»   » లీకైన రోబో 2.0 ఫొటోలు : నేను పిచ్చి వాడినా? కాకినా?? అసలేం అర్థం కావటం లేదు అక్షయ్ కుమార్

లీకైన రోబో 2.0 ఫొటోలు : నేను పిచ్చి వాడినా? కాకినా?? అసలేం అర్థం కావటం లేదు అక్షయ్ కుమార్

Posted by:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కబాలి కూడా రిలీజ్ అవటంతో ఇక రజినీ కూడా ఈ సినిమా మీదనే పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

లేటెస్ట్ గా అక్షయ్ విలనీ లుక్ ఎలా ఉండబోతోందన్న దాని గురించి హింట్ దొరికింది. రోబోలో బోరా అనే సైంటిస్ట్ విలన్ గా చేస్తే, ఈ పార్ట్ లో సైంటిస్ట్ గా అక్షయ్ చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వం, రజినీకాంత్ లీడ్ రోల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలనిజం వెరసి ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. బాలీవుడ్‌లో స్టంట్స్‌కి పెట్టింది పేరైన హీరో అక్షయ్ కుమార్. అటువంటి స్టార్ హీరో ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేయడానికి అంగీకరించాడంటే మరి రజినీ హీరోయిజంని ఇంకా ఏ రేంజ్‌లో చూపించాల్సి వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైనపనేమీ కాదు.

పెద్దగా కనుబొమ్మలు, జర్కీన్ తో అక్షయ్ కుమార్ గెటప్ తెగ హల్ చల్ చేస్తోంది. చూడ టానికి కాకిలాగా వింతగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. గతంలో విక్రం హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు క్లైమాక్స్ సన్నివేశం ఓ స్టేడియం లో జరుగుతుంది. వేలాది మంది ఆడియన్స్ మధ్య... ఈ ఫోటో చూస్తుంటే అదే గుర్తుకు వస్తోంది. అక్షయ్ కుమార్ ఎగురు కుంటూ ఆ ప్రాంతానికి వస్తాడని, దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

.అయిదేళ్ళ క్రితం శంకర్ చేసిన అద్బుతం రోబో గుర్తుందికదా..!

సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కలిసి శంకర్ ఒక విజువల్ అద్బుతాన్ని చేసాడంటూ... దేశం మొత్తం ఆకాశానికెత్తేసింది. అయితే ఆ తరువాత శంకర్ కి సరైన హిట్ ఏదీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆనాటి అద్బుతానికే సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు ఈ సూపర్ దర్శకుడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కబాలి కూడా రిలీజ్ అవటంతో ఇక రజినీ కూడా ఈ సినిమా మీదనే పూర్తి దృష్టి పెట్టనున్నాడు. అయితే కబాలి ఫీవర్ తగ్గే లోపే ఈ సినిమాని కూడ పూర్తి చేయాలనే అనుకుంటున్నాడత రజిని.

ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడు.

 బాలీవుడ్‌లో స్టంట్స్‌కి పెట్టింది పేరైన హీరో అక్షయ్ కుమార్. అటువంటి స్టార్ హీరో ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేయడానికి అంగీకరించాడంటే మరి రజినీ హీరోయిజంని ఇంకా ఏ రేంజ్‌లో చూపించాల్సి వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైనపనేమీ కాదు.

రోబో లో బోరా అనే సైంటిస్ట్ విలన్ గా చేస్తే, ఈ పార్ట్ లో సైంటిస్ట్ గా అక్షయ్ చేస్తున్నాడు.

శంకర్ దర్శకత్వం, రజినీకాంత్ లీడ్ రోల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలనిజం వెరసి ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి.

రోబో-2లో అక్షయ్ కుమార్ ఓ సైంటిస్ట్‌గా నటిస్తున్నాడు.

 అక్షయ్ చేసిన ఓ క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ కారణంగా.. కాకిలా మారిపోతాడు. అలా కాకిలా మారిపోయాక.. సడెన్‌గా ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న ప్రాంతానికి ఎగురుకుంటూ వచ్చేస్తాడు. అంటూ అక్షయ్ క్యారెక్టర్ ఇదే అంటూ ఒక లైన్ కూడా వినిపిస్తోంది.

తన గెటప్ పై అక్షయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి...

 ఇప్పటివరకూ హిందీ చిత్రాల్లో హీరోగా విలన్లను రఫ్ఫాడించిన అక్షయ్‌కుమార్ ఇప్పుడు తానే విలన్ అయిపోయాడు. రజనీకాంత్ ఇచ్చే పంచ్‌లను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కాకిగా మారే పిచ్చి శాస్త్రవేత్తగా కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఆమధ్య కాకి గెటప్‌లో ఓ ఫొటో కూడా బయటి కొచ్చింది.

"నేను పిచ్చి సైంటిస్ట్‌నా? కాకినా? ఇది నాకు కొత్త న్యూస్.

ఎవరేమైనా ఊహించుకోండి. అందరి ఊహలకు భిన్నంగా కనిపిస్తా" అన్న అక్షయ్ మాటలు కూడా అతని గెటప్ మీదా రోబో2.0 మీదా కొత్త ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ చిత్రంలో అక్షయ్ మేకప్‌కే ఆరు గంటలు పట్టిందట.

విచిత్రంగా కనిపిస్తారనే టాక్ కూడా ఉంది. పబ్లిక్ స్టేడియంలో తీసిన సన్నివేశాలు కావడంతో.. కాకి గెటప్‌లో అక్షయ్ కుమార్ ఫోటోలు బయటకొచ్చేశాయి.

సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్

పాత్రకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథానుగుణంగా 2.5 బిలియన్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినికిడి.

కబాలి రిజల్ట్ ఇక ఎబౌ యావరేజ్ అని తెలిసిపోవటంతో....

 ఇక రజినీ కూడా రోబో మీదే కాన్సంట్రేట్ చేయనున్నాడు. శంకర్ కూడా బాహుబలి లాంటి సినిమా రేంజ్ లో ఇంకో విజువల్ అద్బుతంగా రోబోని సిద్దం చేయాలనుకుంటున్నాడట...

English summary
Rajanikanth starring big budget movie and the sequel to his blockbuster movie “Robot” titled “2.o”, will see Akshay Kumar in the role of evil and scary looking scientist with weird ideas.
Please Wait while comments are loading...