twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖరారు: వెంకటేష్ చేసిన పాత్రలో అజయ్ దేవగన్

    By Srikanya
    |

    ముంబై :మోహన్‌లాల్‌, మీనా కీలక పాత్రధారులుగా జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘దృశ్యం'. అక్కడ ఘనవిజయం సాధించిన చిత్రమిది. వెంకటేశ్‌, మీనా జంటగా అదే టైటిల్‌తో శ్రీప్రియ తెలుగులో, వి.రవిచంద్రన్‌ హీరోగా పి.వాసు కన్నడలో రీమేక్‌ చేయగా ఇరు ప్రేక్షకులను అమితంగా అలరించిందీ చిత్రం. తమిళంలో కమలహాసన్‌ తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటిలోనూ రూపొందిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించబోతోంది. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ‘దృశ్యం' హిందీ రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకొంది.

    అజయ్ దేవగన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. దర్శకుడు జీతుజోసెఫ్‌ ప్రస్తుతం తమిళ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఎవరు దర్శకత్వం వహిస్తారు, అజయ్ కి జోడిగా నటించబోయే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే కాజోల్ చేయవచ్చని అంటున్నారు. అయితే ఆమె ఈ మధ్య కాలంలో వెండితెరకు దూరంగా ఉంటున్నారు. నిజ జీవితంలో భార్య భర్తలు అయిన వీళ్ళు వెండితెరపై కూడా అలాగే కనపడి సందడి చేస్తారేమో చూడాలి.

    Ajay Devgan in Hindi Drushyam

    ఇక మరో ప్రక్క ఈ చిత్రానికి మూలమైన నవల 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని అక్కడ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లు బాలీవుడ్‌ సమాచారం. 'ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌'. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన నవల. కేగో హిగాషినో రచించిన ఈ నవల జపాన్‌లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు అందుకొంది. ఈ కథను బాలీవుడ్‌ వెండితెరపై చూపించాలనుకుంటున్నారు దర్శకుడు సుజయ్‌ ఘోష్‌. దీన్ని ఏక్తా కపూర్‌ నిర్మిస్తారు.

    ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు కత్రినా కైఫ్‌ని సంప్రదించడంతో పాటు ఆమెకు ఈ పుస్తకాన్నీ పంపించారట. కత్రినాకు ఈ కథ నచ్చడంతో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది. ఇక ఇప్పటికే దక్షిణాదిన 'దృశ్యం' సినిమా రిలీజై ఆకట్టుకుంటోంది. తొలుత మలయాళంలో జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. మలయాళంలో యాభైకోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే పాయింట్‌తో తీసిన ఈ చిత్రం రీమేక్‌ హక్కులు తీసుకుని కన్నడ, తెలుగు భాషల్లో రూపొందించారు. తెలుగు చిత్రంలో వెంకటేశ్‌, మీనా నటించగా సీనియర్‌ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

    తెలుగు 'దృశ్యం' ఇటీవలే విడుదలై సక్సెస్‌బాటలో ఉంది. ఇప్పుడు 'దృశ్యం' కథపై వివాదం మొదలైంది. జపాన్‌ భాషలో వచ్చిన 'ది డివోషన్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' అనే నవలా హక్కులను ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తాకపూర్‌ తీసుకున్నారు. హిందీలో చిత్రం నిర్మించే ఆలోచనతో ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఏమంటే నవలలోని ప్రధానాంశాలను ఆధారంగా చేసుకుని 'దృశ్యం' సినిమా తీశారనేది.

    English summary
    ‘Drushyam’ re-make with the same title starring Venkatesh turned out to be hit in Telugu. Currently Kamal Haasan is doing the re-make in Tamil as ‘Paapanasam’ and in Hindi, it is coming out that Ajay Devgan will be starring in the re-make.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X