»   » ‘అఖిల్’:పాత ట్రైలర్ కన్నా ఈ కొత్త ట్రైలరే బాగుంది (వీడియో)

‘అఖిల్’:పాత ట్రైలర్ కన్నా ఈ కొత్త ట్రైలరే బాగుంది (వీడియో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నవంబర్ 10న దీపావళి కానుకగా అఖిల్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. . నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తమిళ వర్షన్‌కు సంబంధించి అఖిల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంతకు ముందు తెలుగులో విడుదల చేసిన ట్రైలర్ కన్నా చాలా బాగుందని టాక్ వచ్చింది.


ఇక తాజా సమాచారనికి వస్తే..


ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చెయ్యాలని ఈ రోజు సెన్సార్ లో స్లాట్ కూడా బుక్ చేసారు. ఈ రోజు సాయంత్రానికి అఖిల్ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు.


అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే.


Akhil's new trailer impresses

నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు.


అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.


వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడు''అన్నారు.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni is getting ready to give a treat both Telugu and Tamil cinema lovers on same day. While the already released Telugu trailer of the film gave a different outlook about the film, it's the most recent Tamil trailer that is giving goosebumps.
Please Wait while comments are loading...