twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ ఎందుకిలా మాట్లాడాడు? వివాదం పెరుగుతుందని తెలియదా.. ? అల్లు అరవింద్ సపోర్ట్ చేస్తున్నాడా

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ ఫ్యాన్స్ తో ... అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్" వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటంలేదు. ఆ విషయమై ఓ ప్రక్క రాజీ ప్రయత్నాలు అంటూ మీడియాలో వినిపిస్తూంటే, అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో సైతం అవే పదాలని బన్ని రిపీట్ చేసారు. మీడియావారు బన్నిని ...చెప్పను బ్రదర్ వివాదంపై స్పందించమంటే ఇప్పుడు కూడా తాను చెప్పను బ్రదర్ అన్నారు.

    అదేమిటంటే... 'సరైనోడు' వేడుకలో 'పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌...' అన్నారు. దాని గురించి సోషల్‌ మీడియాలో బాగా చర్చ జరిగింది?
    ఇప్పుడూ అదే మాట... 'పవన్‌ గురించి మాట్లాడను బ్రదర్‌'. ఈ ప్రశ్న తప్ప ఇంకేదైనా అడగండి అని అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పారు.

    చిరు పాటల్ని రీమిక్స్‌ చేసే అవకాశం ఉన్నా నాకు భయం. చిరంజీవిగారు ఓ పాటకు డ్యాన్స్‌ చేశారంటే అది వంద శాతం పక్కాగా ఉంటుంది. ఎలాగూ వంద శాతాన్ని దాటుకుని వెళ్లలేం. అలాంటప్పుడు ఆ రిస్క్‌ తీసుకోవడం ఎందుకు? అంటూ మనస్సులో మాట చెప్పేసారు.

    అలాగే అయాన్‌కి ఒక్కసారి స్నానం చేయించాను. స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి, నేను మ్యాట్ మీద నిలబడి, తనని నా కాళ్ల మధ్యలో నిలబెట్టుకున్నాను. అంతే.. జర్రున జారాడు. వెనక్కి బోర్లా పడ్డాడు. తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది. గుక్కపట్టి ఏడ్చేశాడు.

    దాంతో పాటు తిన్నది మొత్తం కక్కేశాడు. భయమేసేసింది. కొద్ది సేపటికి నార్మల్ అయ్యాడు. మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి, చెక్ చేయించాం. నార్మల్.. ఏం ఫర్లేదని చెప్పారు. 'నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా..?' అని మా ఆవిడ సీరియస్ అయ్యింది అంటూ పర్శనల్ విషయాలు చెప్పుకొచ్చారు.

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ చేసిన 'సరైనోడు' ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. 'ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం ఆనందంగా ఉంది' అని బన్నీ అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు చెప్పారు. అవేంటో మీరు ఈ క్రింద చదవండి..

    స్లైడ్ షోలో ఆయన ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యాంశాలు

    రివ్యూలను నమ్మను...

    రివ్యూలను నమ్మను...

    ప్రస్తుతం రివ్యూలు రాసేవారి దగ్గరి నుంచి సినిమా టెక్నీషియన్ల వరకూ అర్బన్ ఆడియెన్స్ గురించే ఆలోచిస్తున్నారు. మారుమూల ప్రాంతాల ఆడియెన్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది రాసే వారికి తెలీదు.

    క్రింద ఆడియన్స్ గురించి తెలియదు

    క్రింద ఆడియన్స్ గురించి తెలియదు

    రివ్యూలు రాసేవారంతా బాగా చదువుకుని, ఇంగ్లీష్‌ మాట్లాడేవారే. వాళ్లకి కింద ఆడియెన్స్ గురించి పెద్దగా తెలీదు.

    రివ్యూలు చదవను

    రివ్యూలు చదవను

    అయినా జెన్యూన్‌గా రివ్యూలు ఎవరు రాస్తున్నారు చెప్పండి. అలా రాసే వారుంటే అటువంటివారిని చాలా గౌరవిస్తా. అందుకే నేను రివ్యూలు చదవను.

