twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విరాజ్‌ ఆనంద్‌... 'సన్నాఫ్‌ సత్యమూర్తి' (కొత్త ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు త్రివిక్రమ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి'.

    చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్‌. బన్నీ స్త్టెల్‌, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.

    అల్లు అర్జున్‌ హీరో. సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    స్లైడ్ షోలో..ఆ ఫొటోలు

    త్రివిక్రమ్ మాట్లాడుతూ...

    త్రివిక్రమ్ మాట్లాడుతూ...

    ఇది కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలని త్రివిక్రమ్ అన్నారు.

    రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....

    రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....

    ''మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 'జులాయి' తర్వాత మళ్లీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 'జులాయి' సినిమా కన్నా పెద్ద హిట్ అవ్వాలన్న భయం, భక్తులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా చేశారు. మాతో కూడా అలా నటింపజేశారు. ఆ సినిమా కన్నా నాలుగింతలు బాగుంటుందీ సినిమా. నా డార్లింగ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపారు.

    రాజేంద్ర ప్రసాద్‌ కంటిన్యూచేస్తూ...

    రాజేంద్ర ప్రసాద్‌ కంటిన్యూచేస్తూ...

    ''జులాయి' కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' దానికి నాలుగు రెట్లు విజయం సాధిస్తుంది''అన్నారు.

    సమంత చెబుతూ....

    సమంత చెబుతూ....

    ''ఒక అందమైన కుటుంబ కథా చిత్రమిది. అల్లు అర్జున్‌తో తొలిసారి నటించాను. హార్డ్‌వర్క్‌ అనే పదానికి నిర్వచనం ఆయన'' అంది.

    సమంత కంటిన్యూ చేస్తూ...

    సమంత కంటిన్యూ చేస్తూ...

    త్రివిక్రమ్ గారి టీమ్ కు,యూనిట్ అంతా నాకు కుటుంబం లాంటిదని అన్నారు. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా మంచి అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ అన్నారు.

    ఉపేంద్ర మాట్లాడుతూ ....

    ఉపేంద్ర మాట్లాడుతూ ....

    ''చాలా కాలం తరవాత మళ్లీ తెలుగులో నటించా. చాలా మంచి పాత్ర దక్కింది. బన్నీ సినిమాలన్నీ చూస్తూ ఉంటా. తనదైన స్త్టెల్‌తో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకొన్నాడు''అన్నారు.

    ఉపేంద్ర కంటిన్యూ చేస్తూ...

    ఉపేంద్ర కంటిన్యూ చేస్తూ...

    నేను చాలా లక్కీ...నా ఫేవరెట్ స్టార్ బన్నీతో చేసే అదృష్టం దక్కింది అన్నారు.

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    అల్లు అర్జున్‌ మాట్లాడుతూ...

    '' కంటెంట్‌ ఉన్నవాడికి కటౌట్‌తో పనిలేదు.. అని హరీష్‌ శంకర్‌ ఓ డైలాగ్‌ రాశాడు. త్రివిక్రమ్‌ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్‌ ఉన్నవాడికి మ్యాజిక్‌తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయి''అన్నారు.

    నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ...

    నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ...

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్ర‌మ్ అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం త‌రువాత చేస్తున్నందున‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి అన్నారు.

    శాటిలైట్ రైట్స్

    శాటిలైట్ రైట్స్

    ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు ‘మా టీవీ' ఛానల్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఛానల్ వారు ఏకంగా రూ. 9.5 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో ఇంత పెద్ద రేటు ఇచ్చి తీసికున్నట్లు తెలుస్తోంది.

    థియోటర్ రైట్స్ సైతం.

    థియోటర్ రైట్స్ సైతం.

    ఏప్రిల్‌‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ధియేట్రికల్‌ రైట్స్‌‌ను ఇప్పటికే అమ్మేశారట నిర్మాతలు. హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్- త్రివిక్రమ్‌.. లేటెస్ట్ మూవీ రైట్స్‌‌ను యాభై నాలుగున్నర కోట్లకు అమ్మేశారట నిర్మాతలు.

    రిలీజ్ కు ముందే లాభాలు

    రిలీజ్ కు ముందే లాభాలు

    దీంతో సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతకు లాభాలు వచ్చేశాయని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ మార్కెట్‌ రేంజ్‌తో పాటు త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతోనే బయ్యర్లు ఈ రేంజ్‌లో సినిమాను కొనుగోలు చేశారని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

    ఎంత రావాలంటే...

    ఎంత రావాలంటే...

    సన్నాఫ్‌ సత్యమూర్తి మూవీని.. రేసుగుర్రం మొత్తం కలెక్షన్ల రేటుకు అమ్మేశారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాలంటే కనీసం 60 కోట్లు వసూళ్లు చేయాలి.

    హైలెట్...

    హైలెట్...

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    ఇప్పటికే

    ఇప్పటికే

    ఈ చిత్రం పోస్టర్స్, ఫస్ట్ లుక్ తో ఓ స్దాయిలో క్రేజ్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఆడియో విడుదలైతే ఇక ఎలాంటి క్రేజ్ ఉండబోతోందో అంటున్నారు.

    ఈ చిత్రం తెరముందు

    ఈ చిత్రం తెరముందు

    సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు.

    చిత్రం తెర వెనక...

    చిత్రం తెర వెనక...

    సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    ఇప్పటికే..

    ఇప్పటికే..

    ఏప్రియల్ 9న విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం రన్ టైం లెంగ్త్ మాత్రం కాస్త ఎక్కువే. 162 నిముషాలు తో చిత్రం సెన్సార్ అయింది.

    కట్ లేవు

    కట్ లేవు

    U/A స‌ర్టిఫికేట్ ఎటువంటి క‌ట్స్ లేకుండా రావ‌టం సంతోషంగా వుంది.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు.

    స్పెషల్ ఎట్రాక్షన్

    స్పెషల్ ఎట్రాక్షన్

    ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

    English summary
    As Son Of Satyamurthy movie has an ensemble star-cast including Bunny, Samantha, Nitya, Adah, Upendra, Sneha, Prakash Raj, Rajendra Prasad, Brahmi, Sampath and others, director Trivikram took his freewill to carve out a film with 162 minutes final length. Including USA premieres and other state releases, S/o Satyamurthy is ready for release on April 9, 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X