twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ వాయిస్ తో మరో సినిమా

    By Srikanya
    |

    హైదరాబాద్ : నేపథ్య గళం... సినిమా నేపథ్యాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి బోనస్‌గా బోలెడంత ప్రచారం కూడా తెచ్చి పెడుతోంది. ఇటీవల చాలా సినిమాల్లో ఫలానా హీరో మా సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారంటూ ప్రేక్షకుల్లో ఉత్సుకత రేకెత్తిస్తున్నారు. ఇప్పుడిది ఫ్యాషన్‌ అయిపోయింది. ఇప్పుడు ఇలా వస్తున్న చిత్రం 'అలీబాబా ఒక్కడే దొంగ'.

    అలీ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. సుజా వారుణి హీరోయిన్. ఫణిప్రకాశ్‌ దర్శకుడు. బొడ్డేడ శివాజి నిర్మాత. ఈ సినిమాకి అల్లరి నరేష్‌ నేపథ్య గళమందిస్తున్నారు. ఈ వాయిస్ ఓవర్..సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు. దర్శకుడు ఫణి ప్రకాష్ మాట్లాడుతూ " సినిమా ఆద్యంతం ఆసక్తి కరంగా, తమాషాగా ఉంటుంది. అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ వల్ల ఈ సినిమాకు మంచి శుభారంభం ఏర్పడుతుంది. ఇదొక కామెడీ థ్రిల్లర్. ఇందులో అన్ని పాత్రలూ వినోదాత్మకంగా ఉంటాయి అన్నాడ.

    నిర్మాత మాట్లాడుతూ ''పోలీసు అవుదామనుకొని దొంగగా మారిన ఓ యువకుని కథ ఇది. సినిమా పేరుకి తగ్గట్టుగానే ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. వచ్చే నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఓ ప్రముఖ హీరో త్వరలో పాటల సీడీని విడుదల చేయబోతున్నాడు. సాయిశ్రీకాంత్ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. ఇందులో ఎస్పీబాలసుబ్రహ్మణ్యం రెండు పాటలు పాడారు. ''అన్నారు. సంగీతం: సాయి శ్రీకాంత్‌, ఛాయాగ్రహణం: జాన్‌, కూర్పు: నందమూరి హరి.

    English summary
    The 50th movie of Ali as hero, ‘Alibaba Okkade Donga’ is directed by Phani Prakash and produced by Boddeda Sivaji on the banner of Kamal Cine Creations, with Suja Varuni as the heroine. The film had completed its shooting and the post-production works are nearing completion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X