    లెవిల్ దాటింది

    లెవిల్ దాటింది

    ఇప్పటి వరకూ నా సినిమాలు ఒక లెవల్ వరకు వెళ్లాయి కానీ, ఈ చిత్రం కింది స్థాయి వరకూ తీసుకెళ్లింది. ఇటు క్లాస్, అటు మాస్ కాకుండా యూనివర్సల్ అవ్వాలనేదే నా కోరిక. అది 'సరైనోడు'తో తీరింది.

    50 కోట్ల మార్క్ దాటేశారు... వంద దాకా?

    50 కోట్ల మార్క్ దాటేశారు... వంద దాకా?

    యాభై కోట్లు అనేది ఈ సినిమాతో కాదు.. ఎప్పుడో దాటేశా. రికార్డ్స్ గురించి మాట్లాడను. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'రేసుగుర్రం', 'సరైనోడు'.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాను.

    చదువుకోని వారికి సైతం

    చదువుకోని వారికి సైతం

    'సన్నాఫ్..', 'రేసుగుర్రం' కొంచెం క్లాస్ పర్సన్స్‌కి, చదువుకున్నవారికీ నచ్చాయి. కానీ, 'సరైనోడు' లారీ డ్రైవర్... ఆఫీస్ బాయ్.. ఇలా అందరికీ రీచ్ అయ్యింది. ఇప్పటివరకూ నేను రీచ్ కాని వారికి కూడా దగ్గరవడం హ్యాపీగా ఉంది.

    హెల్ప్ చేస్తే...

    హెల్ప్ చేస్తే...

    'రుద్రమదేవి'లో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కింద లెవల్‌కి వెళ్లడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే, 'సరైనోడు' ఫుల్‌గా చేసింది.

    మొత్తానికి ‘వూర మాస్‌'

    మొత్తానికి ‘వూర మాస్‌'

    ‘వూర మాస్‌'అలాంటి పేరూ తెచ్చుకోవాలి కదా? ఆ మాసిజాన్ని స్టైలిష్‌గా చూపించారు బోయపాటి శ్రీను. మా టార్గెట్‌ ఆడియన్స్‌ మాసే. వాళ్లకు ఈ సినిమా నచ్చాలనుకొన్నాం. అదే జరిగింది.

    ఆ లోటు తీరింది

    ఆ లోటు తీరింది

    మా సొంత సంస్థ గీతా ఆర్ట్స్‌లో దాదాపు అందరు హీరోలకీ పెద్ద విజయాలున్నాయి... నాకు తప్ప. ఆ లోటు ‘సరైనోడు' తీర్చింది.

    కొత్తగా ఉన్నా ..

    కొత్తగా ఉన్నా ..

    కొత్త కాన్సెప్ట్స్‌తో తీసే సినిమాలపై మీ అభిప్రాయం? కొత్తగా ట్రై చేయడం మంచిదే. నా మటుకు నేను కొత్తగా ఉంది కదా అని ఒప్పేసుకోను. అది బాగుందా? లేదా? అని చెక్ చేసుకుని, ఆ తర్వాతే ముందుకెళతా. కొత్తగా ఉన్నది ప్రేక్షకులకు నచ్చాలని లేదు, నచ్చకూడదనీ లేదు. బేసిక్‌గా గుడ్ ఫిల్మ్ అనేది అందరికీ రీచ్ అవుతుంది.

    తపన నాకుంది

    తపన నాకుంది

    'సరైనోడు'నే తీసుకుందాం.. కొత్తగా చేయాలనే కోరిక నాకుంది. కొత్తగా చూపించాలనే కోరిక బోయపాటికి ఉంది. నేర్చుకోవాలనే తపన నాకుంది, నేర్పించాలని ఆయనకుంది. అందుకే సినిమా బాగా వచ్చింది.

