twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ నన్ను దర్శకుడిగా చూడాలనుకొన్నారు.. ఆమెకు రుణపడి ఉంటా..

    నంది అవార్డు చిత్రం అలియాస్ జానకి దర్శకుడ దయా కే అలియాస్ దయానంద్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ...

    By Rajababu
    |

    నంది అవార్డు చిత్రం అలియాస్ జానకి దర్శకుడ దయా కే అలియాస్ దయానంద్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ...

    దయా కొడవటిగంటి దయానంద్ రెడ్డి బహుశా నిన్నా మొన్నటి వరకూ ఇండస్ట్రీలోని అతి కొద్దిమంది కి తప్ప బయట పెద్దగా తెలియని పేరు.. కొందరికి తెలిసినా ఫ్లాప్ డైరెక్టర్ అన్న చిన్న చూపు చూసిన పేరు.. కేవలం అవార్డు ప్రకటించటం లేటైనందు వల్ల దయా మూడేళ్ళు ఒక ఫెయిల్యూర్ లాంటి నీడని మోస్తూ బతికారు... ఇప్పుడు మాత్రం ఆఫర్లతో, అభినందనలతో మునిగిపోతున్నారు అయితే రెండుసందర్భాల్లోనూ ఒకేలా ఉన్నట్టున్నారు... "ఈ రోజు కూడా మారిపోతుంది" అన్న సూక్తి బాగాతెలుసనుకుంటా... దేన్నైనా ఒకేలా తీసుకుంటేనే ఎక్కడైనా బతగ్గలం, ఎలా అయినా గెలవగలం అన్న విషయం మరోసారి ఇక్కడ ఋజువయ్యింది. 2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన దయా కొడవటిగంటి www.oneindia.com ఆఫీస్కొచ్చారు ఫిల్మీబీట్ టీమ్‌తో కాసేపు ఇలా మాట్లాడారు.... "అలియాస్ జానకి" దర్శకుడు నంది అవార్డ్ గ్రహీత దయాకొడవటిగంటి తో పూర్తి ఇంటర్వ్యూ ఇదే..

    నా విజన్ మార్చింది పవన్ కల్యాణ్

    నా విజన్ మార్చింది పవన్ కల్యాణ్

    నటుడిని అవుదామని సినీ పరిశ్రమకు వచ్చాను. అయితే నా విజన్ మార్చి దర్శకుడిగా మారేందుకు పవన్ కల్యాణ్ దోహదపడ్డాడు. నేను డైరెక్టర్ కావాలని ఆయన కోరుకొన్నారు. ఆయన కోరుకొన్న విధంగా డైరెక్టర్‌గా మారి నంది అవార్డు కూడా అందుకొన్నాను. ఒకటి రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ కలుస్తా. నాకు నంది అవార్డును ఇచ్చిన సినిమాను ఆయన కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని అనుకొంటున్నాం.

     నంది లభించడం ఆనందంగా ఉంది.

    నంది లభించడం ఆనందంగా ఉంది.

    అలియాస్ జానకికి నంది అవార్డులు లభించడం చాలా సంతోషంగా ఉన్నాను. రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల నుంచి ఫోన్ చేయని వ్యక్తులు కూడా ఫోన్ చేసి అభినందించారు. చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా నంబర్ తెలుసుకొని ఫోన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కొత్త ఉత్తేజం కలుగుతున్నది.

    నేను పక్కా హైదరాబాదీని..

    నేను పక్కా హైదరాబాదీని..

    నేను పుట్టింది. పెరిగింది హైదరాబాద్‌లోని అంబర్‌పేట. మాది మిడిల్ క్లాస్ కుటుంబం. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి. డిగ్రీ చదివిన తర్వాత మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. ఆ తర్వాత పవన్ కల్యాణ్ గ్రూప్‌లో చేరడం గొప్ప అనుభవం. ఆయన పర్యవేక్షణలో ఫిలిం మేకింగ్‌లో చాలా మెలుకువలు నేర్చుకొన్నాను.

    చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి

    చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి

    హైస్కూల్ నుంచే నాటకాలు వేసేవాడ్ని. మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో 95-96 బ్యాచ్‌లో చేరి శిక్షణ పొందాను. మొగలిరేకులు సాగర్, ప్రభాస్ శ్రీను నా జూనియర్స్. పవన్ కల్యాణ్ వద్ద చేరిన తర్వాత ఆయన నా విజన్ అంతా మార్చివేశారు. ఖుషీకి అప్రెంటీస్‌గా చేశాను. ఆ తర్వాత జానీ నుంచి పంజా వరకు వేషాలు వేస్తూ పూర్తిస్థాయిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. దాదాపు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో దాదాపు పన్నెండ్లు పనిచేశాను. పవన్ ప్రతీ సినిమాలో ఆర్టిస్ట్‌గా చేశాను.

