లెటర్ రాస్తున్నాను. మరొక మహిళకు ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదనే ఈ లెటర్ రాస్తున్నారు. కస్టమర్ల పట్ల సభ్యత లేకుండా ప్రవర్తించే అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి' అంటూ కృతి కర్బంద తన లెటర్లో రాసారు.

    English summary
    An Air India check-in officer has misbehaved with actress Kriti Kharbanda (Teen Maar fame) regarding a baggage issue. She complains that the officer was very rude to her and behaved in an objectionable manner. She alleges even the Airlines Authorities weren't helpful when she tried to lodge a complaint against the officer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X