    బాగా ఖర్చు

    బాగా ఖర్చు

    సొంత సంస్థలో సినిమా కాబట్టి బాగా ఖర్చుపెట్టించుకొనే సౌలభ్యాలు ఉంటాయి. ఈ సినిమా కోసం బొలీవియాలో ఓ పాట తెరకెక్కించాం. దాని కోసం చాలా ఖర్చుపెట్టాం. సొంత సంస్థ కాబట్టి ‘ఈ పాట అక్కడే తీయాలి' అని పట్టుబట్టి మరీ చేయించుకొన్నా.

    ఓపిక లేదు

    ఓపిక లేదు

    చిరంజీవిగారికున్న ఓపిక, అంత కష్టంపడే తత్వం.. మా తరం హీరోలకి లేదు. ఆయనొక మార్గం వేశారు. ఆ బాటలో మేం వెళ్తున్నాం. వాళ్ల తర్వాత ఆ లెగస్సీ మా మీద ఉంటుందా అంటే దానిని నేను అంతగా నమ్మను.

    సంపాదించుకోవాలి

    సంపాదించుకోవాలి


    కుటుంబ నేపథ్యం అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఆ తర్వాత ఎవరి ప్రయాణం వారిదే. లెగస్సీ అనేది ఎవరిది వారు సంపాదించుకోవాలి.

    ఇష్టమే కానీ, కాపీ కొట్టను

    ఇష్టమే కానీ, కాపీ కొట్టను

    చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌ గారంటే నాకు చాలా ఇష్టం. అలాగని వారి స్టైల్‌ను నేను కాపీ కొట్టను. చిరంజీవిగారు చేసింది నేను చెయ్యాలంటే అది నావల్ల కాదు. ఎవరి స్టైల్‌ వారికుండాలి.

    జనాలకి నచ్చాలి

    జనాలకి నచ్చాలి

    కొత్త కథ చూస్తున్నామా, రొటీన్‌ సినిమానే చూస్తున్నామా? అనే ఆలోచన ప్రేక్షకులకు ఉండదు. కొత్త కథ అయినా, పాత కథ అయినా జనాలకు నచ్చాలి. అంతే.

    జడ్జ్ చేయటం కష్టమే

    జడ్జ్ చేయటం కష్టమే

    సరైనోడు చిత్రకథ విని, రిజల్ట్‌ని జడ్జ్ చేయడం కష్టం. హీరోను ప్రెజెంట్ చేసే విధానం, ఆడియోను సరైన చోట ప్రెజెంట్ చేయడం, యాక్షన్ పార్ట్ వంటివన్నీ సరిగ్గా కుదిరితే 'ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం'. ఈ సినిమాకి బోయపాటి అన్నీ చక్కగా కుదిరేలా చేశారు.

    ఊహించలేం

    ఊహించలేం

    కొన్ని చిత్రాలకు ముందే రిజల్ట్ ఊహించడం కష్టం. 'ఆర్య'ను తీసుకుందాం. క్యారెక్టర్‌ని ఫాలో అయ్యే సినిమా అది. కొన్ని చిత్రాలు స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా ఉంటాయి. ఒక్కో ఫిల్మ్ ఒక్కో దాన్ని బేస్ చేసుకుని వెళుతుంటుంది.

    ఊహించలేం

    ఊహించలేం

    కొన్ని చిత్రాలకు ముందే రిజల్ట్ ఊహించడం కష్టం. 'ఆర్య'ను తీసుకుందాం. క్యారెక్టర్‌ని ఫాలో అయ్యే సినిమా అది. కొన్ని చిత్రాలు స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా ఉంటాయి. ఒక్కో ఫిల్మ్ ఒక్కో దాన్ని బేస్ చేసుకుని వెళుతుంటుంది.

    ఈ రోజుల్లో కష్టం

    ఈ రోజుల్లో కష్టం

    ఇప్పట్లో మాత్రం పర్‌ఫెక్ట్ స్టోరీతో నడిచే చిత్రాలంటే కష్టమే. నేను చేసినవాటిలో 'పరుగు' అలాంటి సినిమానే. మంచి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ.

