twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో, యంగ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఎగేజ్మెంట్ మే 1న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.

    Allari Naresh wedding invitation

    మే 29న విరూపతో నరేష్ వివాహం జరుగనుంది. తాజాగా అల్లరి నరేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

    Allari Naresh wedding invitation

    ‘మా తమ్ముడు ఈదర నరేష్, ఈదర వీర వెంకట సత్యనారాయణ(లేట్), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు, రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూప కంఠమనేనిల నిశ్చితార్థ వేడుక ఈ రోజు(మే 1న) చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. వీరివురి వివాహాన్ని జరపడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించినారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగును. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని ప్రార్థన' అంటూ నరేష్ సోదరుడు రాజేష్ మీడియా ప్రకటన విడుదల చేసారు.

    Allari Naresh wedding invitation

    విరూపకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన అమ్మాయి. ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫ్పిల్డ్ నుండి గ్రాజ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఆర్కిటెక్టుగా పని చేస్తోంది.

    Allari Naresh wedding invitation

    వీరిది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్. అల్లరి నరేష్ కు తగిన జోడీ కోసం గత కొన్ని నెలలుగా కుటుంబ సభ్యులు అన్వేషణ సాగిస్తున్నారు.

    Allari Naresh wedding invitation

    అయితే అందుకు సంబంధించిన విషయాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

    Allari Naresh wedding invitation

    నిశ్చిర్థం ఫిక్సయ్యే వరకు అంతా గోప్యత పాటించారు. ఎట్టకేలు ఈ విషయం బయటకు రావడంతో నరేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Check out Allari Naresh wedding invitation photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X