twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ ఆడియో రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. . ‘నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 14న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

    అల్లరి నరేష్-విరూప ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

    ఈ సందర్భంగా... చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. అన్నీ డిఫరెంట్ సాంగ్స్. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. ఈ చిత్ర ఆడియో మే 14న విడుదల చేస్తున్నాం. సినిమాని కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

    Allari Naresh's James Bond audio Date

    కాపీనా?
    ఒకప్పుడు హాలీవుడ్ నుంచి మాత్రమే సినిమాలు ఎత్తేవారు. ఇప్పుడు కాలం మారింది. గ్లోబులైజేషేన్ నేపధ్యంలో ప్రపంచం కుగ్రామంలాగ మారింది. దాంతో ఎక్కడెక్కడ వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సినిమావారికి ప్రపంచం సినిమా బాగా దగ్గరైపోయింది. దాంతో ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే అల్లరి నరేష్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పు మంది.

    ఈ చిత్రం కొరియా చిత్రం "My Wife Is A Gangster" ఆధారంగా రూపొందుతోందని టాక్. ఈ సినిమాలో ...ఓ డాన్ కు ఓ అమాయికుడు కి మధ్య జరిగే కామెడీ తో రన్ అవుతుంది. 'జేమ్స్‌ బాండ్‌' కూడా అలాంటి కథే అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాలి. అలాగే..గతంలోనూ అల్లరి నరేష్..ఇదే బ్యానర్ లో చేసిన అహనా పెళ్లంట చిత్రం సైతం ఇదే సినిమా నుంచి తీసుకున్నది కావటం విశేషం.

    ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.

    English summary
    Allari Naresh and Sakshi Chowdary pairedup for the film, ‘James Bond’, which is being directedby Sai Kishore Macha. ‘Nenu Kaadhu Naa Pellam’ is the slogan of this film. Ramabrahmam Sunkar is producing this film under A.K.Entertainments Pvt.ltd standard and A TV is showing it. Sai Karthik created the music for this film and the sound will be propelled on May 14th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X