»   » స్టార్ హీరోగారి తెరవెనక రాసలీలలు, భార్య స్ట్రిక్టు వార్నింగ్, ఆమెతో కనపడ్డావా తాట తీస్తా

స్టార్ హీరోగారి తెరవెనక రాసలీలలు, భార్య స్ట్రిక్టు వార్నింగ్, ఆమెతో కనపడ్డావా తాట తీస్తా

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా వాళ్లకు ఎఫైర్స్ ఎక్కువండీ, ఏ పేపరు చూసినా, ఛానెల్ తిప్పినా అవే కనపడుతూంటాయి. వీళ్ళను నమ్మలేం .ఇదీ సెలబ్రెటీల గురించి సగటు మానవుడి అంచనా. అబ్బే బయిట ఎక్కడ ఎఫైర్స్ లేవు, ఏదో సినిమా వాళ్లు గ్లామర్ పీపుల్ కాబట్టి వాళ్ల ఎఫైర్స్ కాస్త ఎక్కువగా ఎక్సపోజ్ అవుతూంటాయి అని సినిమావాళ్లు కవరేజ్ ఇండియా కార్యక్రమాలు పెడుతూంటారు.

తెలుగు పరిశ్రమలో నాగార్జున ఒక్కడికే మన్మధుడు అనే పేరు ఉంది కానీ బాలీవుడ్ లో మాత్రం చాలా మంది హీరోలకు మన్మధుడు అనే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అక్కీ లాంటివాళ్ళకు. ఒక టైమ్ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి చెప్పాలంటే అతని మన్మధ లీలలు గురించిన ప్రస్దానవ ఎక్కువ వచ్చేది.

అయితే పెళ్లైన తర్వాత మాత్రం ఆయన భార్య కంట్రోలు చేసే ప్రయత్నం చేసింది. సినీ పరిశ్రమకు చెందిన ట్వింకిల్ ఖన్నా ఎప్పుడూ తన భర్తపైనే ఓ కన్నేసి ఉండేది. అయినా ప్రియాంక చోప్రా అతని రాస లీలలు అప్పట్లో హెడ్ లైన్స్ కు ఎక్కాయి.

హీరోయిన్ తో ఎఫైర్ ఈ ఏజ్ లో

అయితే ఈ మధ్యకాలంలో జెంటిల్ మెన్ గా మారినట్లు కనిపించే అక్షయ్ మరోసారి గతంలో శ్రీకృష్ణుడు లక్షణాలను ప్రదర్శిస్తున్నట్లు , భార్యను మోసం చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ తో భార్య కళ్లు గప్పి ప్రేమాయణం నడుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

తాట తీస్తా అందిట

బాలీవుడ్ లోని ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం, అక్షయ్ కుమార్ భార్య ఈ కొత్త ప్రేమాయణాన్ని వెంటనే పసిగట్టిందని, ఆల్రెడీ అక్షయ్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చిందని రాసుకొచ్చింది. అలాగే జాక్విలన్ కు దూరంగా అక్షయ్ ని ఉండమని స్ట్కిక్టు గా ఆర్డర్స్ పాస్ చేసిందిట. అంతేకాకుండా జాక్విలిన్ తో పొరపాటున కూడా కలిసి పనిచేయటానికి వీల్లేదని తెగేసి చెప్పిందట.

మొదటి రోజుల్లోనే ఎఫైర్

అక్షయ్ కుమార్ తొలి రోజుల్లో మామూలుగా రచ్చ చేసేవాడు కాదు. అప్పట్లో ఫామ్ లో ఉన్న మోడల్ పూజ భాత్రాతో ప్రేమాయణం అప్పటివారందరికీ తెలుసు. ఆ రోజులు అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో స్ట్రగులింగ్ అవుతున్న రోజులు. కానీ ఆమె మాత్రం అప్పటిలో టాప్ రేంజిలో ఉన్న మోడల్. అందరూ అసూయపడేవారు.

ఆయేషాతో ఆహా..ఓహో అనిపించేలా

అక్షయ్ కుమార్ ..కాస్త సెటిల్ అవుతున్న దశలో పూజ భాత్రాని ప్రక్కన పెట్టి బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా జుల్తా వెనక పడ్డాడు. అఫ్ కోర్స్ ఆమె కూడా అక్షయ్ తో ఎఫైర్ నడిపింది. ఇద్దరూ కలిసి కిలాడి అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చారు. ఆ టైమ్ లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారంటారు.

ఈ ఎఫైర్ కేక అంటే కేక

రవీనా టాండన్ గుర్తుందా..బాలకృష్ణ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడులో చేసింది. ఆమెతో మనోడు అప్పట్లో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసేవాడని చెప్పుకునేవారు. ఇప్పటికీ వీళ్లదిరి సహజీవనం గురించి జనం మాట్లాడుకుంటూనే ఉంటారు బాలీవుడ్ లో . వీళ్లిద్దరూ మొదటి సారి 1994లో మొహ్రా సినిమా సెట్ లో కలిసారు. అప్పటి నుంచీ సీరియస్ గా డేటింగ్ మొదలెట్టారు.

