» 

అల్లరి నరేష్ ఇక ఎవ్వరికీ ‘దొరకడు’

Posted by:

టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా 'దొకరడు' అనే టైటిల్ ఖరారైంది. పూర్తి హాస్య భరిత చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లరి నరేష్ మేనేజర్ అమ్మి రాజు ఈచిత్రాన్ని సిరి సినిమా బ్యానర్‌పై నిర్మించనున్నారు.

'దొకరడు' అనే టైటల్ గతంలో మంచు విష్ణు-హన్సిక జంటగా రూపొందుతోన్న సినిమాకు వినిపించించింది. అయితే ఆ టైటిల్ మార్చి 'దేనికైనా రెడీ' అనే టైటిల్ ఖరారు చేశారు. 'దొకరడు' టైటిల్ ద్వారా కామెడీ సినిమాల విషయంలో తాను ఎవరికీ దొరకనంత ఎత్తులో ఉంటానని చెప్పకనే చెబుతున్నాడు ఈ అల్లరి హీరో.

గతంలో అల్లరి నరేష్, జి నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో సీమ శాస్త్రి, సీమ టపాకాయ్ కామెడి ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. 'దొరకడు' చిత్రం కూడా అదే రేంజిలో ప్రేక్షకులను అరిస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. దసరా నాటికి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆలోగా హీరోయిన్ ఎంపిక జరుగనుంది.

ప్రస్తుతం అల్లరి నరేష్ నెలతక్కువోడు, సుడిగాడు, యాక్షన్, ఆసు రాజా రాణి జాకీ జోక్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. 'సుడిగాడు' చిత్రంలో అల్లరి నరేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తమిళ సూపర్ హిట్ తమిళ 'పదం' రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేస్తున్నారు. మోనాల్ గజ్జల్ హీరయిన్‌. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.

Read more about: allari naresh, sudigaadu, dorakadu, అల్లరి నరేష్, సుడిగాడు, దొరకడు
English summary
Comedy star Allari Naresh's new movie under the direction of G Nageshwar Reddy is titled "Dorakadu". The actor is teaming up with G.Nageswara Reddy again to recreate the magic of Seema Sastry and Seema Tapakai. Ammi Raju, Allari Naresh's manager, is producing the film under Siri Cinema Banner. Dorakadu is expected to commence shooting on the auspicious day of Vijaya Dasami in October.
Please Wait while comments are loading...