twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలీ పుట్టిన రోజు నాడే రిలీజ్ డేట్ ఫిక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : చాలా గ్యాప్ తర్వాత అలీ హీరోగా నటిస్తున్న చిత్రం 'అలీబాబా ఒక్కడే దొంగ'. సుజావారుణి హీరోయిన్ . ఫణిప్రకాష్‌ దర్శకుడు. బొడ్డేడ శివాజీ నిర్మాత. గురువారం నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలీ పుట్టినరోజుని పురస్కరించుకొని అక్టోబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''పోలీసు అవుదామనుకొని వచ్చి దొంగగా మారిన ఓ సరదా వ్యక్తి కథ ఇది. ఇందులోని ప్రతీ పాత్ర వినోదాన్ని పంచుతుంది. ఓ పక్క కామెడీగా ఉంటూనే, మరో పక్క చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందీ చిత్రం. ఇందులో ప్రతి పాత్రా ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది '' అన్నారు.

    Ali Baba… in third schedule

    అలీ మాట్లాడుతూ... కత్తెరకీ, జేబుకీ తెలియకుండానే పర్సును కాజేస్తాడు అలీబాబా. అతను ఒక్కడే కానీ... వంద ఇళ్లకి కన్నాలేయగల నేర్పరి. అప్పుడెప్పుడో నలభైదొంగల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నాం, విన్నాం. వారందరికంటే హుషారైనోడు ఈ దొంగ. అతని గురించి తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు అన్నారు.

    ''చాలా రోజుల తర్వాత అలీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించేలా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. దొంగగా అలీ పోషిస్తున్న పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ షెడ్యూల్‌లో టాకీభాగం చిత్రీకరణ పూర్తయింది. అలీ పుట్టినరోజుని పురస్కరించుకొని అక్టోబరు 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాత. తనికెళ్ల భరణి, షఫి, దువ్వాసి మోహన్‌, రాంజగన్‌, కొండవలస, రామరాజు, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Comedian Ali in lead 'Ali Baba Okkade Donga' directed by Phani Prakash has already completed its two schedules. Suja Varuni is starring opposite Ali in the film. The film's next schedule will start from August 1st in Hyderabad. Raghu Babu, Jeeva, Kondavalasa, Delhi Rajeswari, Tanikella Bharani, Shafi are starring in the film. Sai Srikanth is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X