Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదిరింది: అఖిల్,వినాయిక్ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్(వీడియో)
హైదరాబాద్:అక్కినేని నటవారసుడు అఖిల్ నటిస్తున్న పరిచయ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అఖిల్ స్నేహితుడు, యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఏప్రియల్ ఏప్రిల్ 8 అంటే ఈ రోజు అఖిల్ బర్త్‌డే. పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాత హీరో నితిన్ అభిమానులకు గిఫ్టు ఇచ్చారు. ఆ గిఫ్టు మరేదో కాదు అఖిల్ ఫస్ట్‌లుక్ టీజర్. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు వినాయక్ ఏడాది పాటు స్ర్కిప్ట్‌ని డెవలప్ చేసి శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేషా సైగల్ నటిస్తుండగా..అనూప్ రూబెన్స్, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే యూకేలో ఓ భారీ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా హీరోయిన్‌గా నటిస్తోంది.
అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో చూపించిన మేకింగ్‌ను చూసి అంతా అద్బుతమని అంటున్నారు. నితిన్ ఈ సినిమా విషయంలో అన్నీ దగ్గరుండి ప్లాన్ చేస్తున్నారు.
ఈ టీజర్‌లో అఖిల్‌ను చూసిన వారంతా మరో ప్రామిసింగ్ హీరో తెలుగు తెరకు పరిచయం అయ్యాడంటున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని టీజర్ చూసినవారు అంటున్నారు.
వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్.
వెంకటేష్ మాట్లాడుతూ... ''అఖిల్ రూపంలో ఒక కొత్త స్టార్ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.
నితిన్ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్ సినిమాలు 'శివ', 'మాస్' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్ హిట్ సినిమా ఇస్తామని వినాయక్, నితిన్ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.
అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.
అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్, అనూప్ రూబెన్స్ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.
నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.