twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "చిరంజీవి గారి నీడ నుంచే పై కొచ్చాం": అల్లు అర్జున్‌ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : '' ఈ వేదిక మీద నా చరిత్ర చెప్పాల్సి వస్తే... నా వెనుక ఉన్న చరిత్ర చిరంజీవిగారే. ఆయన ఎండలో కష్టపడితే మేము ఆయన నీడ నుంచి పైకొచ్చాం. మీ అభిమానంతో ఇంత స్థాయికొచ్చాం. నాకు ఎవరైనా చిరంజీవిగారి తర్వాతే. ఆయన నాతో ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు 'ఎవరినైనా బాధపెట్టడం చాలా సులువు. వారి మనసులోకి వెళ్లడం కష్టం' అనేవారు. ఆయన మాటలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాను'' అల్లు అర్జున్‌ మాట్లాడుతూ అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, రానా ఇతర ప్రధాన పాత్రధారులు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో తెరకెక్కిన చిత్రమిది. ఇళయరాజా స్వరాలందించిన ఈ చిత్రంలోని మూడు పాటలను ఆదివారం రాత్రి వరంగల్‌లో విడుదల చేశారు. ఆయన ఇంకేం మన్నారో స్వయంగా ఈ వీడియోలో చూడండి.

    అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తూ....ఇలాంటి సినిమాలో నేనూ ఒక భాగం కావడం నా అదృష్టం. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అని నన్నెవరైనా అడిగితే నేను చెప్పే సమాధానం ఒక్కటే. నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. తెలుగు సినిమా ఒక మెట్టు పైకెక్కడానికి ఉపయోగపడే సినిమాలో నేనూ నటించాలి అనిపించింది. అందుకే 'రుద్రమదేవి' చేశా. కథానాయిక ప్రాధాన్యంగా చరిత్రను చెప్పే సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రారు.

    గుణశేఖర్‌ మాత్రమే ఆ ధైర్యం చేశారు. ఇది ఆయనకే సాధ్యం. ఆయన ఎప్పుడో దర్శకుడు అయినా పెద్దగా డబ్బు సంపాదించలేదు. ఆయనతో గతంలో ఓ సినిమా చేశా. కానీ అది పెద్దగా ఆడలేదు. కానీ ఆయనతో మరో సినిమా చేయడానికైనా ఎప్పుడైనా సిద్ధం. ఇలాంటి దర్శకుడితో సినిమా చేసినందుకు గర్విస్తున్నాను. ఈ సినిమా కాకతీయుల చరిత్రను తెలిపేది.

    Allu Arjun Super Speech - Rudhramadevi Audio Launch @ Warangal

    అలాగే...''ఈ సినిమాకు హీరో అనుష్కనే. ఆమె కాబట్టే ఈ సినిమా తీయగలిగారు. వేరొకరెవరైనా ఈ సినిమా కార్యరూపం దాల్చేది కాదు. ఈ సినిమా చేసినందుకు అనుష్కకు ధన్యవాదాలు'' అన్నారు ఆ తర్వాత 'నేను తెలుగు భాష లెక్క... ఆడా ఉంటా... ఈడా ఉంటా' అంటూ తనదైన శైలిలో సంభాషణ చెప్పి అలరించారు బన్నీ.

    English summary
    Watch Allu Arjun Super Speech - Rudhramadevi Audio Launch Warangal. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X