    ఈ రోజుల్లో కష్టం

    ఈ రోజుల్లో కష్టం

    ఇప్పట్లో మాత్రం పర్‌ఫెక్ట్ స్టోరీతో నడిచే చిత్రాలంటే కష్టమే. నేను చేసినవాటిలో 'పరుగు' అలాంటి సినిమానే. మంచి స్టోరీ ఓరియెంటెడ్ మూవీ.

    ఫైట్స్ లేకుండా

    ఫైట్స్ లేకుండా


    సినిమాలో ఫైట్స్ లేనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే హై కంటెంట్ ఉండాలి. అది ఉన్నప్పుడు చేయొచ్చు.

    '24' చిత్రం... మీ చిత్రం కలెక్షన్లపై ప్రభావం

    '24' చిత్రం... మీ చిత్రం కలెక్షన్లపై ప్రభావం

    ఒక ప్రాంతీయ చిత్రాన్ని ఎప్పుడూ ఓ డబ్బింగ్ సినిమా బీట్ చేయలేదు. ఎంత స్ట్రాంగ్ హీరో వచ్చినా కూడా. ఇక్కడ నా సినిమా వంద శాతం వసూలు చేస్తే, తమిళంలో ఇరవై నుంచి ముప్ఫై శాతం చేస్తుందంతే. అదే సూర్యగారి సినిమా తమిళంలో వంద శాతం వసూలు చేస్తే, ఇక్కడ ఇరవై నుంచి ముప్ఫై శాతం రాబడుతుంది. రజనీకాంత్‌గారు సీనియర్ కాబట్టి ఆయన సినిమా ఇక్కడ యాభై నుంచి అరవై శాతం వసూలు చేస్తుంది.

    మెచ్యూర్ గా

    మెచ్యూర్ గా

    గతంతో పోలిస్తే మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు... వయసు పెరుగుతోంది కదండీ. దాంతోపాటు అవగాహనా పెంచుకోవాల్సిందే. నా బలాలేంటి? బలహీనతలేంటి? అనే విషయంపై నాకు అవగాహన ఉంది. నా పరిమితులు నాకు తెలుసు.

    తప్పకుండా చేస్తా

    తప్పకుండా చేస్తా

    తెలుగు పరిశ్రమలో మంచి కథలు లేవు. ప్రయోగాత్మక చిత్రాలు చేసే దర్శకులు లేరు. ఒకవేళ సాహసం చేసి ఓ హీరో ముందుకొస్తే అతన్ని కథకు తగ్గట్టు మలచుకునే ప్రయత్నం కూడా చేయరు. అందుకే నేను ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉంటా. దమ్మున కథ కుదిరితే తప్పకుండా చేస్తా.

    మార్పు రావాలి

    మార్పు రావాలి

    తమిళంలో విక్రమ్‌, సూర్య వంటి హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. వాళ్లకి కథలు కుదురుతున్నాయి. మన దగ్గర హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో మార్పు రావాలి. అప్పుడే మంచి కథలు, సినిమాలు వస్తాయి. తమిళ హీరోల సినిమాలు ఇక్కడ బాగా ఆడుతున్నాయి. మనం కూడా అక్కడ మార్కెట్‌ పెంచుకోవాలి.

    ఇదే ఎక్కువ

    ఇదే ఎక్కువ

    నాకున్న లుక్స్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి ఇంతదూరం రావడం ఎక్కువ. వచ్చేశా. ఇంకో 20 ఏళ్ల కెరీర్ ఉంటుందేమో. ఇలానే కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను.

    మా ఆవిడ

    మా ఆవిడ

    నా సినిమాలు మా ఆవిడ స్నేహ పెద్దగా పట్టించుకోదు. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటుంది. అదే బెస్ట్.

