twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి కి కౌంటర్? :'బ్రూస్ లీ' వివాదంపై అల్లు అర్జున్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' అక్టోబర్ 16న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న అక్టోబర్ 9 న గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన రుద్రమదేవి చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే వీకెండ్ లలో వర్కవుట్ అవుతోంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రం పూర్తి స్ధాయిలో ఒడ్డున పడాలంటే...రెండువారాల పాటు మరే పెద్ద సినిమాలు రంగంలోకి దిగకూడదు.

    అయితే రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం ఈ కలెక్షన్స్ కు అడ్డుకట్టవేయటానికా అన్నట్లు బరిలోకి దూకుతోంది. దాంతో థియోటర్స్ నుంచి అన్ని విషయాల్లోనూ రుద్రమదేవికు సమస్య ఎదురుకానుంది. ఈ విషయమై దాసరి సైతం విమర్శలు చేసారు. అన్ని వర్గాలు నుంచీ విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై అల్లు అర్జున్ స్పందించారు. ఆయనేం మాట్లాడారో ఇక్కడ చూడండి.


    అల్లు అర్జున్ మాట్లాడుతూ... రిలీజ్ డేట్ విషయమై బ్రూస్ లీ నిర్మాతను బ్లేమ్ చేయటం పద్దతి కాదు... వారు ఎప్పుడో చాలా కాలం క్రితమే తమ చిత్రం అక్టోబర్ 16న వస్తుందని ఎనౌన్స్ చేసారు. బ్రూస్ లీ రిలీజ్ డేట్ తెలిసే రుద్రమదేవి నిర్మాత అక్టోబర్ 9న విడుదల చేసారు. రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైనా బాగా ఆడతాయనే నమ్మకంతో విడుదల చేసారు. ఈ సమయంలో ఎవరూ బ్రూస్ లీ నిర్మాత ను ఈ విషయమై బ్లేమ్ చేయటం పద్దతి కాదు.

    allu arjun

    దాసరి మాట్లాడుతూ ''రుద్రమదేవితో పరిపూర్ణమైన దర్శకుడిగా గుణశేఖర్ కనిపించాడు. పాత్రల ఔచిత్యం ఎక్కడా చెడకుండా ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కించాడు. యువతరం తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి పెద్ద చిత్రాలు రెండు మూడు వారాల విరామంతో ప్రేక్షకుల్లోకి వెళ్లాలి. పరిశ్రమలో పోటీతత్వంతో వారానికో సినిమా విడుదల చేస్తున్నారు. థియేటర్లు దొరకడం లేదు. ఎందుకీ పోటీ? కనీసం రెండు వారాలయినా ఆగొచ్చు కదా? పెద్ద సినిమాలకి పండగలక్కర్లేదు.
    అవి ఏ రోజు విడుదలైతే ఆ రోజే పండగ. పండగలు చూసుకుని విడుదల చేసే విధానం పాటించడం చేతగాని ఎకనామిక్స్‌ అని నా అభిప్రాయం ''అన్నారు.

    allu arjun1

    రామ్ చరణ్ మాట్లాడుతూ..." తాను రూల్స్ ని బ్రేక్ చేయనని అన్నారు. బాహుబలి, శ్రీమంతుడు,కిక్ 2 నిర్మాతల మధ్య క్లియర్ గా అండర్ స్టాండిగ్ కుదిరిందని, అందుకే రెండు వారాల చొప్పున గ్యాప్ మెయింటైన్ చేయగలిగారు. అలాంటిదే రుద్రమదేవికు, బ్రూస్ లీ మధ్య అండర్ స్టాండింగ్ జరిగి ఉంటే బాగుండేది. నేను ఈ విషయమై బన్నీతో కూడా ప్రస్దావించాను. కానీ దరుదృష్టవశాత్తు..అలాంటి అండర్ స్టాండింగ్ ఏదీ జరగలేదు. అయితే ఈ హడావిడి మా ఇద్దరిలో ఎవరికీ ఎఫెక్టు కాదనే భావిస్తున్నాను. నెక్ట్స్ టైమ్ నుంచి... రెండు వారాల గ్యాప్ చూసుకునే సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటాము.. ఆగడు టైమ్ లో కూడా మా గోవిందుడు అందరి వాడేలా చిత్రాన్ని వారి రిక్వెస్ట్ మేరకు రెండు వారాలు ముందుకు వెళ్లాం ," అన్నారు.

    చరణ్ మాట్లాడుతూ... బాహుబలి రిలీజ్ సమయంలో స్వయంగా శోభు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా శ్రీమంతుడు హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివతో మాట్లాడారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అయితే నష్టాలు తప్పవని, అది రెండు సినిమాలకు మంచిది కాదని వివరించారు. కానీ ఇప్పుడు రుద్రమదేవి విషయంలో తన దగ్గరకి కానీ, నిర్మాత దానయ్య దగ్గరకు కానీ ఏ నిర్మాతా రాలేదని, తమ సినిమా వాయిదా వేయమని కోరలేదని అన్నారు. ఒకవేళ గుణశేఖర్ టీం వచ్చి అడిగితే వాయిదా విషయమై ఆలోచించేవాళ్లమని అన్నారు.

    అంతేకాకుండా తమ బ్రూస్ లీ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేసిన తర్వాతే అక్టోబర్ 9న రుద్రమదేవి, అఖిల్ చిత్రం 22 కు విడుదల తేదీలు పెట్టుకున్నారన్నాడు. తామే మొదట రిలీజ్ డేట్ అనుకున్నాం కాబట్టి తర్వాత వచ్చి డేట్స్ ఇచ్చిన వారి విషయాలు తమకు తెలియదని అన్నారు.

    English summary
    Allu Arjun said: It is unfair to blame the producer of "Bruce Lee" for not moving their release date by a week. They have announced it long back that their release date is October 16th. "Rudhramadevi" was supposed to release on September 4th which they could not for many reasons. Knowing the release date of "Bruce Lee" , the producer of "Rudhramadevi" released it on October 9th with a hope that both films can run in the market simultaneously. Now it is unfair for anyone to blame "Bruce Lee" for overlapping.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X