ఈ ఎఫైర్ మీరు నమ్మరు కానీ...

సీనియర్ హీరోయిన్ రేఖ ఓ సమయంలో అక్షయ్ తో పిచ్చి ప్రేమలో పడిపోయింది. ఈ విషయంలో అప్పట్లో బాలీవుడ్ ని షాక్ గురి చేసింది. కిలోడింయోంకా కిలాడి షూటింగ్ సమయంలో ఈ ప్రేమాయణం నడిచింది. అయితే అది అతి తక్కువ కాలమే.

శిల్పాశెట్టితో నడిపాకే

తెలుగులో భలేవాడివి బాసూ, మోహన్ బాబు సినిమా వీడెవడండీ బాబూ, సాహస వీరుడు సాగరకన్య చిత్రాలు చేసిన శిల్పా శెట్టినీ మనోడు అప్పట్లో లైన్ లో పెట్టేసాడు. ఈ ప్రేమాయణం చాలా కాలం నడిచింది. అయితే అక్షయ్ జీవితంలోకి ట్వింకిల్ వచ్చాక బ్రేక్ పడింది.

కంటిన్యూ ఎఫైర్స్ కు ముగింపు

అక్షయ్ కుమార్ కంటిన్యూ గా చేసిన ఎఫైర్స్ కు ముగింపు ట్వింకిల్ ఖన్నా రూపంలో వచ్చింది. ట్వింకిల్ ఖన్నా తెలుగులో వెంకటేష్ సరసన శ్రీను చిత్రం చేసింది. ఆమెను ఓ షూటింగ్ సెట్ లో కలిసాడు అక్షయ్. ఆమె రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల కుమార్తె. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లితో ముగింపుకు వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే.

పెళ్లైనా ఆగితే కదా

అక్షయ్ కుమార్ కు పెళ్లైంది కదా ఇక ఈ ఎఫైర్స్ కు ఫుల్ స్టాప్ పెడతాడామో అని అంతా ఆశించారు. అయితే అక్షయ్ ఈ విషయంలో మహా ఫాస్ట్ . పెళ్లైన తర్వాత మెల్లిగా ప్రియాంక్ చోప్రాను దువ్వటం మొదలెట్టాడు. వీళ్లిద్దరూ కలిసి అందాజ్, ముసిసే షాదీ కరోగి, ఐత్ రాజ్, వక్త్ చిత్రాలు చేసారు.

కాదనటం ఎందుకని కమైపోయాడు

ప్రియాంక చోప్రా వ్యవహారం నడిపి, ఇంట్లో గొడవలు పడ్డ అక్షయ్ కొంత గ్యాప్ ఇచ్చాడు తన ఎఫైర్స్ కు. అయితే ఇప్పుడు మళ్లీ అక్షయ్ జీవితంలోకి జాక్విలిన్ వచ్చిందని తెలుస్తోంది. ఈ హీరోయిన్ మనోడు అంటే తెగ మనసుపడుతోందిట. సర్లే కాదనటం ఎందుకని మన హీరోగారూ కమిటైపోయారట.

మొగడు కే కాదు..ఆమెకు కూడా

తన భర్త తన కొంగు లేదా గౌన్ వదిలి మరో అందగత్తె వెనక పడటం ట్వింకిల్ ఖన్నాకు మండిపోతోందిట. జాక్విలిన్ తన కాపురంలో నిప్పులు పోసేందుకే పనికట్టుకుని వచ్చిందని అంటోంది. అంతేకాదు త్వరలో ఆమెకు కూడా ఓ స్దాయిలో వార్నింగ్ ఇద్దారమని ఫిక్సైందిట.

అలవాటైన యవ్వారమే కదా

ఇలాంటి విషయాలు అక్షయ్ కు ఓ రేంజి లైట్ అంటున్నారు. అతనికి ఇవన్నీ చాలా చాలా సాధారణం అని చెప్పుకుంటున్నారు. తన భార్య వార్నింగ్ ఇచ్చినా తన పని తనదే అన్నట్లు బిహేవ్ చేస్తున్నారట. ఇలాంటివన్నీ పట్టించుకుంటే కష్టమని తన సన్నిహితులుతో చెప్తున్నాడట. మీడియావారితో మాత్రం ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తున్నాడు.

English summary
There was a time when Akshay Kumar was famous in the industry for his flirtatious nature. Even after marrying Twinkle Khanna, his affair with Priyanka Chopra made many headlines. And now, it has been said that he is cheating on his wife for Jacqueline Fernandez.
Please Wait while comments are loading...