twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి మాత్రమే ఆహ్వానం... మిగతా హీరోలను కనీసం పిలవలేదా..?? ఎందుకిలా?? గుసగుసలు

    అఖిల్ నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే నాగ్ నుంచి ఆహ్వానం అందిందట. కనీసం చిరు ఫ్యామిలీలో మిగిలిన హీరోలెవరికీ పిలుపు కూడా లేదని తెలుస్తోంది.

    |

    యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం డిసెంబర్‌ 9వ తేదీన జరగనుంది. పారిశ్రామిక వేత్త సోమనాద్రి భూపాల్‌, షాలిని దంపతుల కుమార్తె కుమారి శ్రియతో అఖిల్‌ వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. డిసెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లొని జివికె నివాసంలో ఈ కార్యక్రమం జరగనుందని అఖిల్‌ తండ్రి, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సన్నిహితులకు, బంధువులకు ఆహ్వానం పంపించారు. అఖిల్‌, శ్రియ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇరు వైపుల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థ వేడుక జరుగనుంది. అయితే, ఈ శుభకార్యానికి ముఖ్యులెవరినీ నాగార్జున ఆహ్వానించలేదట.

    కేవలం కొద్దిమంది ప్రముఖులనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవుతారని అందరూ ఊహించారు. కానీ, అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ.. చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు మినహా మరెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ఇండస్ట్రీ టాక్. ఈ వేడుక‌కు చాలా త‌క్కువ మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయ‌ని స‌మాచారం. నాగ్ కుటుంబానికి అత్యంత‌ముఖ్యులైన సినీ, రాజ‌కీయ‌, వ్యాపార వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తులే ఈ నిశ్చితార్థ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. అంతా పోగేస్తే అతిథుల సంఖ్య 40 నుంచి 50 వ‌ర‌కే ఉంటుంద‌ని తెలుస్తోంది. పెళ్లి కూడా ఇట‌లీలో చేసుకోబోతున్నాడు. దానికీ త‌క్కువ‌మందే హాజ‌ర‌వుతారు. అయితే రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేయాల‌ని నాగ్ భావిస్తున్నాడ‌ట‌.

    Akkineni Nagarjuna

    పెళ్లి ఎలాగూ డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేస్తారని భావిస్తే.. నాగ్ మాత్రం దీన్ని ఫ్యామిలీ ఈవెంట్ గానే నిర్వహిస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులను మాత్రమే పిలుస్తున్నారట. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా జనాలను కూడా చాలామందిని దూరం పెట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం తెలీదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే నాగ్ నుంచి ఆహ్వానం అందిందట. కనీసం చిరు ఫ్యామిలీలో మిగిలిన హీరోలెవరికీ పిలుపు కూడా లేదని తెలుస్తోంది.

    అయితే.. పెళ్లి తర్వాత రిసెప్షన్ ని మాత్రం టాలీవుడ్ తో పాటు అందరికీ ఇన్విటేషన్లు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది మేలో అఖిల్ వివాహం జరగనుంది. ఆ సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులందరికీ నాగ్ భారీ పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేశాడట. అందువల్ల నిశ్చితార్థ కార్యక్రమాన్ని సింపుల్‌గా చేయాలని ప్లాన్ చేశాడట. ఎంత సింపులైనా, సినీ రంగానికి చెందిన పెద్దలు, సీనియర్ దర్శక నిర్మాతలు, హీరోలను కూడా ఆహ్వానించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక వేరే బలమైన కారణం ఉంటుంది అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

    English summary
    Reports are coming that Akkineni Akhil's engagement will be a close-family event with main members and relatives of both GVK and Akkineni families present. From Tollywood, only Chiranjeevi and Allu Arvind's families have got the invite as they are long-time good friends of Nagarjuna. Other Tollywood actors and friends are not invited, say sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X