    నీ లక్ష్యం ఏమిటని పవన్ నుంచి ప్రశ్న

    నీ లక్ష్యం ఏమిటని పవన్ నుంచి ప్రశ్న

    జానీ స్టార్ట్ అవడానికి ముందు నీ లైఫ్ యాంబిషన్ ఏమిటీ అని పవన్ కల్యాణ్ అడిగారు. అందుకు నేను యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పాను. యాక్టర్‌గా రాణించాలంటే సినిమాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లపై అవగాహన ఉండాలి. నా దగ్గర ఉండు. అన్ని నేర్చుకో. నేను చేసే సినిమాలో వేషాలు కూడా వేయి అని పవన్ కల్యాణ్ సలహా ఇచ్చాడు. అక్కడి నుంచి దర్శకత్వం శాఖలో జీవితం ప్రారంభమైంది.

    డిజిటల్ ఫార్మాట్‌లో సినిమా

    డిజిటల్ ఫార్మాట్‌లో సినిమా

    జానీ, గుడుంబా శంకర్ చిత్రాల్లో పవన్ పక్కన పూర్తిస్థాయి పాత్ర వేశాను. గుడుంబా శంకర్ తర్వాత డిజిటల్ ఫార్మాట్‌లో ఎక్స్ పరిమెంటల్‌గా ఓ థ్రిల్లర్ సినిమా చేశాను. దానికి స్టోరి, స్క్రీన్ ప్లే చేశాను. ఆ చిత్రం హైదరాబాద్‌లో ఒక థియేటర్‌లో మాత్రమే విడుదలైంది. ఆ సినిమాకు రీచ్ లేకపోవడంతో ఆశించినంతగా ప్రయోజనం లభించలేదు. ఆ తర్వాత పరిస్థితి మొదటికి వచ్చింది.

    పవన్ కల్యాణ్ సత్యాగ్రహికి పనిచేశా

    పవన్ కల్యాణ్ సత్యాగ్రహికి పనిచేశా

    ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో మళ్లీ పవన్ కల్యాణ్ నుంచి పిలుపు వచ్చింది. ఏఎం రత్నం నిర్మాతగా, ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్‌లో పవన్ కల్యాణ్ సత్యాగ్రహి అనే సినిమాను చేయాలనుకొన్నారు. ఆ స్క్రిప్ట్ మీద పనిచేశాను. పొలిటికల్ సెటైర్‌గా రూపొందే చిత్రం కోసం రిసెర్చ్ చేశాను. కథ పూర్తిగా తయారు కాకముందే కొన్ని కారణాల వల్ల సత్యాగ్రహి ఆగిపోయింది.
    సత్యాగ్రహి ఆగిపోయిన వెంటనే అన్నవరం ప్రారంభమైంది. అన్నవరం జరుగుతుండగా జల్సా ఒకే అయింది. ఆ తర్వాత జల్సా చేశాను. జల్సా తర్వాత కొమురం పులి చేశాను. పవన్ కల్యాణ్ సినిమాలు వరుసగా చేశాను.

    గాయం2కు కోడైరెక్టర్‌గా

    గాయం2కు కోడైరెక్టర్‌గా

    కొమురం పులి ఆల్‌మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్తుండగా దర్శకుడు ప్రవీణ్ గాంధీ ఫోన్ చేశారు. తను తీసే గాయం2కు కోడైరెక్టర్‌గా పనిచేయమని పట్టుబట్టారు. దాంతో పవన్ కల్యాణ్‌ అనుమతి తీసుకొని గాయం2 చేశాను. గాయం2 చిత్రం షూటింగ్ జరుగుతుండగానే కోటా శ్రీనివాసరావు కుమారుడు మధ్యలోనే చనిపోయాడు. ఆయన పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. గాయం2 తర్వాత మళ్లీ పనిలేక పరిస్థితి రోడ్డు మీదకు వచ్చింది.

    పంజా సినిమాతో మళ్లీ కలిశా..

    పంజా సినిమాతో మళ్లీ కలిశా..

    పంజాకు పనిచేసే ఫ్రెండ్ సూచన మేరకు ఓ పాత్ర కోసం ఫొటోలు పంపించాను. దర్శకుడు విష్టువర్థన్‌కు నచ్చి కోల్‌కతాకు రమ్మన్నాడు. అక్కడ నన్ను చూసి పవన్ కల్యాణ్ ఆశ్చర్యపోయాడు. ఎమిటి ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఈ చిత్రంలో పాత్ర చేస్తున్నాను అని చెప్పాను. ఇక ఆ చిత్రం షూటింగ్ జరిగినంత సేపు పవన్‌తోనే ఉన్నాను. పంజా తర్వాత మరో ప్రపంచం అనే షార్ట్ ఫిలిం చేశాను. ఆ షార్ట్ ఫిలింకు బాగా పాపులర్ అయింది. దాంతో మంచి పేరు వచ్చింది. మంచి గుర్తింపు వచ్చింది.

