»   » అల్లు అర్జున్, బోయపాటి చిత్రం...వీరిద్దరే కీ రోల్స్

అల్లు అర్జున్, బోయపాటి చిత్రం...వీరిద్దరే కీ రోల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

Allu Arjun,Boyapati Movie latest info.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

English summary
Allu Arjun is busy shooting for the movie under the direction of Boyapati Srinu. The rumours doing rounds is that Allu Arjun Boyapati Srinu Movie has been titled Sarainodu. Rakul Preet Singh is paired opposite Allu Arjun in this movie. Aadhi Pinisetty will be seen in a villain role in this movie. Geetha Arts will be producing this movie.
Please Wait while comments are loading...