»   » డర్టీ గేమ్: అలీ తమ్ముడు ఖయ్యుమ్ కూడా హీరో అయ్యాడు (ఫోటోస్)

డర్టీ గేమ్: అలీ తమ్ముడు ఖయ్యుమ్ కూడా హీరో అయ్యాడు (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుని సాంగ్స్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చిత్ర విశేషాలను తెలిపేందుకు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ..'డర్టీగేమ్‌' చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ని అభినందించాలి. ఎందుకంటే సీనియర్‌ నటులకు అవకాశాలే రాని ఈ రోజుల్లో వెతికి మరీ..సీనియర్‌ నటులందరికీ ఈ సినిమాలో అవకాశమే కాకుండా మంచి పాత్రలు ఇచ్చినందుకు. ఈ విషయంలో ఇప్పుడున్న నిర్మాతలు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి కథతో సినిమాని నిర్మిస్తున్న ఆయన ఘట్స్‌ని మెచ్చుకోవాలి. ఇటువంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

నటుడు సురేష్‌ మాట్లాడుతూ..ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం నేను మద్రాస్‌లో ఉండటం లేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఈ చిత్ర నిర్మాత అతి తక్కువ టైమ్‌లో నాకు మంచి మిత్రుడుగా మారారు. ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో నటించాను. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది..అన్నారు.

దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ..

నిర్మాత కథను నమ్మి ఖర్చుకి వెనకాడకుండా నిర్మాణాత్మక విలువలతో చిత్రీకరించడానికి అన్నివిధాలా తోడ్పాటుని అందించినందుకు కృతజ్ఞతలు. టాకీ పార్ట్‌ పూర్తయింది. సీనియర్‌ నటులే కాక, ఈ చిత్రంలో నటించిన అందరూ చిత్రీకరణకు ఎంతగానో సహకరించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం ఈ చిత్రానికి మంచి హైలైట్‌ కానుంది..అని అన్నారు.

చిత్ర నిర్మాత తాడి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ..

పక్కా ప్లానింగ్‌తో అతి తక్కువ టైమ్‌లో టాకీపార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. సినిమా నిర్మాణం గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ దర్శకుడు అనుకున్న టైమ్‌కి సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేశాడు. అలాగే చిత్రీకరణకు సహకరించిన నటులందరికీ నా కృతజ్ఞతలు. వినాయక చవితి పండుగ తర్వాత పాటల చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు.

రిలీజ్

అక్టోబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము..అని అన్నారు.

నటుడు ఖయ్యుమ్‌ మాట్లాడుతూ..

ఈ చిత్రంతో తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్నానా. మంచి పాత్రతో నన్ను హీరోగా పరిచయం చేస్తున్న దర్శకుడికి, నిర్మాతకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను..అని అన్నారు.
ఇంకా ఈ సమావేశంలో చిత్ర యూనిట్ కి సంబంధించి మరికొందరు పాల్గొన్నారు.

నటీనటులు

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్‌, అస్మిత, రమ్య, తాడి మనోహర్‌ నాయుడు, జబర్ధస్త్‌ టీమ్‌ మొదలగువారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాత: తాడి మనోహర్‌ కుమార్‌, కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.

English summary
Ali brother Khayyum turns as a hero with 'Dirty Game' movie, which will be releasing in October.
Please Wait while comments are loading...