    తికమకగా ఉంటా

    తికమకగా ఉంటా

    నేను మాత్రం సినిమా విడుదలకు మూడు రోజులు ముందు, తర్వాత ఓ మూడు రోజులు కొంచెం తికమకగా ఉంటా. నా మూడ్‌ను అర్థం చేసుకుని ఆ టైమ్‌లో మా ఆవిడ కూడా ఏమీ మాట్లాడదు.

    బలమైన కారణం

    బలమైన కారణం



    కొన్ని సినిమాల ఫలితం ముందే తెలిసిపోతుంది. నా సినిమా అయినా సరే, ఓ ప్రేక్షకుడిగానే చూస్తా. ముందు నాకు నచ్చితే అప్పుడు ఫలితం గురించి పట్టించుకోను. ఓ సినిమా బాగా ఆడినా ఆడకపోయినా ఏదో ఓ బలమైన కారణం ఉండి ఉంటుంది.

    హోం వర్క్

    హోం వర్క్

    సెట్‌కి వెళ్లే ముందు రేపటి సన్నివేశం ఏమిటి? ఏం తీస్తున్నాం అనే విషయాల్ని దర్శకుడితో కూర్చుని చర్చిస్తా. నావరకూ కొత్తగా ఏం చేయగలను? అనే విషయాలపై దృష్టి పెడతా.

    పుట్టిన రోజు విదేశాల్లో ఎందకంటే

    పుట్టిన రోజు విదేశాల్లో ఎందకంటే

    మా అబ్బాయి పుట్టినరోజును ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇక్కడ కాకుండా విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే వన్ ఇయర్, టు ఇయర్స్ పిల్లలకి ఎంత గ్రాండ్‌గా బర్త్‌డే చేసినా, అది వాళ్లకు తెలియదు. ఆ టైమ్‌లో అందర్నీ పిలిచి సెలబ్రేట్ చేస్తే అందరూ ఎవరికి వాళ్లు మాట్లాడుకోవడం తప్ప పిల్లలకు సెలబ్రేట్ చేసినట్టుండదు.

    ఎంజాయ్ చేసే చోటకే

    ఎంజాయ్ చేసే చోటకే


    నాకు తెలిసి నాలుగేళ్లో, ఐదేళ్లో వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తే వాడి ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే ఊహ తెలిశాక ఇక్కడ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మాత్రం పిల్లలను ఎక్కడికి తీసుకెళితే ఎంజాయ్ చేస్తారో అక్కడి తీసుకెళుతున్నాను.

    చూడమంటాడు

    చూడమంటాడు

    విదేశాలకు వెళ్ళిపోతే తగినంత ప్రైవసీ ఉంటుంది. అక్కడ జూకు తీసుకెళితే జంతువులను చూసి, ఎంజాయ్ చేస్తాడు. నేను వాటివైపు చూడకపోతే నన్ను 'నాన్నా నాన్నా' అని పిలుస్తాడు. అప్పటికీ చూడకపోతే 'అర్జున్' అని పిలుస్తాడు.

    మా ఆవిడ పిలుపు విని

    మా ఆవిడ పిలుపు విని

    మా అబ్బాయికి అర్జున్ అనే ఆ పిలుపు ఎలా అలవాటైందంటే.. మా ఆవిడ అలానే పిలుస్తుంది. అది వింటాడు కదా.

    తేడా కనిపిస్తుంది

    తేడా కనిపిస్తుంది



    ‘గంగోత్రి' సమయంలో నాకు సినిమా గురించి తెలీదు. రాఘవేంద్రరావు గారు చెప్పారు, నేను చేసేశానంతే. ‘ఆర్య' వచ్చేసరికి చాలా విషయాలు అర్థమయ్యాయి. అందుకే ‘గంగోత్రి'కీ, ‘ఆర్య'కీ చాలా తేడా కనిపిస్తుంది.