    పవన్ కల్యాణ్ కారణంగానే అలియాస్ జానకి

    పవన్ కల్యాణ్ కారణంగానే అలియాస్ జానకి

    పంజా సమయంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న రిలేషన్ చూసి అలియాస్ జానకికి అవకాశం లభించింది. నీలిమా తిరుమలశెట్టి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. గాయం2 నిర్మాత ధర్మకర్త, పంజా నిర్మాత నీలిమా ఇద్దరు కలిసి చిన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకొన్నారు. ఆ మూడు ప్రాజెక్ట్‌లకు హెడ్‌గా నియమించారు. అందులో ఒకటి అలియాస్ జానకి.

    ఫస్ట్ డైరెక్షన్ చాయిస్ ఇలా..

    ఫస్ట్ డైరెక్షన్ చాయిస్ ఇలా..

    అలియాస్ జానకికి తొలుత ‘రన్ రాజా రన్' సుజిత్ డైరెక్టర్ అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను నాకు అప్పగించారు. అలా ప్రాజెక్ట్ చేసే అవకాశం మళ్లీ నాకే వచ్చింది. ఫస్ట్ మూవీ డైరెక్టర్‌గా అలా అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కథ నాది కాదు అనే సందేహం ఉండేది. అయినా నిర్మాతలు తెలిసినా వారు కావడంతో ఒప్పుకొన్నాను. డిసెంబర్ 12, 2012 (12-12-12 ) రోజున అధికారికంగా డైరెక్టర్ అయ్యాను. 2013 జనవరి 1 తేదీన ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. అలియాస్ జానకికి కొరియోగ్రాఫ్ చేశాను. యాక్షన్ సీన్లు డిజైన్ చేశాను.

    ఒక టీమ్‌గా కలిసికట్టుగా పనిచేశాం.

    ఒక టీమ్‌గా కలిసికట్టుగా పనిచేశాం.

    హీరో ఫాదర్ క్యారెక్టర్ నాగబాబు, తనికెళ్ల భరణి, పవన్ కల్యాణ్ బావమరిది హీరో వెంకట్ రాహుల్, హీరోయిన్లు రమ్యశ్రీ, అనిషా అంబ్రోస్ అందరూ టీమ్‌గా పనిచేశాం. అందరికీ అలియాస్ జానకి హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఆశించినంత మేరకు ఆకట్టుకోలేకపోయింది. కొంత నిరుత్సాహపడ్డాం. కానీ ఈ రోజు ఆ చిత్రానికి నంది అవార్డు రావడంతో అప్పుడు పడిన బాధ, నిరుత్సాహం ఇప్పుడు ఎగిరిపోయింది. అందరు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్లీ మాకు కొత్త ఉత్సాహం వచ్చింది.

    అవార్డు వచ్చిన విషయం ఆశ్చర్యమే..

    అవార్డు వచ్చిన విషయం ఆశ్చర్యమే..

    2012, 2013 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను బుధవారం (01-03-2017) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డుల ప్రకటన గురించి నాకు తెలియదు. ఎవరో ఫ్రెండ్ టీవీలో దర్శకుడు కోడి రామకృష్ణ స్పీచ్ విని నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ పెట్టగానే నిర్మాత నీలిమా గారు ఫోన్ చేసి అభినందించారు. నాకు అవార్డు లభించడం వెనుక ప్రధాన కారణం నీలిమాగారు. నీలిమాగారికి రుణపడి ఉంటా.

    అవార్డుకు పంపిందీ తెలియదు..

    అవార్డుకు పంపిందీ తెలియదు..

    అలియాస్ జానకి చిత్రాన్ని అవార్డులకు పంపించారు అనే విషయం కూడా తెలియదు. అయితే అవార్డు వచ్చిందన్న వార్తతో కొద్దిసేపు కలా నిజమా అనే సందేహంలో పడ్డాను. ఆ తర్వాత వెంటనే నాకు అనిపించిందేమిటంటే నన్ను డైరెక్టర్‌గా చూడాలన్న పవన్ కల్యాణ్ కోరిక అవార్డుతో తీరింది.

