»   »  పూరి కి ట్విస్ట్ ఇచ్చి, రామ్ కు రాం..రాం చెప్పి, బికినీతో భారీ ఆఫర్

పూరి కి ట్విస్ట్ ఇచ్చి, రామ్ కు రాం..రాం చెప్పి, బికినీతో భారీ ఆఫర్

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొందరు హీరోయిన్స్ కెరీర్ చాలా చిత్రంగా మొదలవుతుంది. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలు మొదలవుతాయి, ఆగిపోతాయి.స్టార్ డమ్ వచ్చేవరకూ ఏదీ నికరం ఉండదు. మోడలింగ్ లో ఓ స్దాయికి చేరి సినిమా ఫీల్డ్ లో దెబ్బలు తిని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న ఆయేషా శర్మ గురించి ఇదంతా. నేహా శర్మ చెల్లెలు.

ఆయేషా శర్మా..ఎక్కడో ఈ పేరు విన్నాము అంటారా... అదేనండీ ఆ మధ్యన పూరి జగన్నాథ్ 'రోగ్' టైటిల్ తో తెలుగు, కన్నడలో ఓ సినిమా మొదలెట్టారు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభం చేసారు. నిర్మాత సిఆర్ మనోహర్ అన్న కొడుకు ఇషాంత్ ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ 'రోగ్' మూవీ తెరకెక్కిస్తూ ఈమెను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో రోగ్ కు బై చెప్పేసింది.


అయితే ఆమె ఎందుకు తప్పుకుంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. డేట్స్ అడ్జెస్ట్ చేయడం సమస్య వల్లనే ఆమె తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఫస్ట్ షెడ్యూల్ లో ఐషా శర్మ తో బ్యాంకాక్ లో కొంత షూటింగ్ కూడా చేసారు. మరి ఎందుకు ఇలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

ఇంతే కాదు అంతకు ముందు కూడా హీరో రామ్ 'శివం' మూవీలో కూడా ఐషా శర్మ హీరోయిన్ గా ఎంపికైంది కానీ ప్రాజెక్టు మొదలవ్వక ముందే తప్పుకుంది.ఇలా ఇక్కడ ఎడ్జెస్ట్ అవ్వలేక వెళ్లిపోయిన ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. వరుణ్ ధావన్ సరసన జుద్వా 2 లో ఆమె ఎంపికైంది. ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవటానికి ప్రధాన కారణం..ఆమె బికినీలో ఫొటోలే అని చెప్తున్నారు. సినిమాలో ఆ తరహా సీన్స్ ఉండటంతో ఆమెను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

బికినీ ఫొటోల్లో ఈ భామను చూస్తూ మరిన్ని విశేషాలు చదవండి...

కథక్ డాన్సర్

ప్రారంభం రోజుల్లో ఆమె కథక్ డాన్సర్ అంటే నమ్ముతారా

 

అంతేనా సింగర్ కూడా

 

ఆయేషా మల్టిటాలెంటెడ్ ఆమె మంచి సింగర్ కూడా. అయితే ప్రస్తుతం నటనమీదే దృష్టి పెట్టింది

 

చదవు

 

ఓ ప్రక్కన ఆమె మీడియా అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పుచ్చుకునే పనిలో ఉంది

 

చిన్నప్పటినుంచీ

 

చిన్నప్పటినుంచీ ఆమె డిల్లీలోనే ఉంటోంది

 

అక్క ప్రభావం

 

తన అక్క నేహా శర్మ ప్రభావం తనపై ఖచ్చితంగ ఉంటుందని చెప్తోంది.

 

పరిచయాలు

 

తన అక్క సినిమా పరిశ్రమ లో ఆల్రెడీ ఉండటంతో తనకు సినిమా పరిచయాలు ఈజిగా దొరికాయంటోంది.

