twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో సంచలనం: రూ. 500 కోట్లతో అల్లు అరవింద్ ‘రామాయణం’

    రామాయణాన్ని 3డిలో తెరకెక్కించేందుకు ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి' తర్వాత మరో భారీ చిత్రం తెలుగు సినీ పరిశ్రమ నుండి రాబోతోంది. రామాయణాన్ని 3డిలో తెరకెక్కించేందుకు ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించారు.

    అల్లు అరవింద్‌, మధు మంతెన, నమిత్‌ మల్హోత్రా నిర్మాతలుగా తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో త్రీడీ రామాయణాన్ని రూపొందించనున్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. మేం అదే ప్రయత్నం చేయబోతున్నాం. మాకు ఇదో పెద్ద బాధ్యత'' అన్నారు.

    రూ. 500 కోట్ల బడ్జెట్

    రూ. 500 కోట్ల బడ్జెట్

    రామాయణాన్ని ఒకే పార్టులో తీయడం సాధ్యం కాదు కాబట్టి..... 3 పార్టులుగా దీన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందు కోసం రూ. 500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

    దేశ వ్యాప్తంగా క్రేజ్

    దేశ వ్యాప్తంగా క్రేజ్

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రామాయణం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. అందుకే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కించబోతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

    ఇంకా ప్రతిపాదనల దశలోనే...

    ఇంకా ప్రతిపాదనల దశలోనే...

    అయతే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇండియన్ వెండితెరపై ఈ చిత్రం బాహుబలి కంటే భారీగా నిర్మించేమందుకు ప్లాన్ చేస్తున్నారు.

    విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా

    విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా

    సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్టింగ్స్ కూడా తప్పనిసరి. అయోధ్య, లంక, ఇలా చాలా సెట్స్ వేయాల్సి ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్ లో సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటి లోపు పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

    English summary
    Allu Arvind announced his is going to Produce Ramayana Movie with Rs 500 Crore Budget in 3 languages Hindi, Tamil and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X