    నిజాయితీ ఉన్న కథ అలియాస్ జానకి

    నిజాయితీ ఉన్న కథ అలియాస్ జానకి

    నిజానికి అలియాస్ జానకి చిత్రం నిజాయితీ ఉన్న కథ అది. హీరో కారెక్టర్ ఓ ఐడియోలాజీ ఉన్న పాత్ర. పవన్ కల్యాణ్‌తో ట్రావెల్ చేయడం వల్ల నాకు ఆయన లానే ఆలోచించడం మొదలుపెట్టాను. కథలో ఉద్వేగం ఉంటుంది. ఆ చిత్రంలో పోలీస్ స్టేషన్ సీన్ షూటింగ్ చేసేటప్పుడే భావోద్వేగానికి గురయ్యాను. ఏడుపు ఆపుకోలేకపోయాను. అలాంటి ఇంటెన్సిటీ ఉన్న కథ అలియాస్ జానకి.

    కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల వద్దకు..

    కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల వద్దకు..

    కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయిలో ప్రమోషన్ చేయలేకపోయాం. థియేటర్లు సరిగ్గా దొరకలేదు. ఒక మంచి చిత్రం ప్రేక్షకులను చేరలేకపోయింది. అయితే సినిమా విడుదలైన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్వయంగా ఫోన్ చేసి అభినందించాయి. అయితే ఇప్పుడు అవార్డు లభించడంతో అప్పటి బాధ అంతా మాయమైంది.

    కథల విషయంలో కొంత అసంతృప్తి

    కథల విషయంలో కొంత అసంతృప్తి

    అలియాస్ జానకి తర్వాత మరో ప్రపంచం అనే షార్ట్ ఫిలిం చేశాను. బసంతి, రౌడీఫెలో, మున్నా, బంగారు పాదం అనే చిత్రంలో నటించాను. ప్రాణం అనే షార్ట్ ఫిలింతోపాటు మొత్తం తొమ్మిది ప్రాజెక్టులు చేశాను. ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ హీరోగా సిద్ధార్థ చేశాను. కథ, స్క్రీన్ ప్లే బాగా ఉంటుంది. అది కూడా ఊహించినంత విజయం సాధించలేకపోయింది. మళ్లీ ఈ చిత్రం కూడా దర్శకుడిగా నాకు అసంతృప్తిని కలిగించింది. సొంతంగా కథ నేను తయారు చేసుకొని ఉంటే సినిమాలు మంచి విజయాన్ని సాధించేవి అనే ఫీలింగ్ ఉంది.

    ఇంటర్నేషనల్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్

    ఇంటర్నేషనల్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్

    ప్రస్తుతం ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఓ తండ్రి, కూతురు మధ్య ఉన్న రిలేషన్స్, ఎమోషన్స్‌తో సినిమా చేయాలనుకొంటున్నాను. గత చిత్రాల్లో లభించని పాపులారిటీ నాకు త్వరలో చేయబోయే చిత్రం అందిస్తుంది. దంగల్ లాంటి చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తున్న సమయంలో నా సినిమాను కూడా ఆదరిస్తారని బలమైన నమ్మకం కలుగుతున్నది. ప్రస్తుతం కంటెంట్‌ను ఆదరిస్తున్నారనే విషయాన్ని దంగల్ రుజువు చేసింది.

    జీవితంలో ఊహించిన మలుపు

    జీవితంలో ఊహించిన మలుపు

    ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌తో చేసిన సినిమాలు, గాయం2, సిద్ధార్థ చిత్రాలు నాకు మంచి రేంజ్‌ను ఇస్తాయని అనుకొన్నాను. కానీ నిరాశే మిగిలింది. ఏది ఊహించనప్పడు ప్రస్తుతం అలియాస్ జానకికి రెండు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా, సరోజిని దేవి నేషనల్ ఇంటిగ్రేషన్ చిత్రంగా అవార్డులు లభించాయి. ఇక ముందు మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో భవిష్యత్ కోసం ఎదురుచూస్తున్నాను.

    మెగా హీరోలతో మంచి పరిచయం

    మెగా హీరోలతో మంచి పరిచయం

    పవన్ కల్యాణ్‌తో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడం వల్ల రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మెగా హీరోలందరు నాకు మంచి పరిచయం ఉంది. రాంచరణ్ నా బైక్‌పై తిరిగేవారు. జాగింగ్‌కు తీసుకెళ్లేవాడిని. మెగా ఫ్యామిలీలో మంచి అనుబంధం ఉంది. 2013లోనే కల్యాణ్ బాబు కథ తయారు చేసుకో.. మన బ్యానర్‌లోనే చేద్దాం అని అన్నారు. మంచి కథ దొరికితే పవన్ కల్యాణ్‌ను కలుస్తా.

    English summary
    Alias Janaki movie director Dayananda Reddy said, I fullfil Pawan Kalyan's dream. Chiranjeevi’s maternal uncle’s son Venkat Rahul debute film wons 2013 Nandi Award. In this occassion director Dayananda Reddy shared his experiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X