twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని అఖిల్...! నువ్వు సూపర్....!! ఎందుకంటారా..? (ఫొటో స్టోరీ)

    |

    యువ హీరో అఖిల్ కూడా తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం లో తన చేయి వేసాడు శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) పోలీసులు శుక్రవారం పోలీ్‌సస్టేషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి అఖిల్‌ ముఖ్య అథితిగా హాజరై మొక్క నాటాడు.

    ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక చెట్టు ఐదు ఏసీల కంటే ఎక్కువగా గాలిని ఇస్తుందని తన తల్లి అమల తనకు చిన్నప్పుడు చెప్పిందని చెబుతూ... తనకూ మొక్కలు పెంచటం ఇష్టమేనని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చివర్లో ఒక సూచన కూడా చేసాడు.

    రెండో విడత హరితహారం ఘనంగా మొదలైంది. రాజకీయనేతలతోపాటు అధికారులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దగ్గరనుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు అందరూ ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలన్న సీఎం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టనున్న 'హరిత హారం' కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రెండు వారాల పాటు నిరాటంకంగా కొనసాగనున్న ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీల్లో సిద్ధంగా ఉన్న 46 కోట్ల మొక్కలను నాటనున్నారు.

    పర్యావరణ సమతుల్యత కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ దేశంలో ప్రస్తుతం 22 శాతం, తెలంగాణలో 24 శాతం భూభాగమే అడవులు, పచ్చదనంతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు.

    అయితేనిరుడు 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినప్పటికీ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 15 కోట్లకు మించలేదు. నాటిన మొక్కల్లో 60 శాతం కూడా మనలేదు. దీంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 46కోట్ల మొక్కలను నాటి వచ్చే యేటికి లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అదే సమయం లో అఖిల్ లాంటి యువ హీరోల చొరవ ఇప్పటి తరం యువతలో ఉత్సాహాన్ని నింపనుంది.

    నటనా, కెరీర్ అంటూ ఉండిపోవటం లేదు నేటి హీరోలు... సమాజానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఇదివరలో కూడా ఒక బాలుడి చికిత్స కోసం ఈ అక్కినేని వారసుడు ఖమ్మం లో ఆటో నడిపిన సంగతి తెలిసిందే ...

    నిన్నటి హరిత హారం లో మొక్కలు నాటినప్పటి విశేషాలు స్లైడ్ షో లో....

    సమాజానికి

    సమాజానికి

    నటనా, కెరీర్ అంటూ ఉండిపోవటం లేదు నేటి హీరోలు... సమాజానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టిన అక్కినేని అఖిల్ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి గానే ఉన్నాడు.

    హరితహారం లో అఖిల్

    హరితహారం లో అఖిల్

    రెండో విడత హరితహారం లో తన చేయి వేసాడు యువ హీరో అఖిల్ . శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) పోలీసులు శుక్రవారం పోలీ్‌సస్టేషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి అఖిల్‌ ముఖ్య అథితిగా హాజరై మొక్క నాటాడు.

    అమ్మ చెప్పింది

    అమ్మ చెప్పింది

    ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక చెట్టు ఐదు ఏసీల కంటే ఎక్కువగా గాలిని ఇస్తుందని తన తల్లి అమల తనకు చిన్నప్పుడు చెప్పిందని చెబుతూ... తనకూ మొక్కలు పెంచటం ఇష్టమేనని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చివర్లో ఒక సూచన కూడా చేసాడు.

    33 శాతానికి పెంచాలనే

    33 శాతానికి పెంచాలనే

    పర్యావరణ సమతుల్యత కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ దేశంలో ప్రస్తుతం 22 శాతం, తెలంగాణలో 24 శాతం భూభాగమే అడవులు, పచ్చదనంతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గత ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు.

    చిన్నారులతోనూ

    చిన్నారులతోనూ

    ఈ కార్యక్రమం లో భాగం గానే అక్కడికి చేరుకున్న అఖిల్. అక్కడ చిన్నారులతోనూ కాసేపు మాట్లాడాడు. మొక్కలు పెంచటం తనకూ ఇష్టమనీ...మీరూ మొక్కలు పెంచాలనీ చెప్తూ... వాళ్లతో కలిసి తనూ లాంచనం గా ఒక మొక్కని నాటాడు.

    ఆటో నడిపి

    ఆటో నడిపి

    అఖిల్ లాంటి యువ హీరోల చొరవ ఇప్పటి తరం యువతలో ఉత్సాహాన్ని నింపనుంది. ఇదివరలో కూడా ఒక బాలుడి చికిత్స కోసం ఈ అక్కినేని వారసుడు ఖమ్మం లో ఆటో నడిపిన సంగతి తెలిసిందే

    ఇంతకు ముందు లేదు

    ఇంతకు ముందు లేదు

    ఇలా సినీ ప్రముఖులు తరచుగా జనాల్లోకి రావటం ఇంతకు ముందు ఉండేది కాదు. సహాయం చేసినా వారు మాత్రం బయటికి రాకుండానే ఆ పని చేసే వారు. కానీ తరం మారింది, ఆలోచనా మారింది. ఇప్పటి హీరోలు జనాలకి ఆఫ్ స్క్రీన్ లో కూడా టచ్ లో ఉంటున్నారు.

    మేలు చేయాలన్న దృక్పథం

    మేలు చేయాలన్న దృక్పథం

    ఇది తమ కెరీర్ కి కూడా ఉపయోగ పడుతుందని వారికి తెలుసు. అయితే ముఖ్య కారణం మాత్రం వారి చొరవ ఎంతో కొంత మేలు చేస్తుందనే. తమకంటూ ఒక స్తానాన్ని ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి ఎంతో కొంత మేలు చేయాలన్న దృక్పథం వారిలో పెరుగుతోంది. మంచు ఫ్యామిలీ హీరోలు కూడా ఈ విశయం లో ముందే ఉన్నారు.

    English summary
    Tollywood upcoming actor Akhil Akkineni has participated in one of the greenary programme in Hyderabad. The actor has been invited as a chief guest in Telangana Haritha Haram programme event near to Shamsabad area.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X