»   » అల్లు అర్జున్-బోయపాటి.... ఈ ఎక్స్‌ట్రా సెంటిమెంట్ ఏంటో?

అల్లు అర్జున్-బోయపాటి.... ఈ ఎక్స్‌ట్రా సెంటిమెంట్ ఏంటో?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వాళ్లు ప్రతి సెంటిమెంటును నమ్ముతారు. ఫాలో అవుతారు కూడా. ఫైనల్ గా వారికి కావాల్సింది సినిమా హిట్టు కొట్టడమే. తాజాగా బోయపాటి-అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు' విషయంలో ఇలాంటి సెంట్రిమెంటు ఫాలోఅవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇంగ్లీష్ అక్షరాల్లో ఎక్స్‌ట్రా గా మరో R చేర్చి ‘Sarainodu'ను "Sarrainodu." గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం కలిసొస్తుందని, సినిమా హిట్టవుతుందనే నమ్మకం.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. చిత్ర షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత జనవరి 25 నుండి నెక్ట్స్ షెడ్యూల్ జరుగబోతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ‘లోఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని ‘సరైనోడు'లో బన్నీతో స్పెషల్ ఐటం సాంగు చేస్తోంది.

Allu Arjun next movie title as

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

English summary
Boyapati has chosen to add an extra R to his movie title Sarainodu. The movie will now be referred in promotional activity as "Sarrainodu."
Please Wait while comments are loading...