Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరోయిన్ రాత్రిపూట లిప్ట్ అడిగితే...(వీడియో)
ముంబై : మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి అంతా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ పై పడింది. రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ , లక్ష్మీ మంచు తో రామ్ గోపాల్ వర్మ షార్ట్ ఫిల్మ్ లు చేసి వదిలారు. ఇప్పుడు అదే కోవలో బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం క్వీన్ దర్శకుడు వికాశ్ బల్ ఓ షార్ట్ ఫిల్మ్ ని చేసారు. అలియా భట్ ని ప్రధాన పాత్రలో పెట్టి ఆ షార్ట్ ఫిలిం ను రూపొందించారు. ఉమెన్ సేప్టీ థీమ్ మీద ఈ షార్ట్ ఫిలిం నడుస్తుంది.
కాన్సెప్టు ఏమిటంటే....అలియా భట్ ఒంటరిగా కారులో ప్రయాణిస్తోంది. నడిరాత్రివేళ రోడ్డుపై కారు ఆగిపోయింది. ఒక్క నిమిషం అటు ఇటూ చూసింది. ఇంతలోనే ఓ ఐదుగురు అబ్బాయిలు కారులో వస్తూ ఆమెను చూశారు. ఇది గమనించిన ఆమె భయపడలేదు. వాళ్లందరూ ఆమెను కోరుక్కు తినేసేలా చూస్తున్నారు. అయినా ధైర్యంగా వాళ్లని పిలిచి సమస్య చెప్పింది. లిఫ్ట్ ఇచ్చారు. హాయిగా ఇంటికి వెళ్లిపోయింది.
ఇదంతా నిజంగా జరిగింది కాదు. ఓ లఘు చిత్రంలోని సన్నివేశమిది. 'క్వీన్' దర్శకుడు వికాస్ భల్ దీన్ని రూపొందించారు. ఇందులో అలియా నటించింది. ఈ చిత్రం పేరు 'గోయింగ్ హోమ్'. మహిళారక్షణకు సంబంధించిన కథాంశంతో సాగే ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఆ షార్ట్ ఫిల్మ్ ను ఇక్కడ చూడండి...