 

లాక్మే ఇండియా

 

ఆమె మనందరికీ లాక్మే ఇండియా మోడల్ గా సుపరిచితురాలు

 

స్క్రిప్టు నచ్చాలి

 

తనకు తొలి చిత్రమైనా తనకు స్క్రిప్టు నచ్చి, క్యారక్టర్ బాగుంటేనే చేస్తానంటోంది

 

గ్లామర్ కి సై

 

తను గ్లామర్ పాత్రలు చేయటానికి వెనకాడనని, అలాగని వల్గారిటి చూపెడదామనుకుంటే మాత్రం నో అంటానంటోంది

 

బాలీవుడ్ ఎంట్రీ

 

తన బాలీవుడ్ ఎంట్రీ సాజిద్ నడియావాలా వంటి నిర్మాతతో జరగటం హ్యాపీ అంటోంది.

 

సీనియర్ డైరక్టర్

 

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

 

ఫ్రెష్ ఫేస్ కావాలని

 

తనను తీసుకోవటానికి కారణం ఫ్రెష్ ఫేస్ కావాలని దర్శక,నిర్మాతలు కోరుకోవటమే అంటోంది.

 

డబుల్ రోల్

 

ఈ సినిమాలో వరుణ్ ధావన్ ది డబుల్ రోల్. అందులో ఒకరికి ఈమె హీరోయిన్

 

తండ్రి

 

ఆమె తండ్రి కాంగ్రేస్ పార్టీ ఎమ్మల్యే కావటం విశేషం.

 

వాయిస్ క్లాసెస్

 

తను ప్రస్తుతం వాయిస్ క్లాసెస్ లకు వెళ్తున్నానంటోంది

 

సూచనలు

 

తనకు తన సోదరి నేహాశర్మ నటనలో సూచనలు ఇచ్చి గైడ్ చేస్తుందని చెప్తోంది.

 

సెటిల్ అవుతుంది

 

ఈ సినిమాతో ఖచ్చితంగా బాలీవుడ్ లో సెటిల్ అవుతాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.

 

యంగ్ హీరోలు

 

వరుణ్ ధావన్ ప్రక్కన ఎంపిక అవటంతో ఆమెపై మిగతా యంగ్ హీరోల దృష్టి కూడా పడింది.ఎంక్వైరీలు వస్తున్నట్లు తెలుస్తోంది.

 

సీనియర్స్ తో

 

అయితే తనకు మాత్రం సీనియర్స్ తో నటించి నేర్చుకోవాలన్న ఆలోచన ఉందని చెప్తోంది.

 

వయస్సుకు తగ్గట్లే

 

తను మాత్రం వయస్సుకు తగ్గ పాత్రలే వేస్తానని, తను మోడరన్ యూత్ పాత్రకు బాగా నప్పుతాని చెప్తోంది.

 

రెగ్యులర్ గా..

 

తను రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తానంటోంది

 

ఫిట్ నెస్

 

అలాగే తాను ఫిట్ గా ఉండటానికి ప్రయారిటీ ఇస్తానని చెప్తోంది. అందుకే డైలీ జిమ్ లో కొద్ది సేపు గడుపుతానంటోంది

 

సౌత్ కు వస్తాను

 

తనకు వచ్చిన సౌత్ ఆఫర్స్ మిస్ ఫైర్ అయ్యాయని , ఖచ్చితంగ మళ్లీ సౌత్ లో చేస్తానంటోంది

 

సక్సెస్ అయితే

 

హిందీలో సక్సెస్ అయితే ఆమెకు తెలుగు,తమిళ నుంచి పెద్ద హీరోల ఆఫర్స్ వస్తాయనటంలో సందేహం లేదు

 

దృషి మొత్తం


తను ఆలోచనలు, దృష్టి మొత్తం తన తొలి చిత్రంపైనే ఉందని, దాని గురించే ఆలోచిస్తున్నాని చెప్తోంది.

English summary
Actress Neha Sharma's sister, Aisha is headed to the big screen with Sajid Nadiadwala's Judwaa 2, directed by David Dhawan, starring Varun Dhawan.
Please Wait while comments are loading...