    దాక్కోవాలనిపిస్తుంది

    దాక్కోవాలనిపిస్తుంది

    ‘గంగోత్రి' ఇప్పుడు చూస్తే దాక్కోవాలనిపిస్తుంది... (నవ్వుతూ). సాధారణంగా నా పాత సినిమాలు, నా పాత పాటలు ఎక్కువగా చూస్తుంటా. ఎక్కడ ఎదగాలో, ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

    కష్టం

    కష్టం

    బన్నీతో డాన్స్ చేయడం కష్టమని నాతో చేసిన హీరోయిన్స్ అందరూ అంటారు. అందుకు కారణం నేను చేసే ప్రాక్టీస్‌. హీరోయిన్లు అప్పటికప్పుడు ప్రాక్టీస్‌ చేయడం వల్ల వాళ్లకి కాస్త కష్టంగా అనిపిస్తుందేమో.

    ప్యూచర్ లో చేయలేను

    ప్యూచర్ లో చేయలేను

    ఫ్యూచర్‌లో ఇప్పటితో పోల్చితే పది శాతం డాన్స్ చేయలనేమోగానీ అంతకమించి అయితే చేయలేను. ఆ జోరు అయిపోయింది.

    త్వరలో

    త్వరలో

    మనం దర్సకుడు విక్రమ్‌కుమార్‌తో ఓ సినిమా అనుకుంటున్నా. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.

    మూడ్ లేదు

    మూడ్ లేదు


    మల్టీస్టారర్‌ చేసే మూడ్‌ లేదు. కానీ స్పెషల్‌ క్యారెక్టర్‌ చేయడానికి రెడీగానే ఉన్నా.

    కష్టం

    కష్టం

    విదేశాలు వెళ్లేటప్పుడు కూడా ఒక మనిషిని తీసుకెళతాం. కానీ, ఎంత తీసుకెళ్లినా స్విమ్మింగ్ పూల్‌లో దిగినప్పుడో, జూకి వెళ్లినప్పుడో మనమే జాగ్రత్తగా బాబుని ఎత్తుకోవాలి కదా. అప్పుడు నా చేతులు నొప్పి పుడతాయి చూడండీ.. మామూలుగా ఉండదు. అయ్య బాబోయ్.. పిల్లల్ని పెంచడం చాలా కష్టమండీ బాబు. కొంతమంది ఎవరి హెల్పూ లేకుండా పెంచుతారు. వాళ్లకు జోహార్లు చెప్పాల్సిందే.

    బోర్, అప్ డేట్

    బోర్, అప్ డేట్

    నా డ్యాన్స్‌ నాకే బోర్‌ కొడుతోంది. నా బాడీ ఎంత తిరగాలో అంతా తిరిగేసింది. ఇప్పుడు నా నటనతోనే వాళ్లని మెప్పించాలి. అలాగని డ్యాన్స్‌ని వదల్లేను కదా? నా పరిధిలోనే ఎంత చేయాలో అంతా చేసి చూపించాల్సిందే.

    బాహుబలి పాటలంటే ఇష్టం

    బాహుబలి పాటలంటే ఇష్టం

    ‘‘వీలున్నప్పుడల్లా అయాన్‌తో సమయం గడుపుతున్నా. వాడు నా సినిమాలు ఇంకా చూళ్లేదు. వీడియోగేమ్స్‌కి అలవాటు పడిపోతాడేమో అని ఇంట్లో టీవీ తీసేశా. నా సెల్‌ఫోన్‌లో అప్పుడప్పుడూ పాటలు చూస్తుంటాడు. వాడికి ‘బాహుబలి' పాటలంటే ఇష్టం.''.

    డైట్, జిమ్

    డైట్, జిమ్

    ‘‘సరైనోడు' సమయంలో కండలు పెంచాల్సివచ్చింది. అందుకే కొత్త డైట్‌ విధానం ఫాలో అయ్యా. రోజుకి ఆరు విడతలలో భోజనం చేసేవాణ్ని. సినిమా అయిపోయింది కదా? ఇప్పుడు రెగ్యులర్‌ డైట్‌లోకి వచ్చేశా. షూటింగ్‌ ఉన్నప్పుడు వారానికి నాలుగుసార్లు జిమ్‌ చేస్తుంటా. లేదంటే రోజుకి రెండు పూటలూ జిమ్‌లో గడుపుతా''

    డీసెంట్ గా ఉన్నా

    డీసెంట్ గా ఉన్నా

    పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా? ఫ్రెండ్స్‌తో కొంచెం సరదాగా ఉంటా. పబ్లిక్ ఫంక్షన్లో డీసెంట్‌గా ఉంటా. స్టేజ్‌పైన ఉన్నప్పుడు సరదాగా మాట్లాడే మాట ఒక్కోసారి ఎక్కడికో దారి తీస్తుంది.

