»   » హాట్ న్యూస్: బన్నీ'జులాయి' రిలీజ్ డేట్

హాట్ న్యూస్: బన్నీ'జులాయి' రిలీజ్ డేట్

Posted by:
Subscribe to Filmibeat Telugu
అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయాటనికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవతం చేస్తున్నట్లు గా చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియోని మే 25న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ తేదీని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు మీదున్న దేవి ఈ ఆడియోని అదరకొట్టాడని చెప్తున్నారు.

''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే...జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి అన్నారు.

అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ''అర్జున్‌ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మిస్తున్నాము. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం''అన్నారు .

ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్‌ ప్యాక్‌ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్‌. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

English summary
Allu Arjun’s next entertainer Julayi is aiming for release on the 14th of June. This is yet to be confirmed. The music has been composed by Devi Sri Prasad and the title track has been done by Rama Jogayya Shastry. The music of this movie is expected to be the next top chart buster in line.
Please Wait while comments are loading...