» 

అక్కినేని వారి ‘మనం’ ఎంతవరకొచ్చింది?

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

హైదరాబాద్ : అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'మనం' చిత్రం ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నాగ చైతన్య-సమంతలపై సీన్లు చిత్రీకరించారు. ఇది వరకు 'ఇష్క్' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రీయ, నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా చేస్తున్నారు.

అక్కినేని నాగేశ్వరరావుకు జోడీగా బాలీవుడ్ నిన్నతరం నటి రేఖ ఎంపికయింది. ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు.

గతంలో నాగేశ్వరావు, నాగార్జున కలిసి కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

Topics: nagarjuna, akkineni nageswara rao, naga chaitanya, manam, samantha, shriya, rekha, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, మనం, సమంత, శ్రీయ, రేఖ
English summary
Akkineni's family multi-starter movie "Manam" completed its first scheduled. ANR, Nagarjuna and Naga Chaitanya, are playing the lead roles. Shriya Saran and Samantha have been roped in as the heroines opposite to Nagarjuna and Naga Chaitanya. 'Ishq' Fame Vikram Kumar is directing the film.

Telugu Photos

Go to : More Photos