twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూలను, నెగిటివ్ టాక్‌ను డీజే ఎదురించింది.. క్రిటిక్స్‌కు అల్లు అర్జున్ చురక

    By Rajababu
    |

    విడుదలకు ముందే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకొన్న దువ్వాడ జగన్నాథం రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. తొలుత నెగిటివ్ రివ్యూలు రావడం, డివైడ్ టాక్ రావడం కొంత డీజేపై పడింది. ప్రతీ షోకు పాజిటివ్ టాక్ పెరుగడంతో ప్రేక్షకుల సందడి కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో రూ.75 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌తో పాటు స్థానిక మార్కెట్‌లో అనూహ్యమైన సక్సెస్‌ను సొంతం చేసుకొంటున్నది. ఈ నేపథ్యంలో దువ్వాడ జగన్నాథం టీమ్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో థ్యాంక్యూ మీట్‌ను జరుపుకొన్నది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేశ్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు నిర్మాతలు రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకుడు హరీశ్ శంకర్, సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.

    ప్రతికూల రివ్యూలను, మాటలను ఎదురించి

    ప్రతికూల రివ్యూలను, మాటలను ఎదురించి

    అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రతికూల రివ్యూలను, మాటలను ఎదురించి దువ్వాడ జగన్నాథం చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నది. కలెక్షన్లు కేవలం నంబర్ కాదు. చాలా మంది ప్రేమ, అభిమానం. వంద కోట్ల కలెక్షన్లు అనేవి డబ్బు కాదు. ప్రేక్షకులు ప్రేమకు నిదర్శనం అని అల్లు అర్జున్ అన్నారు. ఈ సినిమాను విజయవంతం చేసిన మెగా అభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్రంపై వచ్చిన నెగిటివిని నా పాజిటివ్ తుడిచిపెట్టేసింది. సమాజంలో అంతా పాజిటివ్‌గా ఉంటారని ఈ చిత్రం నిరూపించింది అని అన్నారు.

    అల్ట్రా మాస్ హిట్‌

    అల్ట్రా మాస్ హిట్‌

    ఫ్యామిలీ చిత్రాలు తీసే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అల్ట్రా మాస్ హిట్‌ను అందించిన దిల్ రాజుకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు. పూజ హెగ్డే గ్లామర్ చూసి యువత లవ్వు.. లవ్యోస్య.. లవ్యోభ్య అని ఫిదా అయిపోతారనే నేను చెప్పిన విషయాన్ని ఆమె రుజువు చేశారు అని స్టైలిష్ స్టార్ తెలిపారు.

    సినిమాను తక్కువ చేయొద్దు..

    సినిమాను తక్కువ చేయొద్దు..


    డీజే థ్యాంక్యూ మీట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాను తక్కువ చేయొద్దు. తెలుగు సినిమా స్టాండర్డ్ పెరగాలి. వారంలో వంద కోట్లు సాధించడమనేది మాటలు కాదు. తెలుగు సినిమాను చూసి నేర్చుకోవాలని ముంబై సినీవర్గాలు ట్వీట్ చేస్తున్నారు. మన సినిమాలను తక్కువ చేయడం మానాలి. ఏ హీరో ఫ్యాన్ అయినా మరో హీరో సినిమాలపై ప్రతికూలంగా మాట్లాడవద్దు అని సూచించారు.

    అల్లు అర్జున్‌కు రుణపడి ఉంటాను.

    అల్లు అర్జున్‌కు రుణపడి ఉంటాను.

    హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. కథ కూడా వినకుండా అల్లు అర్జున్ సినిమా చేసినందుకు రుణపడి ఉంటాను. నేను ఏడాది కష్టపడితే నేర్చుకొని శాస్త్రాన్ని, శ్లోకాలను అల్లు అర్జున్ కేవలం రెండు నెలల్లో నేర్చుకొన్నాడు. దాన్ని బట్టి అల్లు అర్జున్ ఎంత డెడికేటెడ్‌గా పనిచేశాడో.. తెలుసుకోవాలి అని అన్నారు. ఫస్ట్ లుక్, టీజర్కు వచ్చి అనూహ్యమైన రెస్పాన్స్ మాకు పాజిటివ్ వైబ్రెషన్స్ నింపాయి అని పేర్కొన్నారు.

    మరో హీరోను పోల్చడం సరికాదు

    ఈ చిత్రంలోని బ్రహ్మణ పాత్రను మరో హీరోను పోల్చడం సరికాదని, ఒకరితో పోల్చడమనే కరెక్ట్ కాదు. ఎందుకంటే అంకుశంలో రాజశేఖర్ ధరించిన పోలీస్ పాత్రకు విపరీతమైన స్పందన వచ్చింది. అంత మాత్రానా గబ్బర్ సింగ్, పటాస్, రాధ చిత్రాల్లో పోలీసు పాత్రలు తక్కువేమీ కాదని నిరూపించాయి. ఏ సినిమాలో పాత్ర ఆ సినిమాకు సంబంధించిందే. అంతేగాని దానికి మిగితా వాటికి పోలీక పెట్టడం సరికాదు అని హరీశ్ శంకర్ కొందరిపై సైటర్లు విసిరాడు.

    English summary
    Allu Arjun satire on critics at duvvada jagannadham Thankyou meet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X