Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అక్కినేని అఖిల్ యాడ్ టీజర్ (వీడియో)
హైదరాబాద్: మరో అక్కినేని యువ హీరో అఖిల్ ..ప్రస్తుతం టైటాన్ వాచికి అంబాసిడర్ గా మారాడన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం అఖిల్ రీసెంట్ గా షూట్ లో పాల్గొన్నారు. దాన్ని టీజర్ గా వదిలారు. ఆ టీజర్ లో అఖిల్ లుక్ అదిరింది. ఆ టీజర్ మీరు చూడండి...
అఖిల్ హీరోగా లాంచ్ కాకముందే స్టార్ హీరోకి రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. దాంతో అతన్ని టైటాన్ వారు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవటం జరిగింది. ఇక అఖిల్ చిత్రం లాంచింగ్ విషయానికి వస్తే... మరో యంగ్ హీరో నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన కథ,మాటలుతో ఈ చిత్రం భారీగా రూపొందనుందని అంటున్నారు. వివి వినాయిక్ రీసెంట్ గా అల్లుడు శీను తో నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడుని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయటంతో ఆయనకే అప్ప చెప్పినట్లు సమాచారం.
నాగార్జున ఆ మధ్యన మాట్లాడుతూ... '' 'మనం'లో అఖిల్‌ని ముప్పై సెకన్లపాటు చూపించారు విక్రమ్. అది అభిమానులకు ఎంతగానో నచ్చింది. 'మనం'లో అఖిల్ కనిపించేది 30 సెకన్లే. అది చూసి అంచనాకు రాలేం. 30 సెకన్ల వాణిజ్యప్రకటనలో అందరూ అందంగానే కనిపిస్తారు. పూర్తిస్థాయి హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి అంటున్నారు నాగార్జున. ఆయన రెండో కుమారుడు అఖిల్ హీరోగా లాంచ్ కాబోయే చిత్రం పై అంతటా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున పుత్రోత్సాహంతో ఇలా స్పందించారు.
అలాగే నవ్వుతూ... ''అఖిల్ మరో మహేష్ అవుతాడు.. అంటుంటే అంతకంటే ఆనందం ఉంటుందా? ఇంకొంతమంది చైతూకి పోటీ వస్తున్నాడా? అని అడుగుతున్నారు. చైతన్య సంగతి పక్కన పెట్టండి. అఖిల్‌కి పోటీగా నేనున్నాను కదా.? నన్ను దాటమనండి.అఖిల్‌కి తనపై తనకు నమ్మకం ఎక్కువ. చిన్నతనం నుంచి ఇలాగే కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడు. అఖిల్ సినిమాకి నేనే నిర్మాత అని అన్నారు.