    వీలైనంతవరకూ జాగ్రత్త

    వీలైనంతవరకూ జాగ్రత్త

    కావాలని అలా అనకపోయినా కొంతమందిని ఆ మాటలు హర్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆలోచించుకుంటే... ఏంటీ.. అలా మాట్లాడేశామని అనిపిస్తుంది. అందుకే పబ్లిక్ ఫంక్షన్స్‌లో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉంటా.

    సీ క్లాస్ పల్స్

    సీ క్లాస్ పల్స్

    ‘‘రివ్యూలు రాసేవాళ్లకు సినిమా గురించి తెలీదేమో అనిపిస్తుంటుంది. 4జీ, వాట్సాప్‌ అంటూ ఎక్కడో ఉండిపోయారు. వాళ్లకు సీ క్లాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ ఎలా తెలుస్తుంది? సినిమాని సినిమాలా చూసి సమీక్షించేవాళ్లు నాకు ఇక్కడ కనిపించడం లేదు''

    బాలయ్యని

    బాలయ్యని

    బాలకృష్ణగారితో బోయపాటి వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ తరువాత ఏ హీరోతో సినిమా చేసినా.. ఆ హీరోని బాలకృష్ణగారిలానే చూపిస్తారేమో అనుకుని ఉంటారు. బాలకృష్ణగార్ని ఎలా ప్రెజెంట్ చేయాలో ఆయన్ను బోయపాటి అలానే ప్రెజెంట్ చేశారు.

    హీరో ఎలా ఉంటే

    హీరో ఎలా ఉంటే

    'సరైనోడు' షూటింగ్ సమయంలో 'నాకు మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్, మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ సినిమా తీస్తా' అని బోయపాటి అన్నారు. హీరో ఎలా ఉంటే దానికి తగ్గట్టు సినిమా తీస్తారాయన. 'హీ ఈజ్ వెరీ గుడ్ డెరైక్టర్'.

    నేను హ్యాపీనే

    నేను హ్యాపీనే

    నన్ను బోయపాటి ప్రెజెంట్ చేసేటప్పుడు ఏ స్థాయిలో పుష్ చేయాలో అంతే చేశారు. ఎంత పుష్ చేయాలో, ఎక్కడ ఆపాలో తెలిసిన వ్యక్తి. ఊర మాస్‌గా కనిపించడంతో మీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు... అభిమానులు హ్యాపీ అంటే నేను హ్యాపీనే.

    టాక్ తో సంభంధం లేకుండా

    టాక్ తో సంభంధం లేకుండా

    మార్నింగ్‌ షో టాక్‌కి కలెక్షన్లకి సంబంధం లేకుండా సినిమా విజయవంతం కావడం, వంద కోట్ల క్లబ్‌కి చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ సినిమా కలెక్షన్ల గురించి పట్టించుకోలేదు. అసలు మన సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది అనేదానికోసం కలెక్షన్ల వైపు కాస్త దృష్టిపెట్టా. నిర్మాతగా మా నాన్న రిటైర్‌ అయ్యేలోపు మా బ్యానర్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని నా ఆశ. అది ఈ సినిమాతో నెరవేరింది.

    English summary
    And now, in Allu Arjun's latest interview to a popular media house, Bunny was asked about his "Cheppanu Brother" comment. To everyone's surprise, Bunny once again repeated his stance and said that his reply to any question regarding Pawan would again be "Cheppanu Brother".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X