twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ కోసం: ముద్దు సీన్లకు అల్లు అర్జున్ దూరం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ గత చిత్రాలు పరిశీలిస్తే....ఆర్య 2, వరుడు, వేదం చిత్రాల్లో ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయి. ముఖ్యంగా వరుడు చిత్రంలో బానుశ్రీ మెహ్రాతో అల్లు అర్జున్ చేసిన ముద్దు సీన్ యమ ఘాటుగా ఉండటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఆ ముద్దు సీన్ సినిమాను విజయతీరానికి చేర్చలేక పోయింది.

    వరుడు చిత్రం మాత్రమే కాదు...దీనికంటే ముందు వచ్చిన ‘ఆర్య 2' చిత్రంలో హీరోయిన్ కాజల్‌ పెదాలను అల్లు అర్జున్ తన పెదాలతో అందుకోవడం కూడా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘వేదం' చిత్రంలోనూ దీక్షా సేత్‌ అధరామృతాన్ని అందుకున్నాడు. వరుసగా చేసిన మూడు చిత్రాల్లో ముద్దుల వర్షం కురిపించాడు అల్లు అర్జున్.

    అయితే పెళ్లయిన తర్వాత అల్లు అర్జున్ అలాంటి సీన్లు దూరంగానే ఉంటున్నారు. అంతే కాదండోయ్...ఇకపై అలా సీన్లు చేయను అంటున్నారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్ తో ముద్దు సీన్ చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

    నేను మొదటినుంచి లిప్‌లాక్‌ కిస్సింగ్‌లకు వ్యతిరేకం. గతంలో కొన్ని సినిమాలు చేశానంటే..అప్పుడు బ్యాచిలర్‌ను కాబట్టి అందులోనూ పాత్ర డిమాండ్‌ చేయడం వల్ల తప్పలేదు. ఇకపై మాత్రం అలాంటి సీన్లలో నటించను. అలాంటివి ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడటానికి కూడా ఇష్టపడరు, పైగా ఇప్పుడు నాకు కూడా ఫ్యామిలీ ఉందని చెప్పుకొచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Allu Arjun says no to Lip-Lock scenes

    ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. జులాయి తర్వాత బన్నీతో తాజాగా మరో సినిమా చేస్తున్న త్రివిక్రమ్...ఈ సారి మాత్రం తనకు అలాంటి అపకీర్తి రాకూడదనే ఆలోచనలో ఉన్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

    వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు.

    హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

    దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం కూడా ఖరారైంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైంది. ఇటీవలే ఈ దర్శకుడు నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి విజయ్ కుమార్ కొండ మాట్లాడుతూ...‘అల్లు అర్జున్‌ను కలిసి ఇటీవల ఓ స్టోరీ గురించి చెప్పాను. అతనికి చాలా నచ్చింది. నాతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు. అయితే ఈ సినిమా ఇంకా అపీషియల్‌గా ఓకే కాలేదు. ప్రాజెక్టు ఇంకా మెటీరియలైజ్ కావడానికి సమయం పడుతుంది' అని తెలిపారు. స్ర్కిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత సినిమాను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

    English summary
    Stylish Star Allu Arjun is now saying no to lip locks. After becoming a husband and after turning into a father, Allu Arjun is stated to have decided to move away from the scenes which his family feels tough to watch along with other family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X